ఆరోగ్యం ధ్యానం వల్ల కలిగే సైడ్ ఎఫ్ఫెక్ట్ మత్రమే...

Krishna playing the flute with Radha and Gopis
 

శారీరక ఆరోగ్యం, మానసిక సామర్థ్యాలు, జీవితాన్ని సులువుగా నిర్వహించగలగడం – ఇవి ధ్యానం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్  మాత్రమే. అసలు విషయం క్రమంగా అభివృద్ధి చెందుతుంది. అది వికసించినప్పుడు మాత్రమే దానిని మీరు తెలుసుకోగలుగుతారు.

ప్రశ్న : సద్గురు, ఎవరైనా ధ్యానమార్గాన్ని ఎంచుకున్నప్పుడు, ఆ వ్యక్తి తన ప్రయాణం సరైన దిశలో సాగుతున్నదో లేదో ఎలా తెలుసుకోగలడు? ఏదైనా దీన్ని సూచించే శారీరక, మానసిక లక్షణం వ్యక్తమవుతుందా?

సద్గురు : శారీరక వ్యక్తీకరణలు ఎక్కువ స్పష్టంగా కనిపిస్తాయి. శారీరక మానసిక లక్షణాలు చాలా వ్యక్తమవుతాయి. ఈ రెండింటినీ మించిన  మరెన్నో ఇతర వ్యక్తీకరణలు కూడా ఉంటాయి. వీటన్నిటినీ ప్రశ్నించవచ్చు, కాని ఎవరు ప్రశ్నిస్తారు? కేవలం శారీరక మానసిక వ్యక్తీకరణలపై ఆధారపడినవారు, యంత్రాల మీద ఎక్కువగా ఆధారపడినవారు, యంత్రాలను నిర్మించిన మనుషుల కంటే, యంత్రాలను ఎక్కువగా విశ్వసించేవారు. వాళ్లు మాత్రమే దీన్ని ఎప్పుడూ ప్రశ్నిస్తుంటారు.

మృతులా, మెదడు స్తంభించినవారా?

కొన్ని సంవత్సరాల కిందట జరిగిన ఒక విషయం చెప్తాను. నేనొక సారి యోగా మీద, యోగుల మీద అన్నిరకాల ప్రయోగాలు జరుగుతున్న చోటికి వెళ్లాను. నేనొక మంచి ప్రయోగ వస్తువుననుకున్నారు. సాధారణంగా నాపై పరీక్షలకు నేనంగీకరించను, కాని సరే నన్నాను.

వాళ్లు నా మెదడులో గామా తరంగాలను పరీక్షిస్తామన్నారు. నాలో అటువంటి తరంగాలున్నాయని కూడా నాకు తెలియదు. వాళ్లు పధ్నాలుగు ఎలెక్ట్రోడ్‌లను నా శరీరంలో వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా తలలో ఎక్కువగా అమర్చారు. నాతో   “ఇప్పుడు ధ్యానం చేయండి” అని చెప్పారు. “నాకే ధ్యానమూ తెలియ”దన్నాను. “లేదు, లేదు. మీరందరికీ ధ్యానం బోధిస్తున్నారు” అన్నారు వాళ్లు. “నేను వాళ్లకు ధ్యానం ఎందుకు బోధిస్తున్నాను? వాళ్లకు ఒక చోట స్థిరంగా కూర్చోవడం చేతకావడం లేదు. వాళ్లు అలా కూర్చోగలగడం కోసం వాళ్లకేదో బోధించాలి” అన్నాను. అప్పుడు వాళ్లన్నారు, “సరే, మీరేం చేయగలరు?”.  నేనన్నాను, “మీకు  కావలన్టే నేను నిస్చలంగా కూర్చోగలను.”  “సరే, అదే చేయండి.” అని వాళ్లన్నారు. నేను కూర్చున్నాను.

పదిహేను, ఇరవై నిమిషాల తర్వాత ఎవరో ఏదో లోహవస్తువుతో నా మోకాలిపై కొడుతున్నట్లనిపించింది. తర్వాత వాళ్లు నా మోచేతుల మీద, చీలమండలమీద కొట్టడం ప్రారంభించారు – అన్నీ బాగా నొప్పి పుట్టే స్థలాలు. కొట్టిన తర్వాత వాళ్లు నా వీపు స్పృశించారు. నా వెన్నెముక ఎప్పుడూ అతి స్పృహణీయం, వాళ్లు దాన్ని తాకగానే ఇక వాళ్లకు చెప్పవలసిన సమయం వచ్చిందనుకున్నాను. నేను బయటికి రావాలనుకుంటే వాళ్లు ‘బయటికి రండి’ అని ఒక్కమాట చెప్తే సరిపోతుంది కదా, నేను బయటికి రావడానికి ఒక నిమిషం పడుతుంది. శరీరం మీద ఈ తట్టడం అంతా ఎందుకు?

నా వెన్నెముక ఎప్పుడూ అతి స్పృహణీయం, వాళ్లు దాన్ని తాకగానే ఇక వాళ్లకు చెప్పవలసిన సమయం వచ్చిందనుకున్నాను.

నేను కళ్లు తెరిచాను, వాళ్లు నావైపు విచిత్రంగా చూస్తున్నారు. “ఏమైనా పొరపాటు చేశానా?” అని అడిగాను.  “లేదు, మా యంత్రం మీరు మరణించినట్లు చెప్తోంది.” అని వాళ్లు చెప్పారు. నేనన్నాను, “సరే, చాలా గొప్ప పరిశొధన.”  తరువాత వాళ్లు తమలో తాము చర్చించుకొని అన్నారు, “మీరన్నా మరణించి ఉండాలి, మీ మెదడన్నా మరణించి ఉండాలి.”  దనికి నేను  “రెండో నిర్ధారణ చాలా అవమానకరం, మొదటి నిర్ధారణే ఒప్పుకుంటాను. మీరు చెప్పాల్సింది చెప్పారు. నేను బతికే ఉన్నాను, నాకేమీ సమస్యలేదు. బ్రెయిన్-డెడ్ అన్నది అంత మంచి సర్టిఫికట్  కాదు కదా.”

మీరిలా ప్రాణాన్ని శకల శకలాలుగా, మీకున్న జ్ఞానాన్ని ఉపయోగించి పరీక్షిస్తే మీకు తప్పుడు ఫలితాలే వస్తాయి. సరే కానివ్వండి, ఇవ్వాళ ప్రపంచం నడుస్తున్న తీరు ఇదే. నేను మళ్లీ పరీక్ష చేయించుకోవడానికి సిద్ధంగా లేను కాబట్టి, మన మెడిటేటర్స్ ల్లో కొంతమందిని తమ మెదళ్ల స్కానింగుకు అనుమతించమని చెప్పాను. దేశంలో అత్యంత ప్రముఖ సంస్థల్లో ఈ ప్రక్రియ జరిగింది.  వాళ్లు కుడి, ఎడమ మెదళ్లలో అద్భుతమైన సుసంగకత్వం కనిపించినట్లు తెలుసుకున్నారు. “ఇటువంటిది మేమెన్నడూ చూడలేదు” అన్నారు వాళ్లు. మూడు నెలలు, లేదా అంతకంటే కొంచెం ఎక్కువకాలం ఈ అభ్యాసాలు చేసిన వ్యక్తులు వీళ్లు.

కుడి, ఎడమ మెదళ్ల సుసంగత్వం

జీవితంలో దీన్ని  అన్వయించడం ఇలా ఉంటుంది. మీరు స్వీకరించిన సమాచారాన్నంతా పంచ స్పర్శేంద్రియాలు  పరిశీలించి ఎడమ మెదడుకు పంపడం సాధారణ ప్రక్రియ. తక్కిన శరీరం గ్రహించిన సమాచారం హేతుబద్ధంకానిది, అసమగ్రం కానిదీ, జీవితానికి అత్యంతావశ్యకమైన మరింత సజాతీయమైనదీ అయిన దాన్ని మీ కుడిమెదడులో విశ్లేషించడం తర్కబద్ధం కాదు. మీకు ఈ సమాచార స్పృహ లేకపోవచ్చు, కాని మీ రెల్లప్పుడూ దాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. లేకపోతే మీరక్కడ ఉండరు. మీ కుడి, ఎడమ మెదళ్ల మధ్య క్రియాశీలక సుసంగతత్వం లేకపోయినట్లయితే చైతన్యంతో ఆ సమాచారాన్ని స్వీకరించలేరు. మీ జీవితంలోని ఆ భాగాన్ని చైతన్యంతో స్వీకరించగలగడం, ఆ భాగపు సమాచారాన్ని స్వీకరించగలగడం, మీలోని దాన్ని తెలుసుకోగలగడం,  మీరు ఊహించని చోట్లకు మిమ్మల్ని తీసికొని వెళ్లగలుగుతుంది. మీరు ఎంతో ప్రయత్నంతో మీ జీవితంలో చేసే పనులు, అవలీలగా జరిగిపోతాయి.

ఎంతో మందికి , ఇది వారి జీవితాల్లో క్రియాశీలంగా మారింది, వారెలా జీవిస్తున్నారో అది నిర్ణయిస్తుంది. ఏదైనా ఒక కార్యకలాపం తీసుకోండి; ఉదాహరణకు ఒక కంప్యూటర్ నిపుణుణ్ణే తీసుకొందాం. అతను సాధారణంగా 30 రోజుల్లో చేసే పనిని, ఆరునెలల సాధన చెసిన తరువాత అంతకంటే తక్కువ కాలంలో చేయగలుగుతాడు. వాళ్ల కాంట్రాక్టుకు అనుకూలంగా వాళ్లు దాన్ని పొడిగించుకొవాలనుకుంటే అది వేరే సంగతి, అది వాళ్ల ఇష్టం; దానితో నాకు సంబంధం లేదు..! మీకు ఏ పని ఐనా సరే, అది చేసే సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది- దాదాపు మనం ఊహించనంత అధికంగా పెరుగుతుంది. మీరు తగినంత అభ్యాసం చేసినట్లయితే అది(యొగ సాధన) మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా తక్కినవారి కంటే మెరుగైన స్థితిలో ఉంచుతుంది. ఆరోగ్యరీత్యా కూడా అది మీకు అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇవ్వాళ బోలెడంత వైద్య పరిశోధన కూడా ఉంది.

 

ఈ ప్రయోజనాలు – శారీరక, ఆరోగ్య, మానసిక సామర్థ్యాలు, జీవితాన్ని సులువుగా నిర్వహించుకొనే సామర్థ్యం – అన్నీ ఆనుషంగిక ప్రయోజనాలు(Side effects). అసలైనది మెల్లగా అభివృద్ధి చెందుతుంది. అది పూర్తిగా వికసించినప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. అప్పటివరకూ ఏమీ జరగడం లేదనే మీరనుకుంటారు. మీరు మీ ఇంట్లో ఒక పూలమొక్క  నాటారనుకోండి , అది పెరుగుతుంది, ముందు కేవలం చిగుళ్లు, ఆకులు వస్తూ ఉంటాయి. మీ పక్కింటాయన వచ్చి మీతో ఇలా అన్నాడనుకోండి, “ఏమండీ, పూలు పూస్తాయని మీరు చెప్పారు, ఎక్కడ? ఇంతవరకు అన్నీ ఆకులే కనిపిస్తున్నాయి. ఇది పూలు పూయదు. ఇంకా ఎందుకు, విరగ్గొట్టి పొయ్యిలో పెడదాం.”  దానికి మీరు  “చూద్దాం, రేపు పూస్తుందేమో?” అని అన్నరనుకోండి. రేపు ఉదయం – ఏమీ జరగలేదు. మళ్లీ మీరు , “మరొక రోజు చూద్దాం.” అంటారు  ఇంకోరోజు, ఇంకో రోజు... సంవత్సరాలు గడిచాయి. ఈ చెట్టు ఎంత కాలానికి పూలు పూస్తుందో మీకు తెలియక పోయినట్లయితే మీరిప్పటికి దాన్ని వందసార్లు కొట్టేసేవారు. కాని మీరు అలాగే దానికి నీళ్లు పోసి, ఎరువులు వేసి పెంచడం కొనసాగిస్తే ఒకరోజు అది పూలు పూస్తుంది, అప్పుడు మీకు ఆ చెట్టు ఆకులతో ఆగదు, పూలు కూడా పూస్తుందని తెలుస్తుంది. ఆ చెట్టు ఆకులకోసం కాదు, నీడకోసం  కాదు, అదిచ్చే ప్రాణవాయువు కోసం కాదు. ఇది నిండుగా పూలు పూసినప్పుడు అద్భుత సౌందర్యంతో విలసిల్లుతుంది.

ప్రేమాశిస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1