మనీషా కొయిరాలా : భారతదేశం, నేపాల్ ఉన్నతమైన ఆధ్యాత్మిక వారసత్వం కలిగి ఉన్నా కూడా మన దృష్టి ఎప్పుడూ పాశ్చాత్యం వైపు మళ్ళుతుంటుంది. ఇలా ఎందుకు? 

సద్గురు: ప్రతివారూ కాంక్షించేది సఫలమైన దాన్నే. పాశ్చాత్యం ఇప్పుడు ప్రగతికి, విజయానికి చిహ్నంగా మారింది. అందుకనే, ఇక్కడ మన దేశంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా, మనం కుడా టై ధరిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఈ రోజున ప్రజల దృష్టిలో ప్రగతి అంటే కేవలం ఆర్థిక ప్రగతి మాత్రమే తప్ప మరేమీ కాదు. దానితో పెనుగులాట అనవసరం. దానిని మనం అర్థం చేసుకుని దానిని మన అధీనంలోకి తెచ్చుకోవాలి. భారత దేశం ఆర్ధికంగా విజయవంతమైతే, భారతదేశ విషయాలు మరింత ప్రాముఖ్యత సంతరించుకుంటాయి.

అన్నింటి కన్నా ముఖ్యంగా తెలుసుకోవలిసింది ఏమిటంటే, దేశం అంటే పటం మీద గీసిన ఒక గీత కాదు. అది ప్రజల మనస్సులలో ప్రతిధ్వనించ వలసిన ఆలోచన. అది ప్రజల హృదయాలలో గర్వంతో ప్రజ్వలించాలి. దేశం గురించి గొప్ప భావనలు మనలో నిర్మించబడాలంటే, అందుకు ఒక చరిత్ర కావాలి. మన దేశానికున్నంత చరిత్ర మరి ఏ దేశానికీ లేదు. ఉదాహరణకి, తమిళ రాజులూ ఆంగ్కోర్ లో గొప్ప దేవాలయాలయాలు నిర్మించారు. అయితే ఏ తమిళ విద్యార్ధి కనీసం దాని గురించి ఒక పంక్తి కూడా చదవడు. మనం గర్వపడాల్సిన విషయాలను మనం తెలుసుకోవడం లేదు.

గర్వపడే విషయం ఎక్కడో ఆకాశం నుంచి ఊడి పడదు. మనం గతం లో చేసిన గొప్ప విషయాలు మనం బహిర్గతం చేయాలి, ముఖ్యంగా యువతకి. మనం అక్కడ అక్కడా తప్పులు చేసి ఉండవచ్చు. కానీ మన గత వైభవాన్ని తిరిగి సాధించే సమయం ఆసన్నమయ్యింది.

Bha-ra-ta - The Power of a Name

Editor’s Note: Sadhguru looks at the past, present and future of this nation, and explores why this culture matters to every human being on the planet. With images, graphics and Sadhguru’s inspiring words, here’s Bharat as you have never known it!

Download Bha-ra-ta