యక్షుల రాజు కుబేరుడు. ఇప్పటికీ ఎవరినైనా ధనవంతుడని అనాలంటే, కుబేరుడనే పదాన్ని వాడతారు. కుబేరుడు తనకు కొంత శారీరిక అంగ వైకల్యం ఉన్నప్పటికీ,  చాలా నగలు, కిలోల కొద్దీ బంగారు, వజ్రాలను తన ఒంటి నిండా వేసుకొని, ఆ వైకల్యాన్ని కప్పేసేవాడు. అతను శివునికి కూడా అలాగే అలంకరణ చెయ్యాలనుకున్నాడు.

శివుడు ‘నేను వేసుకునేది ఒకేటే ఒకటి - బూడిద. నాకెలాంటి నగలూ అవసరం లేదు’ అనేవాడు

ప్రతీ రోజూ అతనొక కొత్త నగతో శివుడి దగ్గరికొచ్చి,‘మీరిది వేసుకోవాల్సిందే’ అనేవాడు. శివుడు ‘నేను వేసుకునేది ఒకేటే ఒకటి - బూడిద. నాకెలాంటి నగలూ అవసరం లేదు’ అనేవాడు, కానీ కుబేరుడు తేలిగ్గా పట్టు వదిలే మనిషి కాదు. అతను పదేపదే ఏవైనా నగలు వేసుకోమని శివుని సతాయించేవాడు. ఒక రోజు శివుడు “నీకంతగా ఎవరినో ఒకరిని ఆదరించాలనుకుంటే, నా కుమారుణ్ణి ఆదరించు’ అన్నాడు. శివుడు కొంచెంగా పుష్టిగా ఉన్న తన కుమారుడైన గణపతిని చూపించి, ‘ఇదిగో, ఇతడే నా కుమారుడు. ఇతడు ఆహారప్రియుడు. మీ ఇంటికి తీసుకెళ్ళి ఇతను తృప్తి చెందేంత వరకూ భోజనం పెట్టు’ అన్నాడు. ఆహారం ప్రస్తావన వినిపించగానే, గణపతి లేచి ‘ ఆహారమా ? ఎక్కడ? ఎప్పుడు?’ అన్నాడు. కుబేరుడు ఆ అబ్బాయిని ఇంటికి ఆహ్వానించాడు. గణపతి వెళ్ళాడు.
కుబేరుడు తన సంపద, తన రాజ భవనం పట్ల మితిమీరిన గర్వంతో ఉండేవాడు. గణపతి తన బురద కాళ్ళతో మెరిసే పాలరాతిపై నడస్తూ కుబేరుడి భవనంలోకి వచ్చాడు. సేవకులు ఆ నేలను అతని వెనకనే తుడుచుకుంటూ వెళ్ళారు. కానీ కుబేరుడు, ‘ఎంతైనా శివుడి కొడుకు కదా, ఫర్వాలేదు’ అనుకున్నాడు. గణపతి కూర్చున్నాక వాళ్ళు వడ్డించారు, అతను తిన్నాడు. వాళ్ళు తెచ్చిన ఆహారమంతా అయిపొయింది, వాళ్ళు మళ్ళీ మళ్ళీ వండుతూనే ఉన్నారు.

తరువాత కుబేరుడు “నీ వయసుకి, నువ్వు తిన్న ఆహారం చాలా ఎక్కువ, అంత ఆహారం తింటే అది ప్రమాదకరం కావచ్చు” అన్నాడు. గణపతి “ఏ ప్రమాదం లేదు. చూడండి, నాకు నాగుపాము వడ్డాణంగా ఉంది. నా గురించి దిగులుపడకండి, వడ్డించండి! నాకు తృప్తి కలిగేంతవరకు వడ్డిస్తానని మా తండ్రికి మాటిచ్చారు కదా!” అని బదులిచ్చాడు. కుబేరుడు మరిన్ని సరుకులు తెమ్మని అతని మనుషుల్ని పురమాయించాడు. ఆ పరిసరాల్లో ఉన్న సరుకులేవీ సరిపోలేదు. కుబేరుడి సంపదంతా ఖర్చయిపోయింది- ప్రతీ వస్తువును అమ్మేసి, ఆహారాన్ని తయారు చేసి, వడ్డించారు – అతను మాత్రం ఇంకా తింటూనే ఉన్నాడు.

ఈ రోజునే మనం గణేశ చతుర్థిగా జరుపుకుంటున్నాం. ఒక అద్భుతమైన విషయమేమిటంటే, ఎన్నో వేల ఏళ్ళుగా ఈ రోజు అలానే నిలిచి ఉంది. భారతదేశ దేవుళ్లలో గణపతి అత్యంత ప్రజాదరణ కలిగిన దేవునిగా నిలిచాడు

గణపతి పళ్ళెం ఖాళీ అయ్యింది, ఇంకా అతను భోజనానంతరం వడ్డించే తీపి పదార్థం కోసం ఎదురుచూస్తున్నాడు. “పాయసమేది? లడ్డూ ఏది? ” అని అడిగాడు. అప్పుడు కుబేరుడు, “తప్పయిపోయింది. గర్వంతో నేను నా సంపద గురించి గొప్పలు పలికాను. నా దగ్గరున్నదంతా శివుడిచ్చిందేనని నాకూ తెలుసు, శివుడికీ తెలుసు, అయినా నేనో బుద్ధిహీనుడిలా, అతనికి మహా భక్తుడిలా నన్ను నేను భావించుకుంటూ అతనికి నగలని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను.” అని గణపతి కాళ్ళపై పడ్డాడు, క్షమాపణ అర్థించాడు. అప్పుడు గణపతి ఇక దేని కోసం అడగకుండా వెళ్ళిపోయాడు.

ఈ రోజునే మనం గణేశ చతుర్థిగా జరుపుకుంటున్నాం. ఒక అద్భుతమైన విషయమేమిటంటే, ఎన్నో వేల ఏళ్ళుగా ఈ రోజు అలానే నిలిచి ఉంది. భారతదేశ దేవుళ్లలో గణపతి అత్యంత ప్రజాదరణ కలిగిన దేవునిగా నిలిచాడు. అతను దేశంలో ఉన్న జ్ఞానాన్నంతా సముపార్జించాడు. అతను ప్రతీ విషయాన్నీ గ్రహించాడు, రాసాడు. ఈరోజుకి కూడా ఒక పిల్లాడికి విద్యారంభం చేయాలంటే, మొదట స్తుతి చేసేది గణపతినే. అతన్నో తేజోవంతమైన, గొప్ప పండితుడిగా చెబుతారు – అతను భోజనప్రియుడు. మామూలుగా పండితులు బక్కగా ఉంటారు, కానీ ఇతను నున్నగా, పుష్టిగా ఉండే పండితుడు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు