దేవి – ఒక క్రియాశీల శక్తి.....!!!

సద్గురు మనకు ఈ సృష్టిలో దేవి యొక్క పాత్ర ఏమిటి అనేది ఒక ఒక చిన్న కధ ద్వారా చెప్తారు, అలాగే మహిళ అని అర్ధం వచ్చే ‘స్త్రీ’ అనే సంస్కృత పదానికి మూలం ఏమిటో మనకు వివరిస్తారు.
 
 

భారతదేశంలో ఘనంగా జరుపుకునే ఉత్సవ సమయం నవరాత్రి. సద్గురు మనకు ఈ సృష్టిలో దేవి యొక్క పాత్ర ఏమిటి అనేది ఒక చిన్న కధ ద్వారా చెప్తారు, అలాగే మహిళ అని అర్ధం వచ్చే ‘స్త్రీ’ అనే సంస్కృత పదానికి మూలం ఏమిటో మనకు వివరిస్తారు.


మనం స్త్రీ తత్వం గురించి మాట్లాడినప్పుడు మనం ఒక మహిళగా ఉండటం గురించి మాట్లాడటం లేదు. ఒక మహిళగా ఉండటం అనేది శరీరానికి సంబంధించినది. స్త్రీ తత్వం అంటే శరీరం గురిచి మాత్రమే కాదు, అది దానికి మించినది. ఈ సంస్కృతిలో స్త్రీలను ఎంతో గొప్పగా చూసుకున్నారు. అలాగే ఈ సంస్కృతి స్త్రీలను భయంకరంగా పీడించటం కూడా చూసింది. ఈ సంస్కృతికి ఆధారం స్త్రీని గొప్పగా చూసుకోవటమే కాని మెల్లిగా ఈ సంస్కృతి స్త్రీలను పీడించేదిగా పరిణమించింది.

మహిళను సూచించే ప్రధానమైన పదం “రె”. “రె” అనే పదం ఈ సృష్టి యొక్క మాతృమూర్తిను సూచిస్తుంది, ఇదే ఈ మధ్యకాలంలో ఉపయోగించే “స్త్రీ” పదానికి ఆధారం. “రె” అనే పదం కదలికను, అవకాశాన్ని లేక శక్తిని సూచిస్తుంది.

మహిళను సూచించే ప్రధానమైన పదం “రె”. “రె” అనే పదం ఈ సృష్టి యొక్క మాతృమూర్తిను సూచిస్తుంది

మొట్టమొదటిగా అసలు సృష్టి ప్రకారంగా స్త్రీ ఎలా జన్మించింది? ఆ కధ ఇలా సాగుతుంది. ఈ సృష్టిని విలయం చేసే శక్తులు పెరిగి, ఇంకా శిశుప్రాయంలో ఉన్న ఈ సృష్టికి హాని చేసే స్థితికి వచ్చాయి. కనుక ముగ్గురు ముఖ్యమైన దేవుళ్ళు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలుసుకున్నారు. ఈ ముగ్గురు దేవుళ్ళు మూడు విభిన్న గుణాలను సూచిస్తారు. ఈ మూడు గుణాల కలయిక అవసరం అని వారు అర్ధం చేసుకున్నారు. కనుక వాళ్ళు అందరు శక్తివంతంగా శ్వాసను వదిలి వారిలోని అత్యున్నతమైన గుణాన్ని బయటకు వదిలారు. ఈ శ్వాస వదిలినప్పుడు ఈ మూడు శక్తులు ఏకమై దేవిగా మారాయి. కనుక ఈ సృష్టిలోని మూడు ప్రధానమైన శక్తులను తనలో ఇమడ్చుకున్నదే దేవి. ఈ శక్తినే మనం “దే-వి”గా పిలుస్తున్నాము.

ప్రేమాశీస్సులతో,
సద్గురు
 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1