దేవి దండం ఎందుకు చేయాలి??

 

లింగభైరవి దేవి ఆలయంలో ప్రత్యేకమైన "దేవి దండం" ఎందుకు చేయాలో, అలా చేయడం ద్వారా కలిగే లాభాలేంటో సద్గురు చెబుతున్నారు.

ప్రశ్న: నేను లింగభైరవి ఆలయానికి వెళ్ళినప్పుడు, నేను ఇంతకు ముందు ఎక్కడా చూడని విధంగా పురుషులు మరియు మహిళలు సాష్టాంగం చేశారు. సాధారణంగా దేవాలయాలలో పురుషులు పూర్తిగా సాష్టాంగం చేస్తారు, స్త్రీలు సగం సాష్టాంగాన్ని చేస్తారు. మరొక ప్రశ్న, అనేక దేవాలయాలలో మనం సవ్య దిశలో కదులుతాము. కానీ ఇక్కడ మేము ఒక అపసవ్య దిశలో కదిలాము. ఎందుకిలా?

సద్గురు: ఆమె ఒక స్త్రీ, కాబట్టి ఇక్కడ నియమాలు భిన్నంగా ఉంటాయి! మీరు చూసిన సాష్టాంగాన్ని ‘దేవి దండం’ అని పిలుస్తారు. ఇది మేము 'భైరవి'గా పిలుస్తున్న ఈ శక్తిని, మీరు మీ ఎడమవైపు నుండి గ్రహించడం ఉత్తమమైనది. మీరు దేవి దండం చేస్తే, మీ భంగిమ మీ కుడి వైపు మూసివేసేటట్టు చేస్తారు, తద్వారా మీ ఎడమ వైపు మరింతగా(అనుగ్రహాన్ని) గ్రహించేందుకు అనువుగా ఉంటుంది. ఇది కుడి ముక్కు రంధ్రం మూసివేస్తే, ఎడమ ముక్కు రంధ్రం ఎక్కువ శ్వాస తీసుకోవడం వంటింది. మీరు ఎడమ పక్క నుంచి శ్వాసను రెండింతలు తీసుకోలేక పోయినా, కనీసం ఒకటిన్నర లేదా ఒకటి పైన మూడు వంతులు సాధారణంగా తీసుకోగలుగుతారు. అదేవిధంగా, దేవి దండం వేయడంతో కుడి వైపు మూసివేయడం ద్వారా, ఎడమ వైపు మరింతగా తెరుచుకుంటుంది. దేవి యొక్క శక్తిని మీరు స్వీకరించేలా దేవి దండం రూపొందించబడింది. ఎందుకంటే, ఎదో సంప్రదాయంలో అందరూ చేస్తున్నందున మీరు అలా చేయడానికని మీరు అక్కడకు రాలేదు. మీరు ఇక్కడకు దేవి శక్తిని గ్రహించేందుకు వచ్చారు.

లింగ భైరవికి పిచ్చి భక్తి అవసరం, లేదంటే ఆమె మీకు పలుకదు.

ధ్యానలింగంలో ఆ రకమైన దండం చేయము. ఆయనకు మీరు సాష్టాంగం చేయాల్సిన పని లేదు. ధ్యానలింగంలో, మీ భక్తి అనేది మిమల్ని సుముఖులుగా చేయడానికి అవసరం. ఆయన మీ భక్తిని కోరుకోలేదు, ఆయనకు శ్రద్ధ, తదేక దృష్టి అవసరం. లింగ భైరవికి పిచ్చి భక్తి అవసరం, లేదంటే ఆమె మీకు పలుకదు. వీరు ఇరువురు సృజించ బడ్డ మార్గం చాలా భిన్నమైనది.

మీరు దేవి చుట్టూ ప్రదక్షిణం చేయడం లేదు. ఒకవేళ మీరు ఆమె చుట్టూ ప్రదక్షిణం చేస్తునట్లయితే, అది సవ్య దిశలో చేసేవారు, అపసవ్యంగా కాదు. కానీ మీరు ఆమె ముందు నుంచి మాత్రమే వెళుతున్నారు, కాబట్టి ఆమె ఎడమ వైపు నుండి వెళ్లడం ఉత్తమం, ఎందుకంటే ఆమె అలా సృజించబడింది. కుడి వైపు నుండి వెళ్తే ఎటువంటి హానీ లేదు కానీ ఎడమ పక్క నుండి వెళ్తే అది మిమల్ని మరింత గ్రహ్యంగా(శక్తిని గ్రహించేలా) చేస్తుంది. అందుకే ఆలయంలో  ఎడమవైపు ఆకుపచ్చ చీర ఉంది. ఎరుపు "ఆగమని ," ఆకుపచ్చ "వెళ్ళండని" సూచిస్తాయి కదా..!

ప్రేమాశీస్సులతో.
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1