మంత్రం అంటే ఒక స్వచ్ఛమైన శబ్దం. ఈ సమస్త విశ్వం శక్తి ప్రకంపనలే, అనేక స్థాయిల ప్రకంపనలేనని, ఈనాడు ఆధునిక విఙ్ఞానశాస్త్రం నిరూపిస్తోంది. కంపనాలు ఎక్కడ ఉన్నాయో, అక్కడ శబ్దం తప్పకుండా ఉంటుంది.

వివిధ రకాల రూపాలు ఉన్నట్లే ప్రతి రూపానికి సంబంధించిన ఒక ధ్వని, లేదా ప్రతి శబ్దానికీ సంబంధించిన ఒక రూపం ఉంటుంది. మనం ఒక శబ్దం ఉచ్చరించినప్పుడు ఒక రూపం సృష్టించబడుతుంది.శబ్దం సరైన పద్ధతిలో ఉచ్ఛరించి సరైన రూపం  సృష్టించటానికి ఒక సంపూర్ణ శాస్త్రం ఉంది. మనం ఒక నిర్దేశంచిన క్రమంలో శబ్దాలని ఉచ్చరిం చడం ద్వారా శక్తివంతమైన రూపాలని సృష్టించగలము. దీనినే "నాద యోగ "లేక "శబ్దయోగ" అంటారు. మీకు శబ్దం మీద ప్రావీణ్యత ఉంటే  దానికి సంబంధించిన  రూపం మీద కూడా మీకు ప్రవీణ్యత ఉంటుంది .

సౌండ్స్ ఆఫ్ ఈశా వారు వైరాగ్య అనే సి.డి విడుదల చేసారు.అందులో ఐదు స్తుతులు కూర్చారు ,ఒక్కొక్కటి పది నిముషాలు మాత్రమే.

https://soundcloud.com/soundsofisha/sets/vairagya-bonding-with-beyond

మీరు ఈ స్తుతులు కొన్ని నిముషాలు పాటు వినండి; వాటిలో మీకు నచ్చినది గుర్తించండి.ఇప్పుడు ఆ స్తుతితోనే ఉండిపోండి. ముందర, ఈ స్తుతులు వినండి. సంగీత పరంగా వాటిని ఇష్టపడడమో, ఇష్ట పడకపోవడమో చేయకండి, వాటిని అలా వినండి, అంతే..ఆ శబ్దాలు మీ శ్వాసలా అయిపోవాలి .కొంత సేపు అయ్యాక దానిని వినకుండానే, మీరు ఆ స్తుతితో ప్రతిధ్వనిస్తారు. అది మీకు అద్భుతంగా పని చేస్తుంది.

మంత్రం అంటే అదేదో మీరు ఉచ్చరించేది కాదు; మీరే ఆ మంత్రం అయిపోవడానికి ప్రయత్నించాలి. నేనెందుకిలా అంటున్నానంటే, ఈ సృష్ఠి అంతా కూడా శబ్దాల సంక్లిష్ట సమ్మేళనం. వాటిలో మనం కొన్ని శబ్దాలని గుర్తించాము; అవి ఈ విశ్వంలో ప్రతిదానినీ తెరవగలిగిన కీలక సాధనాలు - మీటల వంటివి. మీరే ఆ మీటలు కావాలి, లేకపోతే తేరవలేము. మంత్రంగా మారడం అంటే మీరే ఆ కీలక సాధనం, తాళం చెవి కావడం అన్నమాట; మీరే గనక ఆ తాళం చెవి కాగలిగితే తాళం కప్పని తెరవగలరు. లేకపోతే ఎవరో ఒకరు మీకు తెరిచి పెట్టాలి.  మరి మీరు తాళం చేవిగా మారి తెరవటం లేదు కదా, మీరు నన్ను సహించగలగాలి తప్పదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు