ధ్యానలింగాలయం - ఇది యోగాలయం !!!

 
 

Sadhguruధ్యానలింగాలయం పూజలు లేని దేవాలయం. ఇక్కడ ప్రార్థనలు గాని, మంత్రాలు గాని, తంత్రాలు గాని, క్రతువులు గాని ఏమి జరగవు. ఎప్పుడూ ఇది నిశ్శబ్దంగా ఉంటుంది. పేరుకు తగ్గట్లుగానే ఇది ధ్యానలింగం. అసలు లింగం అంటే ఏమిటి? ధ్యానలింగం అంటే ఏమిటి? యోగాలయం అంటే ఏమిటి? అసలు యోగం అంటే ఏమిటి?

యోగం అంటే, ఏదైతే అన్నిటితో మిమ్మల్ని ఐక్యం చేస్తుందో అది. అన్నిటితో ఐక్యం అవ్వడం అంటే ఏమిటి..? మీరు అన్నిటితో ఒక్కటి అయిపోవాలనుకోండి ..ఏమి చెయ్యాలి?   

మీరు.....‘మీరు’ లేకుండా అయిపోవాలి. మీరు ఓ వ్యక్తిగా ఉండకుండా ఉండాలి. మీరు ఇక్కడ ఒక వ్యక్తిగా ఉన్నంతసేపు, మీరు అన్నిటితో లయం కావడం గాని ...అన్నీ మీలో లయం కావడం గాని జరగవు కదా? ఎప్పుడైతే మీరు అన్నది లేకుండా ఉంటుందో..... అప్పుడే మీరు అన్నిటితో కలిసి ఉండగలుగుతారు.

కొన్ని సంస్కృతులు దీనికి మంచి పదాల్ని వాడాయి. మరి కొన్ని సంస్కృతులు ప్రతికూల పదాల్ని వాడాయి, ఎందుకంటే మీరు ఊహాగానాలు చెయ్యకుండా ఉంటారని. గౌతముడు దీని వివరించి చెప్పినప్పుడు, ఆయన నిర్వాణం గురించి చెప్పారు. నిర్వాణం అంటే, మీరు లేకపోవడమే. అదే యోగంలో శూన్యం అంటారు. మళ్ళీ శూన్యమే. ఇలా ఎందుకు చేప్తారంటే  మీ గురించి  మీరు ఎక్కువగా ఊహించుకోకుండా   ఉంటారని. హిందువుల స్వర్గం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అంతా ఎరుపు, బంగారువన్నెతో  ఉంటుంది అక్కడ అంతా.... మీకు తెలుసా ?...మీకు స్వర్గం ఎలా ఉంటుందో తెలీదా?  మీ పూర్వికులు.....మీ తాత  ముత్తాతలు ఎవరూ వెళ్లలేదా..? ఎవ్వరూ వెళ్లలేదా...?  మీరు  మీ తాతలకి   కర్మ కాండలు సరిగ్గా  చెయ్యలేదా..?

కాని ఈ క్షురకుడు, “లేదూ, మీరందరిలోకి ఉత్తముడ్ని పంపించాలి. నేను ...బీర్బల్ అందరిలో మెరుగైన వాడు అనుకుంటాను. మీరు అక్కడికి అందరిలోకి మెరుగైన వాళ్ళని పంపించాలి” అన్నాడు

ఓ సారి అక్బరుకి ఇలా జరిగింది. అక్బరు ఓ సారి క్షవరం  చేయించుకుంటున్నారు.  ఒక కాకి అక్కడ వొచ్చి కూర్చొని, మామూలుగానే కా...కా ...కా  అనడం మొదలుపెట్టింది. ఇప్పుడు మీరు రాజు గారికి క్షుర కర్మ చేస్తున్నప్పుడు ....మీరు పని మీద ధ్యాస పెట్టి చేయ్యాలి కదా?  కానీ ఈ క్షురకుడు అలా కాకుండా, ఈ పక్షి ఏమంటుందో వినడం మొదలుపెట్టాడు.  అప్పుడు అక్బరు “నువ్వేం చేస్తున్నావు ?” అంటే....”లేదు, రాజు గారు...ఒక నిమిషం ఆగండీ...” అన్నాడు. “ఏంటి నువ్వు కాకితో మాట్లాడుతున్నావా? నీకు కాకి భాష అర్ధమౌతుందా? నీకు పక్షుల భాష అర్తమౌతుందా?...” అని అడిగాడు. “అవును, నాకు పక్షుల భాష అర్థమౌతుంది. ఈ పక్షి మనకి ఎంతో ముఖ్యమైన విషయం చెబుతోంది అని చెప్పాడు. ఈ మాట వినేసరికి అక్బరుకు కూడా ఆశ్చ్యర్యం కలిగింది. ఆయన అక్కడ ఓ పిచ్చివానిలాగా సగం గడ్డం గీసుకుని అలానే కూర్చొని వినడం మొదలు పెట్టాడు. కొంచం సేపు అయిన తరువాత, ఈ క్షురకుడు  తల ఊపుతూ వొచ్చి,”రాజు గారు, ఈ కాకి స్వర్గాల నుంచి వొచ్చింది. మీ తాత ముత్తాతలు ఎవరైతే ఈ స్వర్గంలో ఉన్నారో, వారిని అక్కడ వినోద పరిచే వారు ఎవరూ లేరట.

వారికి  వినోదాన్ని కలిగించే వారు ఎవరైనా ఉంటే బావుండు అని ఆలోచిస్తున్నారు. అక్బరు అతనితో  “అయ్యో, మా తాత ముత్తాతలు స్వర్గంలో ఆనందంగా లేరా?” అని విచారించ సాగాడు. “మరిప్పుడు ఏం చెయ్యాలి?” “ఎవరైతే చమత్కారంగా మాట్లాడగలరో, ఎవరైతే తెలివిగా మాట్లాడగలరొ వారిని అక్కడకి  పంపిద్దాము”  అన్నారు. ఎవర్ని పంపించాలి అనుకున్నాడు అక్బరు. ముగ్గురు ఆస్థాన మంత్రులు వొచ్చి, నేను వెళతాను అంటే నేను వెళతాను  అన్నారు. ఆ ముగ్గురూ వొకరితో ఒకరు పోటీ పడసాగారు. కాని ఈ క్షురకుడు, “లేదూ, మీరందరిలోకి ఉత్తముడ్ని పంపించాలి. నేను ...బీర్బల్ అందరిలో మెరుగైన వాడు అనుకుంటాను. మీరు అక్కడికి అందరిలోకి మెరుగైన వాళ్ళని పంపించాలి” అన్నాడు. అక్బరు కూడా, “అవును, నిజమే, నెను అందరిలోకి మంచి వాళ్లని పంపించాలి” అనుకున్నాడు.

ఆయన  రాజుతో, “నేను మీ వాళ్ళందరిని చాలా ఆనందపరిచాను. కాని వాళ్ళకొక సమస్య ఉంది. అక్కడా క్షురకుడు లేడు- స్వర్గంలో. చూడండీ నేను కూడా క్షవరం చేయించుకోలేక పోయాను.

అప్పుడు ఈ క్షురకుడు, “నాకు ఒక ఉపాయం తెలుసు. మీరెలా స్వర్గానికి పంపించాలో ....మీరు ఇక్కడ ......ఈ ప్రదేశంలో కూర్చో పెట్టాలి ...ఇలా......ఇలా  మీరు ఆయిన్ని ఈ ప్రదేశంలో ఇలా కూర్చో పెట్టాలి, ఇక్కడ ఒక గుంట తవ్వాలి ...ఇక్కడా ఇంత గంధపు చెక్క పెట్టి ....నెయ్యి పోసీ ...ఇది ఇది చెయ్యాలి ...ఇవ్వన్నీ చేసి అప్పుడు అలా మంట పెడితే ఆయన స్వర్గానికి వెళతారు” అని ఓ ప్రక్రియని చెప్పాడు. అక్బరు “సరే, మనం బీర్బల్నీ స్వర్గానికి పంపిద్దాము” అన్నాడు. ఈ వార్త బీర్బల్ వరకు వెళ్ళింది. బీర్బల్నీ పిలిపించారు. బీర్బల్ వచ్చాడు. అప్పుడు అక్బరు బీర్బల్తో  “నా పూర్వీకులకి, నా తాతముత్తాతలకి  స్వర్గంలో వినోదం లేదట. వారికి ఎవరో ఒకళ్ళు వారిని వినోదపరచడానికి కావాలి. అక్కడ ఎవ్వరూ లేరు. వారికి బోరు కొడుతోంది. వాళ్ళు పాపం ఆనందంగా ఉండలేక పోతున్నారు” అన్నాడు. బీర్బల్ వెంటనే “నేను మీ తాత ముత్తాతలకై ఏం చేయ్యగలనో అదంతా చేస్తాను. సరే...నెను వెళతాను. మీ తాత ముత్తాతల్ని సేవ చేసుకోడం కంటే నాకింక ఉత్తమమైన పనేముంది. నేను తప్పకుండా వెళతాను” అన్నాడు బీర్బల్.

నాక్కూడా స్వర్గానికి వెళ్ళే పద్ధతంతా తెలుసు. ఇవన్నీ మన సంస్కృతిలో ఉన్నాయి. మన సంస్కృతిలో మనుష్యుల్ని స్వర్గానికి ఎలా పంపిస్తామో ఇదంతా నేనే తయారు చేస్తాను” అని చెప్పి తనంతట తానే .....అక్కడ ఈ గంధపు చెక్కా ఇవన్నీ పెట్టి ...అలానే మంట పెట్టుకున్నాడు. ఆయన అక్కడకి కొన్నాళ్ళు వెళ్లి వాళ్ళని వినోద పరిచి మళ్ళి వెనక్కి రావాలి. ఆరు నెలలు, ఎనిమిది నెలలు గడిచి పోయాయి. బీర్బల్ ఇంకా రావట్లేదు. ఇప్పుడు ఎం జరిగిందో అని అక్బరు విచారపడటం మొదలు పెట్టాడు. “ఏం జరిగిందో.....బీర్బల్ నిజంగానే స్వర్గానికి వెళ్లాడా లేదా..? లేకపోతే మంటల్లో  పడి కాలి పోయాడా? నెను సరైన పనే చేసానా  లేదా..?....” అని. ఒక రోజున బీర్బల్ కోర్టుకి ఓ పొడగాటి గడ్డంతో రాజసభకు వచ్చాడు. ఆయన  రాజుతో, “నేను మీ వాళ్ళందరిని చాలా ఆనందపరిచాను. కాని వాళ్ళకొక సమస్య ఉంది. అక్కడా క్షురకుడు లేడు- స్వర్గంలో. చూడండీ నేను కూడా క్షవరం చేయించుకోలేక పోయాను. మీ తాత ముత్తాతలందరు వారి గడ్డమే వారి కాళ్ళకి తగులుకుని పడిపోతున్నారు. నేను వాళ్లని ఆనందంగానే అట్టిపెట్టడానికి ప్రయత్నం చేసాను. కాని వాళ్లెప్పుడూ వాళ్ళ గడ్డాలకి వాళ్ళే తట్టుకుని కింద పడిపోతున్నారు. వాళ్లకి ఒక క్షురకుడు కావాలి” అని చెప్పాడు. “మీరు అందరిలోకి  మంచివాడ్ని, ఉత్తముడిని పంపించాలి”. అందరిలోకి మెరుగైన క్షురకుడు ఎవరు ? రాజు గారి క్షురకుడు. ఈ వార్త క్షురకుడు దాకా చేరింది. ఆయన స్వర్గానికి వెళ్లి వాళ్లందరికీ క్షవరం చేసి రావాలి అని చెప్పేసరికి అతనికి భయం వెయ్యడం మొదలు పెట్టింది.

మనం ఇలా స్వర్గాన్ని గురించిన ఎన్నో కబుర్లు చెప్పుకున్నాము. మనం ఇలాంటి కథలు చాలా కాలం చెప్పుకున్నాము. కథలు బావుంటాయి. మనకి వినోదాన్ని కలిగిస్తాయి. కాని మనల్ని విముక్తుల్ని చెయ్యవు. ఇవి మనల్ని ఏ విధంగానూ విముక్తుల్ని చెయ్యవు. కథలు బానే ఉంటాయి. మనకి వినోదాన్ని కలిగిస్తాయి. ఒక్కోసారి  మనకి  ఓదార్పుని కూడా ఇస్తాయి. కాని ఇవి మన ముక్తికి హేతువులు కాదు.. మీరు ఈ  కథలని వదిలేసి నిజంలోకి వచ్చారంటే మీరు ధ్యానలింగా దేవాలయానికి వస్తే మీరక్కడ కేవలం నోరు మూసుకొని కూర్చోవాలి అంతే. అక్కడ మీరు కథలు చెప్ప కూడదు. ఆయనా మీకు కథా చెప్పరు .....మీరు వూరికే అక్కడ నోరుమూసుకొని కూర్చోవాలి. ఎందుకంటే మీకొకసారి ఇలా ఊహించుకోవడం ...ఈ ఊహ ప్రపంచం మొదలైందంటే మీరక్కడకు వచ్చి అన్ని రకాల విషయాల్ని ఊహిచుకుంటారు. అదీ మీకు ఒక నిజమైపోతుంది.

ఈ ఊహించుకోవడం అన్నది నిజం కంటే ఎక్కువ శక్తివంతమైంది....కదూ? మీరు ఓ సినిమా చూసి వచ్చారనుకోండి, దీన్ని జీవితం కంటే ఎక్కువ శక్తివంతమైన అనుభవంగా భావిస్తుంటారు. ఈ రోజుల్లో సూర్యాస్తమానం చూడడం కోసం సినిమాలకి వెళ్ళుతున్నారు. సీనరీలు చూడడానికి వెళ్ళుతున్నారు. ప్రతిరోజూ సూర్యుడు ఉదయిస్తున్నాడు...అస్తమిస్తున్నాడు. కాని వాస్తవంలో  వాళ్లకి చూడడం ఇష్టం లేదు. అది థియేటరుకి వెళ్లి చూడాలనుకుంటున్నారు. ఎందుకంటె......ఊహ అన్నది ఇలాంటిది. ఇది మీ జీవితం కంటే పెద్దదేమో అనిపించేలాగా ఉంటుంది. ఒకసారి మీరు ఏదో ఒక కథ నమ్మడం మొదలు పెట్టి ఇలా ఊహించుకోడం మొదలు పెట్టారనుకోండి..... దీనికి అంతం లేదు.  ఇది ఎంతగానో పెరిగి పెద్దదికావచ్చు. ఇది మీకు ఓదార్పునివ్వచ్చు. కాని ఇది ఎప్పుడూ మీకో పరిష్కారం కాదు.

ఈ ధ్యానలింగం  యొక్క శక్తీ, ఇది ఏ విధంగా ప్రతిష్టికరింపబడింది అంటే, ధ్యానలింగం సహజంగానే మీ వ్యక్తిత్వ పరిమితులను తీసేస్తుంది.

ధ్యానలింగం అంటే ఇంక కథలేమి లేవు. మీరక్కడ ఊరికే కూర్చోవాలి. ఇది యోగాలయం. యోగం అంటే ... ఎక్కడైతే మీ వక్తిత్త్వపు పరిమితులను మీరు తీసివేసి మీ జీవితాన్ని ఇప్పుడు ఉన్న విధంగా కంటే ఎంతో ఉత్తమంగా ఎంతో ఎక్కువగా అనుభూతి చెందగలుగుతారో అది. ఇప్పుడు ఉన్న దానికంటే జీవితాన్ని మహోన్నతంగా అనుభవించడమే. ఈ ధ్యానలింగం  యొక్క శక్తీ, ఇది ఏ విధంగా ప్రతిష్టికరింపబడింది అంటే, ధ్యానలింగం సహజంగానే మీ వ్యక్తిత్వ పరిమితులను తీసేస్తుంది. మీరు అక్కడ కూర్చుంటే మీకు ధ్యానం అంటే ఏమిటో తెలియకపోయినా సరే, మీరు అక్కడ కాసేపు కూర్చుంటే -  మీరక్కడ అయిదు నిమిషాలు కూర్చున్నానుకోవొచ్చు, కాని అక్కడ రెండు గంటలు కూర్చుండిపోతారు. ఏం జరిగిందో మీకు తెలీదు. ఎందుకూ అంటే...మీ వ్యక్తిత్వపు  పరిమితులను ఇక్కడ తీసివేయబడతాయి. ఈ లింగం ఆ విధంగా తయ్యారు చేయబడింది. ఒక్కో రోజున ఇది ఒక్కో రకంగా ఉంటుంది.

దీని మౌలికమైన అంశం  ఒకటే అయిన్నప్పటికి , ఒక్కొక్క రోజు  ఒక్కక్క స్వభావం, ఒక్కొక్క అంశానికి  చెందినవి... కొంచం ప్రముఖంగా ఉంటాయి. దీన్ని యోగంలో చక్రాలుగా కూడా చెప్తారు. ఇది యోగాలయం. మీరు నిజంగా యోగా చెయ్యకుండానే మీరు యోగంలో ఉండవచ్చు. ఈ యోగా ధ్యానలింగాన్ని ప్రాణప్రతిష్టాపన చెయ్యడం వెనకాల ఉన్న ఆలోచన అంతరార్థం ఏమిటంటే, మేము ఇలా ధ్యానం బోధిస్తూ వెళితే, మీరు ఎంత మందికి భోధించగలరు? దానికి ఒక పరిమితి ఉంటుంది. కాని ధ్యానలింగా కోట్లమందికి ఒక మాటైనా మాట్లాడకుండానే యోగాన్ని భోధించగలదు. ఇక్కడ కూర్చున్న అందరూ ధ్యానంలోకి వెళతారు. అదే దాని విశిష్టత.

ప్రేమాశిస్సులతో,
సద్గురు 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1