గత వ్యాసానికి (కలియుగం) కొనసాగింపైన ఈ వ్యాసంలో , ఈథర్ వల్ల కలిగే ఆధ్యాత్మిక లాభాలను సద్గురు మనకు వివరిస్తున్నారు.

సద్గురు: ఈథర్ ఇంకొంచం కిందకు వస్తే , మీరు శ్వాసతోనే అవగాహన చేసుకుంటారు. మీ దృష్టికి అవరోధాలు కలిగినప్పుడు మీ చుట్టుపక్కల పరిస్థితులు తెలుసుకోవడానికి వాసన శక్తి తోడ్పడుతుందని అడవిలోకి వెళ్ళిన వారికి తెలుస్తుంది. అడవిలో నివసించే ఎన్నో జంతువులు వాసనతోనే  తెలుసుకుంటాయి. గాఢమైన జీవన శక్తి వల్ల ఈథర్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈథర్ ఎక్కువగా ఉండటంవల్ల చూసే అవసరం ఉండదు. మీరు మాట్లాడితే అవి కలవరపడతాయి. ఈథర్ తక్కువగా ఉన్నప్పుడు మీరు మాట్లాడితే కానీ ఎదుట వారికి అర్ధం కాదు, ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడినా అర్ధంకాదు, నిరంతరం మొట్టికాయలు వేస్తుంటే కాని అర్ధం కాదు. మీరు ఎంత సున్నింతంగా గ్రహించగలరోనన్న సామర్ధ్యం ఆకాశంలో ఉన్న ఈథర్ శాతం  నిర్ణయిస్తుంది.

ఈథర్ శాతం ఎక్కువ చేయడానికి, తయారు చేయడానికి ఎన్నో చేయవచ్చు. కలియుగంలో భూమి సూపర్ సన్ కి ఎంతో దూరంగా ఉన్న సమయంలో ఈథర్ ఎంతో తక్కువగా  ఉండడంవల్ల మానవుడికి యొగ, ధ్యానం, మంత్రాలు, యంత్రాలు నేర్పించడం అనవసరమని కృష్ణుడు చెప్పాడు. వీరికి ఒట్టి భక్తి నేర్పమని, భక్తితో వారు తమ ఈథర్ను తామే తయారుచేసుకుంటారని కూడా చెప్పారు. ఆకాశంలో ఉన్న ఈ ఈథర్ వల్ల వారికి అవగతం అవుతుంది. భక్తి మొద్దువారికి కాదు కానీ మీరు పరమ మొద్దైనా భక్తిని అవగాహన చేసుకుంటారు.

ఏదయితే తర్కించలేమో పాశ్చాత్య దేశాలలో దీన్నే పిచ్చితనం అని అనడం మొదలుపెట్టారు. కానీ ఇక్కడ మనం తర్కానికి పరిమితులు ఉన్నాయి అని తెలుసుకున్నాము.

సౌర వ్యవస్థ సూపర్ సన్ కి చేరువగా ఉన్నప్పుడు మానవ మేధస్సు వికసిస్తుందని వేల సంవత్సరాల మునుపే చెప్పారు. ఇది అయస్కాంతశక్తిలా, విద్యుత్తులా వ్యవహరిస్తుంది. సౌర వ్యవస్థ ఇంకా చేరువకి రాగానే పూర్తి శరీరం ఇంకా పూర్తి విశ్వం విద్యుత్ నిర్మాణాలని సహజంగా అనుభవానికి వస్తుంది. ప్రస్తుతం మనం యుగాలలో రెండవ ఉన్నత స్థానంలో ఉన్న త్రేతా యుగం వైపుకి వెళ్తున్నాము.

5000వేల సంవత్సరాల పిదప ఒక 10000వేల సంవత్సరాల కాలం ఎంతో అధ్భుతంగా ఉంటుందని కృష్ణుడు వివరించాడు. మనం అప్పటి దాకా ఉండలేము కానీ భూమిపై 10000 వేల సంవత్సరాల బంగారు కాలానికి పునాదులు వేసి అందుకు అవసరమైన వాతావరణం సృష్టించిన సంతోషాన్ని పొందుదాము. ఇది జోస్యమో, ఊహో కాదు, మానవుని బుద్ధిపై, మనం నివసించే భూగ్రహ ప్రభావం గూర్చిన లోతైన అవగాహనపై ఆధారపడి ఉంది. ఈ భూగ్రహం మన నివాస స్ఠలమే కాదు మనమే ఈ గ్రహం. ఈ రోజు మీకు ఇది అవగాహన కాకపోతే మీరు సమాధి అయ్యిన పిదప మీకిది తెలుస్తుంది. మీరు తనలోని భాగమేనని ఈ గ్రహం భావిస్తోంది మీరే మీ గురించి ఇంకేదోగా భావిస్తునారు.

ప్రేమాశిస్సులతో,
సద్గురు