గురువంటే అనంత శూన్యం...!!

 

సద్గురు తానొక కాపలాదారు లేని ద్వారం వంటి వాడిననీ, అదే తనకి గురువు స్థాయిని కలిగించిందని చెబుతున్నారు.

ప్రశ్న: మీరు దీక్ష ఇచ్చిన వారికి, వాళ్ళ అంచనాలకి అతీతంగా అనుకూల సంఘటనలు జరుగుతున్నాయి. అందుకని నాకు ఆశ్చర్యం వేస్తుంది, నిజానికి అంతకంటే ఎక్కువేనేమో, గానీ, అసలు మీరెవరు? మీరు గురువుగా ఎలా పనిచేస్తారు?

సద్గురు: ఒక వ్యక్తిగా చూస్తే నేను ఎవరూ భరించలేనటువంటి వాణ్ణి. కానీ, గురువుగా నేను శూన్య స్థితిని. నా జ్ఞానం వల్ల నేను గురువుని కాను, నా అజ్ఞానికి పరిమితి లేనందువల్ల నేను గురువుని. అదే ముఖ్యమైనది. మీలోనిది ఏదయితే అనంతమవుతుందో, అది ఏదయినప్పటికీ, పనిచేస్తుంది. మీరు పరిమితులు లేని అజ్ఞానంలో ఉన్నారా? అది పనిచేస్తుంది. మీలోని ప్రేమకు పరిమిమితి లేదా? అదీ పనిచేస్తుంది. మీ ఆగ్రహానికి అవధులు లేవా? అదీ పనిచేస్తుంది. అలా, మీరు ఎందులో అనంతమైనా, అది పనిచేస్తుంది.

నా అజ్ఞానానికి హద్దులు లేకుండా ఉండేలా చేసుకోవడమే అన్నిటికన్నా సులభం అని నాకు అనిపించింది. నా ఆధ్యాత్మికత అంతా నాకు ఏమీ తెలియదన్న ఎరుకతో ప్రారంభం అయింది. అదేమీ చిన్న విషయం కాదు. అంతులేనిదేదీ చిన్నది కాదు. మీరు జ్ఞానంలో పరిమితులు లేకుండా ఉందామనుకున్నారనుకోండి. మీరెంత తెలుసుకోగలరు? మీరు ఎంత తెలుసుకున్నా, తెలుసుకోడానికి ఇంకా కొంత మిగిలే ఉంటుంది. నాకు సృష్టిలోని రహస్యం తెలిసింది... జ్ఞానమని దేన్ని పిలుస్తున్నామో అది నిజానికి అజ్ఞానం. దేనిని అజ్ఞానమని భావిస్తున్నామో అదే నిజమైన జ్ఞానం.

నా వ్యక్తిత్వాన్ని ఎలా సృష్టించానంటే, నాతో ఏ సంబంధమూ పెట్టుకోడానికి ఇష్టపడనంత దారుణంగానూ, అదే సమయంలో,  నన్ను మీరు విడిచి ఉండడానికి ఇష్టపడనంత ఆత్మీయంగానూ నన్ను నేను తయారు చేసుకున్నాను

నేను శూన్యంలా మారగలిగాను గనుకనే, ఆదియోగి నా ద్వారా పనిచెయ్యడానికి ఒక ద్వారంగా ఉన్నాను. మీరు నన్ను రోడ్డు మీద కలిసారనుకోండి. నా బుర్ర ఖాళీగా ఉంటుంది. ఇక నా వ్యక్తిత్వ విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం, ఈ శరీరం మార్పుకి లోనవుతోంది. మనుషులు దానివల్ల గందరగోళానికి గురై తత్తరపడుతున్నారు. అందుకనే నన్ను ఎంతో కాలం నుండీ అంటి పెట్టుకున్న వాళ్లని హెచ్చరిస్తుంటాను. నా వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూనే ఉంటాను అని.  అయినప్పటికీ కొందరు ఆశ్చర్యానికి గురవుతుంటారు, కొందరు నాతో ఉంటారు, కొందరు వెళ్ళిపోతారు.

నా వ్యక్తిత్వాన్ని ఎలా సృష్టించానంటే, నాతో ఏ సంబంధమూ పెట్టుకోడానికి ఇష్టపడనంత దారుణంగానూ, అదే సమయంలో,  నన్ను మీరు విడిచి ఉండడానికి ఇష్టపడనంత ఆత్మీయంగానూ నన్ను నేను తయారు చేసుకున్నాను. నేను మరికొంచెం కఠినంగా ఉంటే, ఇక్కడ ఎవరూ మిగలరు. నేను మరికొంచెం ఆత్మీయంగా ఉంటే, ఎవ్వరూ నన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండరు. అందుకనే నేను ఆ సరిహద్దు మీద ఉంటాను... వాళ్ళు నన్ను ఒక ప్రక్క భరించలేకుండా ఉంటూనే, నేను లేకుండా ఉండలేనట్లు ఉంటారు... ఎందుకంటే వాళ్ళు స్వయంగా సత్యాన్వేషణ చేయడానికి ఇది ఎంతో అవసరం.

వాళ్ళకి నేను ఇంతకన్నా ఆత్మీయంగా ఉంటే, వాళ్ళు వాళ్ళ అన్వేషణ కంటే నన్ను మిన్నగా ఊహిస్తారు, అది మంచిది కాదు. వాళ్ళు నన్ను మరీ భరించలేనట్టు అనుభూతి చెందితే, వాళ్లు అన్వేషణనే విరమించుకుంటారు, అదీ మంచిది కాదు.  కనుక నా వ్యక్తిత్వాన్ని ఎలా మలుచుకుంటున్నానంటే వాళ్ళకి రెండు పార్శ్వాలూ కనిపిస్తూనే, వాళ్ళ అన్వేషణా తృష్ణ మాత్రం నశించదు. వాళ్ళు నన్ను భరించలేక అభౌతికమైన దాన్ని అన్వేషించినప్పటికి, అది వాళ్ళకి పనిచేస్తుంది. గురువు ఎన్నడూ ఒక అంతిమ గమ్యం కాదు. గురువు ఒక సాధనం.  గురువు ఒక ద్వారం వంటివాడు.  మీరు ఆ ద్వారంగుండా నడిస్తే సత్యాన్ని దర్శిస్తారు. మీరు నాలోంచి వెళ్ళడానికి చేసే ప్రయత్నం మంచిది. ఎందుకంటే మీకు లభించగల అతికొద్ది శూన్య స్థానాలలో నేను ఒకటి. మిగతా అన్ని చోటులూ అపారదర్శకాలు (కాంతి చొచ్చుకుపోనివి). వాటినిండా జ్ఞానం, వేదాలూ, నిశ్చితాభిప్రాయాలూ, ఉన్నాయి. ద్వారం ఎప్పుడూ శూన్యంగా వెళ్ళడానికి అనువుగా తెరిచి ఉండాలి. మీరు అందులోంచి ఏ శ్రమా లేకుండా వెళ్ళగలిగితేనే దానివల్ల ఉపయోగం. కనుక ద్వారం దగ్గర దేనికోసమూ వెతక్కండి.  మీకు ద్వారం లో ఏదయినా కనిపించిందంటే, అది మూసి ఉన్న ద్వారం అని అర్థం.

నేను గమ్యాన్ని కాను, కేవలం తెరిచి ఉన్న ద్వారాన్ని. మనమందరమూ ఆదియోగి అని పిలిచే జ్ఞానాన్నీ, అవశ్యకతలని - తెసులుకోవడానికి గల ఒక ద్వారాన్ని నేను. ఈ ద్వారానికి ఎవరూ కాపలాదారుడు లేడు.  మీరందులోంచి వెళ్ళాలనుకుంటే, మిమ్మల్ని ఆపేవారెవరూ ఉండరు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1