మనల్ని మోసం చేసిన వాళ్ళని శిక్షించడం తప్పా...??

 

జీవితంలో, మనకి ఇష్టమైన వారు మనము కోరుకున్నట్టు ప్రవర్తించక పోతే ఎంతో బాధ కలుగుతుంది. వారు మనల్ని మోసం చేసారనుకుంటాము. ఒక్కోసారి  వాళ్ళని శిక్షించాలని కూడా అనిపిస్తుంది. ఇటువంటి ప్రశ్నకి సద్గురు ఏమంటున్నారో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

ఎవరైనా మనల్ని మోసం చేస్తే వాళ్ళని శిక్షించడం తప్పా? లేకపోతే  వాళ్ళే ఏదో ఒక రోజున శిక్షింపబడతారా?

ఏ విధంగానైనా సరే వాళ్ళని శిక్షించాల్సిందే...మీరైనా  చేయచ్చు, లేకపోతే  మరెవరైనా చేయచ్చు, కానీ వాళ్ళని శిక్షించాల్సిందే. సామాన్యంగా మీరు మనుషులకి  ఎలాంటి శిక్షలు ఇస్తారు? ఇప్పటికే  మీరు చాలానే శిక్షలు అమలు చేసే ఉంటారు కదా,...! చికాకు పడడం, గడుసుగా ఉండడం, మాట్లాడడం మానేయడం.. ఇలాంటివన్నీ చేసేసారు. ఇంకా ఇంత కంటే ఏమి శిక్ష ఇవ్వాలనుకుంటున్నారు? మీ బాధ ఏవిటంటే, మీరు ఇవన్నీ చేసినా అవతల వాళ్ళు బాధ పడటం లేదే అని. వాళ్ళు బాధ పడటం లేదు. వాళ్ళు, వాళ్ళకి  ఏం కావాలో అది చేసుకుపోతున్నారు. మీకు ఏం కావాలో వాళ్ళు చేసుకుపోవడం లేదు. ఇది ఎప్పుడైనా ఇంతే..! ఇది మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ వాళ్లకేం కావాలో  వాళ్ళు అది చేసుకుపోతున్నారు. ఇది  కరక్టా, కాదా అని నేను నీతి బోధ చెయ్యాలనుకోవటం లేదు. నేను మిమ్మల్ని ఇది  అర్ధం చేసుకోమంటున్నాను, అంతే. ఎవరో వాళ్ళకేం కావాలో అది చేస్తున్నారు. దానికి మీరు  వాళ్ళని శిక్షించాలనుకుంటున్నారు. బహుశా వాళ్ళు చట్ట రిత్యా ఏ నియమాల్ని ఉల్లంఘించి ఉండకపోవచ్చు. కానీ వాళ్ళని మనం శిక్షించాలి.

ఇలా ఎందుకు అనుకుంటున్నారంటే, మీ ఇద్దరి మధ్యా ఉన్న ఒక అవగాహన్ని వాళ్ళు సరిగ్గా అర్ధం చేసుకోలేదు కాబట్టి. మీరే దీన్ని సరిగ్గా అర్ధంచేసుకుని ఉండి ఉండకపోవచ్చు కదా. మీరు మీ ఇద్దరికీ మధ్య ఉన్న ఒప్పందాలు ఎల్లకాలం ఉంటాయని, మీరు అనుకోని ఉండి ఉండచ్చు. కానీ నిజానికి అవి ఎల్లకాలం నిలిచేవి కాదు. ఇలా చరిత్రలో ఎప్పుడూ  జరగలేదు. మానవాళి చరిత్రలో గాని ,వర్తమానంలో గాని, భవిష్యత్తులో గాని మానవ సంబంధాలు అనేవి ఎప్పటికీ  స్థిరంగా ఉండేవి కాదు. కొంచెం కవితా హృదయంతో  మాట్లాడేటప్పుడు, వాళ్ళు ఇది ఎప్పటికీ నిలిచి పోయే అనుబంధం అనవచ్చు. కానీ అలాంటిది ఏది లేదు. మానవ సంబంధం అనేది ఎప్పుడూ మార్పు చెందుతూనే ఉంటుంది. మీరు దీన్ని ప్రతిరోజూ నిర్వహించవల్సిందే. ఒకరోజు మీరు సరిగ్గా దాన్ని నిర్వహించలేదనుకోండి, అది మరేదో అవుతుంది. అవునా.. కాదా? ఉన్నది ఉన్నట్టుగా చూడండి, మీరు దీన్ని సరిగ్గా నిర్వహించాలి. “లేదు, నేను చేయగలిగిందంతా  చేస్తున్నాను” అని మీరనుకోవచ్చు. కానీ మరొకళ్ళకి అది సరిపోక పోవచ్చు.

..మానవ సంబంధాలు అనేవి ఎప్పటికి మార్పు చెందకుండా ఉండేవి కావు. అవి ఎప్పుడూ మారిపోతూనే ఉంటాయి.

మీరు ఇది అర్ధం చేసుకోవాలి -  నేను వాళ్ళు చేసేవి సరైనదా? కాదా? అని చెప్పడం లేదు. అది నేను చెప్పక్కర్లేదు. నేను “మానవాళి ఎన్నో తరాలుగా ఇలానే ఉంది” అని చెబుతున్నాను అంతే. ఇంక ఇప్పుడు కూడా ఇలానే ఉంది. ముందు మీరు ఏం  అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, మానవ సంబంధాలు అనేవి ఎప్పటికి మార్పు చెందకుండా ఉండేవి కావు. అవి ఎప్పుడూ మారిపోతూనే ఉంటాయి. ఇది ఎప్పుడూ మీరు సరిచూసుకుంటూనే ఉండాలి. మీరు ఐదు బంతులతో జగ్లింగ్ చేస్తున్నారనుకోండి ఒక్కోసారి అవి కింద పడిపోవచ్చు. దీనికి ఎంతో శ్రద్ద కావాలి. మీలో చాలామందికి వివాహం అయింది. అవునా..?ఈ విషయం మీకు తెలుసా ? దీనికి ఎంతో శ్రద్ద వహించాలి కదా. మీరు ఇలా చేయకపోతే ఏం జరుగుతుంది? మీరు నియంత్రిచలేరు.. అవునా ! దీనికి ఎంతో శ్రద్ధ కావాలి . నాకు యూరోప్  లో ఏదో దేశం నుంచి ఎవరో ఫోన్  చేసారు. “సద్గురు, నేను ఇక్కడ కేవలం ఇంటి పని చేస్తున్నాను. వచ్చి నన్ను  కాపాడండి.” అని. “నన్ను ఇక్కడ నుంచి ఆశ్రమానికి తీసుకెళ్ళిపోండి. నేను కేవలం ఇంటి  పని చేస్తున్నాను.” ఆవిడ గిన్నెలు తోముతోంది. ఇంకా  అలాంటి పనులు చేస్తోంది. వీళ్లు చాలా ఉన్నవాళ్లే. కానీ నలుగురు పిల్లలు ఉన్నారు. ఎప్పుడూ, ఏదో  ఒక పని ఉంటూనే ఉంటుంది కదా, చేయడానికి. ఆ రోజున ఇంట్లో పని చేసే ఆవిడ కూడా రాలేదు. ఇంకా  గిన్నెలు కూడా తోమాలి, నలుగురు పిల్లలు ఉన్నారు. ఇలాంటప్పుడు  అన్ని పనులు చేయాల్సిందే.

మీరు ఒక విషయం  అర్ధం  చేసుకోవాలి. మానవ సంబంధాలు అనేవి మార్పు చెందుతున్న సత్యం. అంతే గాని స్థిరంగా ఉండే సత్యం కాదు. మీకు స్థిరంగా ఉండే అనుబంధాలు కావాలంటే మీరు చనిపోయిన వాళ్ళతో అనుబంధం పెట్టుకోవాలి. అందుకే చాలా మంది భగవంతుడిని ఎంచుకుంటారు. ఇది స్థిరమైనది. మీకు ఎలా కావాలంటే మీరు  ఆలా అనుకోవచ్చు. మీరు అయన గురించి పది రోజులు ఆలోచించలేదనుకోండి, పదకొండో  రోజు మీరు ఆయన గురించి ఆలోచించినా అయన అక్కడే ఉంటారు. కానీ  అది మీ భర్తతోనో, మీ భార్య తోనో చేశారనుకోండి మరేదో జరుగుతుంది. మీరు బిజీగా ఉండి, భగవంతుడి గురించి మూడు సంవత్సరాలు  మరిచిపోయారనుకోండి, ఆ తరువాత మళ్ళీ ఆయనను తలచుకోవచ్చు. ఆయన అక్కడే ఉంటారు. అందుకని మీకు మార్పు చెందని సంబంధాలు  కావాలంటే  మీరు మనుషులను ఎంచుకోకూడదు. మానవ సంబంధాలు ఎప్పుడూ మార్పు చెందుతూనే ఉంటాయి. వీటి పట్ల ఎంతో శ్రద్ధ కావాలి. అందుకని కొంతమంది ఇలాంటివన్నీ నియంత్రించే  సమయం, శక్తి వాళ్ళ  దగ్గర లేదని తెలుసుకొని, వారు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. వాళ్లకి ఇలాంటి సమస్యలు ఏమి ఉండవు. వాళ్ళు ఆలా కళ్ళు మూసుకుని కూర్చుంటే వాళ్ళంతట వాళ్ళే ఉంటారు. వాళ్ళ చుట్టూ ఎవరు ఉన్నారు, ఏముంది ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు. కానీ మీరు అలాచేయలేరు. కానీ ఎవరినో శిక్షించాలి అనుకుంటే మీరు మిమ్మల్ని మాత్రమే శిక్షించుకుంటారు. వాళ్లకి ఏం కావాలో వాళ్ళు అది  చేస్తున్నారు. అప్పుడు మీకేది ఉత్తమమో మీరు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో అది చేయండి. వాళ్ళు మూర్ఖంగా చేశారని, మీరు కూడా వాళ్ళలాగా మూర్ఖంగా చేయాల్సిన అవసరం లేదు. మీరు కూర్చుని ఇందులో సత్యం చూడండి. ఇప్పుడు మీ భ్రమలు తొలగిపోయాయి. ఇది ఎంతో మంచిది. మీ భ్రమలు తొలగిపోయినప్పుడు జీవితం మిమ్మల్ని సత్యానికి దగ్గరగా తీసుకొస్తోంది. అవునా..? ఇది మీకో అవకాశం. ” మీ జీవిత స్వభావం ఏమిటి?” అని చూడ్డానికి, మీకు ఇదొక అవకాశం .

మీరు ఒక సంపూర్ణమైన జీవిగా వికసించినప్పుడు, మీ అనుబంధాలలో ఎంతో మార్పును మీరు గమనిస్తారు.

ఇది ఓ సంపూర్ణమైన జీవితం. కానీ మీరు దీన్ని -  అది అది అది(మరెన్నో ) లేకుండా ఇది మనలేదు అన్నట్టుగా తయారు చేశారు. ఎక్కడో దీనికి ఈ పరిపూర్ణతను అందించలేదు. కానీ ఇదో పరిపూర్ణమైన జీవితం. ఇది సృష్టి  కర్త, సృష్టి  రెండు కలిసి ఉన్న సృష్టి. అవునా. మీ జీవితంలో ఇలాంటి సమయాలు తలుపు తట్టినప్పుడు, మీరు ఇంకొంచెం లోతుగా చూడండి. మీరు ఏదో వారి ప్రవర్తనకు రియాక్ట్ అయ్యిపోయి వాళ్ళని దండించాలి అని అనుకోకుండా, మీరు ఇంకొంచెం లోతుగా చూడండి. అలా చేయడం మీ జీవితాన్ని ఏ విధంగానూ అందంగా మార్చదు. ఎదో సాధించానన్న తృప్తి ఓ  రెండు రోజులు మీకు ఉంటుంది. ఆ తరువాత, “ అయ్యో, నేను ఇలా చేశాను” అన్న బాధ కూడా మీకు ఉంటుంది. మొదట్లో మీకు ఈ భావోద్వేగం ఉన్నప్పుడు మీకు ఏదో కొద్దిగా స్వాంతన నిస్తుంది. ఆ తరువాత మీరు తిరిగి ఆలోచిస్తే దానికి కూడా నేను ఇలా చేశాను అనే బాధ మీకు కలుగుతుంది. అందుకని ఆలా చేయకండి. ఇది మీకు ఎవరో ఒక ఆధ్యాత్మిక కోణాన్ని తెరచారన్నమాట. ఇది మీకొక అవకాశం.

ఎవరో ఇవన్నీ అశాశ్వతమైనవి అని మీకు చూపిస్తున్నారు, వారు మిమ్మల్ని మోసం చేసి ఉండవచ్చు, వాళ్ళు పారిపోవచ్చు, మిమ్మల్ని వదిలేయచ్చు లేదా చనిపోవచ్చు అవునా కాదా ? వాళ్ళు చనిపోయారనుకోండి.. వారు మిమ్మల్ని మోసం చేసారని మీరు అనుకోరు. ఆలా అనుకుంటారా...?. ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు దక్కాల్సింది ఎదో మీకు దక్కలేదు. అది ఎలా జరిగితే ఏమిటి? అది  మరణం అవ్వచ్చు, విడాకులు అవ్వచ్చు, మోసం అవ్వచ్చు, ఏదయినా కావచ్చు. కానీ జరిగిందేంటంటే మీకు దక్కాల్సింది ఏదో దక్కలేదు. మీకు ఏదయినా ఎప్పుడు దక్కకుండా పోతుంది? మీరు ఒక భ్రమలో ఉన్నప్పుడు - ఇది సగం జీవితం మాత్రమే, మిగతా సగం ఇంక ఎక్కడనుంచో రావాలి అని మీరనుకున్నప్పుడు.

ఇది ఓ సంపూర్ణమైన జీవనం. మీరు ఒక సంపూర్ణమైన జీవిగా వికసించినప్పుడు, మీ అనుబంధాలలో  ఎంతో మార్పును మీరు గమనిస్తారు. మీరు ఒకరితో ఒకరు పంచుకున్నట్లుగా, ఒకటిగా ఉన్నట్లుగా ఉంటుంది. అంతే కానీ, ఒకరి నుంచి ఒకరు ఏదో పిండుకున్నట్లుగా ఉండదు. మీ అనుబంధాలు ఆ విధంగా పరిణామం చెందాలి.  మీ అనుబంధాలు ఆ విధంగా పరిణామం చెందాలంటే, ముందు మీరు పరిణామం చెందాలి. ఇది ఓ గొప్ప అవకాశం. మీకు ఎవరో ఇచ్చిన ఓ గొప్ప అవకాశం. ఎవరో నన్ను మోసం చేశారు అని అనుకోవడం మానేయండి. ఎవరో నన్ను భ్రమ నుంచి సత్యానికి  నడిపిస్తున్నారు అనుకోండి, మీరు వారికి ధన్యవాదాలు చెప్పుకోండి. మీరు వారి పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండండి. ఓ జీవిత కాలం పాటు మిమ్మల్ని ఒక భ్రమలో అట్టేపెట్ట కుండా.. ఇంత త్వరగా మీకు ఈ విషయం తెలిసేలాగా వాళ్ళు చేస్తున్నారు. లేకపోతే,  మీరు చనిపోయేటప్పుడు ఈ విషయం మీకు తెలుస్తుంది అవునా! మీరు చనిపోతున్నప్పుడు, “ నాకు భయం వేస్తోంది. నువ్వు నాతో రా” అంటే, ఆయన “లేదు” అంటారు. ఆ చివరి నిమిషంలో భ్రమ తొలగించుకునే బదులు ఇప్పుడే తెలుసుకోవడం మంచిది కదా.

ప్రేమాశిస్సులతో,
సద్గురు.