ఉన్నతోద్దేశాలతో చేసే పోటీలు, పోటీ తత్వాలూ గ్రామీణ భారతంలో గ్రామీణులను అసలైన స్ఫూర్తితో దగ్గరవడానికి దారితీస్తాయి.

దొర్లే రాయికి ఏదీ అంటదు అంటారు, మరి దొర్లే బంతి సంగతి ఏమిటి? ఒక బంతి గత పద్నాలుగేళ్ళుగా దొర్లుతూనే ఉంది, దానికి ఆగే ఉద్దేశ్యమే లేదు.. అదే ఈ కథకు మూలం- అదే ఈశా గ్రామోత్సవం కథ.

గ్రామోత్సవం ఒక వేడుక. గ్రామీణుల స్ఫూర్తిని పెంచే పండుగ. అనేక ఆటల ద్వారా గ్రామాల్లో సామాజికంగా సామరస్యతను పెంచడానికి, ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి, మహిళులకు శక్తినిచ్చి, వారి ఉత్పాదకతను పెంపొందించడానికి చేసే కార్యక్రమం. గ్రామీణ సంస్కృతిలో ఉత్సాహం తేవడానికి, కుల మతాలకు అతీతంగా సమాజాలను దగ్గరకు తీసుకురావడానికి తమిళనాడు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం జరుపుతున్న పండుగ. ఈ సంవత్సరం మొదటి సారిగా కొంచెం ఈశాన్య దిశగా పయనంచి, భారతదేశ ధాన్యాగారంగా పేరొందిన ఆంధ్ర ప్రదేశ్ లోకి వచ్చింది.

గ్రామీణ భారత దేశాన్ని ఆర్ధికంగా, సామాజికంగా, శారీరకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఎంతో గొప్ప ప్రయత్నం చేస్తోంది. ‘స్మార్ట్ విలేజ్’ పేరుతో ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చింది.

తెలుగు నేల మీద విశాఖపట్నంలో గ్రామోత్సవం

ఆటలు, వినోద కార్యక్రమాలు నిర్వహించడం గ్రామీణుల సంపూర్ణ శ్రేయస్సుకు దోహదకారి అవుతుందని గమనించి, యూనిసెఫ్, ఈశా ఫౌండేషన్ లు కలసి విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తరచూ వినోద కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రామీణుల్లో వారి వయస్సు, ఆర్ధిక స్థాయిలకు అతీతంగా సంఘీభావం ఏర్పడుతుంది. ఆ కార్యక్రమాలు మహిళను శక్తిమంతులను చేసి, ప్రజానీకాన్ని దురలవాట్ల బారిన పడకుండా కాపాడుతుంది. "కలసి ఆడుతున్న గ్రామం, కలిసే ఉంటుంది" అనే మాటని గ్రామోత్సవం నిరూపించింది.

మగవారికి వాలీబాల్ పోటీలు, ఆడవారికి త్రోబాల్ పోటీలు గత కొన్ని నెలలుగా విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో నిర్వహిస్తున్నారు. వాటిద్వారా ఆ సమాజాల్లో ఎంతో ఆనందం, ఉత్సాహం వెల్లివిరుస్తోంది. గెలవని జట్టులోని మహిళలందరికీ ఒక పూల మొక్క, ఒక పండ్ల మొక్క బహుమతిగా ఇవ్వబడుతుంది. వారికి పెట్టే షరతు ఏమిటంటే, ఆ మొక్కలను పెంచి వారు ఆ ఫలసాయాన్ని ఊళ్ళో అందరితో పంచుకోవాలి. దాని మూలంగా వారిలో ఓటమిని కూడా అంగీకరించగల సమర్ధత వచ్చి, వారందరిలో మంచి దృక్పధం కలిగిస్తుంది. వారికి ఇవ్వడంలోని అంతరార్థం బాగా తెలుస్తున్నది. వారు తమ ఆటను మెరగుపరచుకుని మండల స్థాయిలోని పోటీల్లో పాల్గొంటామని, ఆటలు ఆడుతూనే ఉంటామని చెప్పారు. ఆడేవారికి ఒక చిన్న అడుగేగాని, సంఘంలో వారిలో వచ్చే సాన్నిహిత్యపరంగా ఎంతో ముందడుగు.

ముప్పై ఎనిమిది గ్రామాలనుంచి తొంభై జట్లు పురుషుల వాలీబాల్ పోటీల్లోనూ, 28 గ్రామాల నుంచి 58 జట్లు మహిళల త్రోబాల్ ఆటల్లోనూ పాట్గొన్నారు. వారిలో గెలచిన 8 టీములు నవంబరు 25 న జరిగే క్వార్టర్ ఫైనల్ లో పాల్గొంటారు.

ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే ఈశా గ్రామోత్సవం గ్రామీణ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. గ్రామీణ క్రీడలు, సంగీతం, ఆ ప్రాంతపు వంటకాల రుచులను కూడా చూపిస్తాయి. వైవిధ్యమైన ఈ ఉత్సవం వాలీబాల్, త్రోబాల్ ఫైనల్స్ నిర్వహించడం ద్వారా నవంబరు 27న, విశాఖపట్నంలో సద్గురు సమక్షంలో పరిసమాప్తమౌతుంది. ఈ ఉత్సవం కూడా యునిసెఫ్, ఈశా ఫౌండేషన్ సహకారాలతో జరుగుతుంది, వాటి ఉద్దేశ్యం వారి గ్రామాలను, పరిసర ప్రాంతాలనూ అభివృద్ధి చేసి వారిలో సామరస్యత తీసుకురావడం. ఆనందపురం గ్రామస్థులు, పాఠశాల విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు, ఇతర ప్రజలు కలసి, మొత్తం ఏడు వేలమంది దాకా ఈ ఉత్సవంలో పాల్గొంటారని ఆశిస్తున్నాము. ఆ రోజు గ్రామీణ స్ఫూర్తి పరంగా ఒక పెద్ద జడివాన కురియనుంది, కొందరు మనుషులు తమ జీవితాలను మార్చుకునే అవకాశం కూడా ఉంది.

సంపాదకుని సూచన:

  1. విశాఖపట్నంలో జరగనున్న గ్రామోత్సవం ఫైనల్స్ సద్గురు సాన్నిధ్యంలో జరగనుంది. ప్రత్యక్షంగా చూడదలచినవారు రిజిస్టర్ చేసుకోండి.
  2. తమిళనాడు గ్రామోత్సవం రాబోయే కొద్ది వారాలలో జరుగుతుందని, ముగింపు కార్యక్రమం ఆదియోగి విగ్రహం ముందు డిసెంబర్ 22 న జరుగుతుంది. ఈ ఉత్సవం బాగా జరిగేటట్లు విరాళాలు అందించమని విజ్ఞప్తి చేస్తున్నాము. గ్రామోత్సవ విరాళం