Youth AND Truth ఉద్యమం సెప్టెంబరు 7న, ఢిల్లీలోని శ్రీరాం కాలేజీలో ఆరంభమయ్యింది. మీకు అన్నింటికన్నా ప్రజాదరణ పొందిన మూడు సెలెబ్రిటి ప్రశ్నలు ప్రచురిస్తున్నాము, చూడండి.

? ☝️Iమీకేమైనా ప్రశ్నలుంటే ఇక్కడ అడగండి: ??? UnplugWithSadhguru.org

Top Three Celebrity QAs

పునర్జన్మ అనేది నిజంగా ఉంటుందా?

అన్నిటిలో లీనమై జీవిస్తూనే, కర్మ నుండి విముక్తులం కాగలమా?

ప్రేమించిన వ్యక్తిని కోల్పోతే తట్టుకోవడం ఎలా?

మొత్తం 10 topics మీదా ఇప్పటిదాకా అడిగిన  Top 5 ప్రశ్నలు

శ్రేయస్సు

  1. ఒత్తిడిని జయించడానికి ఏమి చెయ్యాలి? మానసిక సమస్యలు ఎక్కువౌతున్నాయి, వాటిని ఎలా నిరోధించాలి/ తట్టుకోవాలి? 
  2. సద్గురూ! జీవితంలో stability తీసుకురావడం ఎలా? నేను ఈ రోజు ఏదో చేద్దామనుకుంటాను, కాని దానిని మర్నాడే మర్చిపోతాను...నేనీ విషవలయంలో చిక్కుకు పోయినట్లుగా ఉంది.
  3. నేను కాన్సరు నుంచి మొదటిసారి బయట పడ్డప్పుడు ఆరోగ్యం బాగు చేసుకోవడానికి నా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చాను. ఆరు నెలల తరువాత కాన్సరు మళ్ళీ వచ్చింది. నాకిప్పుడు ఇరవై ఏళ్లు. ఈ కాన్సర్ నుండి విముక్తి చెందడానికి ఏ ప్రాక్టీసులు ఉత్తమం?
  4. ఎన్నో సంవత్సరాల శ్రమ తరువాత కూడా నేనీ శారీరిక బాధల నుంచి, నొప్పుల నుంచి తప్పించు కోలేక పోతున్నాను. పూర్తిగా తగ్గించకపోపయినా, వాటి మధ్య duration పెంచినా ఫరవాలేదు. ఈ నొప్పులు నన్ను చంపేస్తున్నాయి.
  5. ఈ విశ్వంలో అన్నింటిపట్లా నేను ఎంతో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను... జీవితంలో ప్రతిక్షణం enjoy చేయాలనుకుంటున్నాను. దానికై నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను, కాని అదేదో  artificial గా చేస్తున్నట్లుగా ఉంది, మరి అది నాకు natural గా ఎందుకు రావడంలేదు?

మనస్సు & శరీరం

  1. హస్తప్రయోగం భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మిక పరంగా హానికరమా?
  2. మీరోసారి, వ్యక్తి genetic memory ని మార్చి దానిద్వారా అతనిని సర్వ శక్తి మంతుని చేయవచ్చని అన్నారు, ఆ ప్రాక్టీసులేమిటి?
  3. నమస్కారం సద్గురూ! ఒక youth గా నేనీ హార్మోనల్  హైజాక్ ను ఎలా handle చేయాలి? యౌవ్వనంలో అలాంటి ఎనర్జీ ఎందుకు వస్తుంది?  శారీరకపరమైన అటువంటి compulsive పోకడలను దాటి పోవడం ఎలా?
  4. ఒకరు శారీరక వైకల్యంతో పుట్టినా( నా వరకు  spine and nerves ప్రాబ్లం ఉంది) మోక్ష ప్రాప్తికి అవకాశం ఉందా? మరి ఈ వెన్నెముకే axis of the Universe అయితే, మరి మీరన్నట్లు ప్రాణ శక్తి అందులోనుంచి ప్రవహిస్తుంటే, మరి ఇలా spine దెబ్బతిన్నప్పుడు ఏమి చేయాలి?
  5. మేము ఈ masturbation, pornography addiction నుంచి ఎలా బయట వడతాము? ఇది మామూలేనా? మేమే ఈ సమస్యలనుంచి బలవంతంగా బయటకు వచ్చే ప్రయత్నం చేయాలా? ఈ అలవాట్లతో వచ్చే guilt ఫీలింగ్ నుంచి ఎలా బయటపడాలి? 

భావోద్వేగాలు

  1. సద్గురూ! నేను మరో ఈశా మెడిటేటర్ ను ఎంతో కాలం నుంచి ప్రేమిస్తున్నాను. నేనా వ్యక్తితో ఆ విషయం చెప్పేయాలా? మరో ఈశా మెడిటేటర్ పెళ్లి చేసుకోవడం సబబేనా? నేను కపటంగా ఉన్నట్లు కనిపించవచ్చు, కాని నా ప్రేమ చాలా genuine. 
  2. నమస్కారం సద్గురూ! నేను ఇతరులతో open up కాలేక పోతున్నాను. నేనెవర్ని కలసినా చాలా uncomfortable  ఫీలై అక్కడనుంచి పారిపోతాను. ఇదేమైనా మానసిక సమస్యా? లేక నేనసలీ సమాజంలో మిస్ ఫిట్ నా? నేనేమిచేయాలి?
  3. నమస్కారం సద్గురూ! నేను సాధనలు చేయడం వల్లా, food habits మార్చుకోవడం వల్లా బరువు తగ్గాను. నేనెంత సన్నగా అయిపోయానో అందరూ తరచూ చెబుతుంటారు. సన్నగా ఉండడం వల్ల నాకేమీ బాధలేదు, కాని అందరూ అదేపనిగా అంటుండడం వల్ల నాకు బాధగా ఉంది. దీనిని నేనెలా handle చేయను?    ?
  4. సద్గురూ! నేను మిమ్మల్ని కోల్పోతానేమోనని భయపడుతున్నాను. మీరు భౌతికంతగా దగ్గరలేకపోతే అన్న ఆలోచనే నా గుండెను చీల్చేస్తోంది. అంతేకాకుండా నా ఆప్తులనెవరినే కోలల్పోతున్నట్లు అనిపిస్తుంది. నాకీ భయం గురించిన సత్యాన్ని తెలుసుకోవాలని ఉంది.
  5. మన జీవితంనుండి, ప్రమాదకరమైన వ్యక్తులను తొలగించుకోవడం సరైన పనేనా? లేక వారెటువంటి వారైనా మనం nice గానే ఉండాలా?

ఆధ్యాత్మికం 

  1. నమస్కారం సద్గురూ!  యువకుడిగా నామీద మా కుటుంబంలో ఎన్నో ఆశలు ఉన్నాయి. గురువుగా  మిమ్మల్ని అడుగుతున్నాను, కుటుంబ సభ్యులతో అతి తక్కువ friction తో,  ఆధ్యాత్మికంగా ఎదిగే దెలా? వాళ్లు నేను ఇల్లు వదలి పోబోతున్నాను అనుకుంటున్నారు. .
  2. ధ్యానలింగంలోని జ్ఞానాన్ని  అందుకోవడానికి, మీ ప్రోగ్రాములలో ఇచ్చే సాధన సరిపోతుందా?
  3. నాకు 23 ఏళ్లు, నేను inner engg. and hatha yoga చేశాను. నేను వాలంటీరుగానో, సన్యాసిగానో మిగతా జీవితమంతా ఆశ్రమంలోనే గడిపేద్దామనుకుంటున్నాను. మా తల్లిదండ్రులు దానికి ఒప్పుకోరు, వాళ్లు పోయేదాకా నేను ఆగదలచుకోలేదు, నేనేమి చేయాలి? 
  4. నమస్కారం సద్గురూ! మీరెవరికన్నా దీక్ష ఇస్తే ఇక అదే వారి ఆఖరి జన్మ అన్నారు. ఇలా Inner Engineering, చేశాక చనిపోయిన వారికి కాలభైరవ కర్మ లాంటి మరణ కర్మలు ఏమన్నా చేయాలా? లేక ఆ అవసరం లేదా?
  5. సద్గురూ! సాయంత్రం 6.20 presence time meditation చేస్తున్నప్పుడు ఏమి జరుగుతుంది?

విజయం

  1. నేను 24 ఏళ్ళ యువతిని, నా జీవితంలో ఏమి చేయాలో నాకు పాలుపోవడం లేదు. నాకు ఎన్నో విషయాలు interesting గా ఉంటాయి. నేను నా జీవితమంతా ప్రేమగా చేసుకోగలగింది ఏదో తెలుసుకోవాలని ఉంది.
  2. నమస్కారం సద్గురూ! మీరెప్పుడూ జీవితం full throttle లో ఉంది అంటుంటారు. మరి కుర్రాళ్లు తమ జీవతంలో ప్రతి విషయంలో దానిని ఎలా experience చేయగలరు? దానికి ఇప్పుడు మేము ఏమి చేయగలం?
  3. శ్రీనివాస రామానుజం విశ్వమంతటికీ access ఉన్నట్లు mathematical equation వ్రాసేవారని విన్నాము. ఓ దేవత ఆ ఐడియాలన్నీ ఆయనకు  చెప్పేదని కూడా ఆయన అన్నారు. నేను అటువంటి స్థితికి ఎలా చేరగలను?
  4. నేను ప్రపంచానికి ఎన్నో చేద్దామనుకుంటాను, కాని నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు, మరేం చేయాలి?
  5. నన్ను నేను మెచ్చుకోకుండా ఎలా ఉండగలను? ఒక్కోసారి నాకు success అవుతున్నట్లు ముందుగానే తెలుస్తుంది, కాని దానిని అందుకునే  మానసిక స్థితి కోల్పోతాను. నేను ఒకే frequency లో చాలా కాలం పాటు ఎలా ఉండగలనో తెలుసుకోవాలని ఉంది.

అడగకూడనివి

  1. హస్తప్రయోగం గురించి తెలియజేయండి. డాక్టర్లు అది మంచిదే అంటారు. కాని గీతలో కృష్ణుడు ఈ vital fluid ను భద్రపరచుకోవాలని అంటాడు. IE చేశాక గత పదిరోజులనుంచి నాకు దాని మీద కోరిక పోయింది. వివరించండి.
  2. యువకునిగా నా sexual energy అంతటా ఉందనిపిస్తోంది. ముఖ్యంగా నా మనస్సు దానితో గొడవ పడుతోంది, నా ప్రాక్టీసులపైన కూడా మనస్సు నిల్పలేక పోతున్నాను, నేనమి చేయాలి? ఈ విషవలయం ఎలా ఛేదించాలి? ఇటువంటి పరిస్థితులను మన బ్రహ్మచారులు ఎలా తట్టుకోగలుగుతున్నారు?
  3. సద్గురూ! చాలా మంది teenagers, లాగా నాకూ ఈ Masturbate చేసుకోవాలని ఉంటుంది.  ఈ అలవాటు నుంచి ఎలా బయట పడాలి? దాని మూలంగా నాలో నాకు బాధ, హాని కలుగుతున్నాయి.  
  4. ఈ homosexuality లేక bisexuality అనేవి sexuality ని అణచుకోవడం వల్లనే కలుగుతున్నాయా? వీటికి జన్యుపరమైన, memory పరమైన కారణాలేమననా ఉన్నాయా? వ్యక్తి  sexual orientation మార్చవచ్చా? 
  5. ఈ రోజుల్లో online dating apps, escort services వంటివి మామూలై పోవడం వల్ల casual sex ఒక trend అయిపోయింది. అనేకమంది sex partners ఉండడం ఓకేనా? దానివల్ల మనిషిపై ఏరకమైన ప్రభావం ఉంటుంది? sex కావాలంటే పెళ్ళి అవసరమా?

మనుషులు

  1. మన చుట్టూ ప్రజల్లో ఉన్న కలహాలు, ద్వేషాల మూలంగా, మీరు జీవితంలో కూరుకు పోయినట్లుగా  భావిస్తారు. ఎవ్వరూ ఎవ్వరి గురించీ పట్టించుకోరు. అందరూ పిచ్చాపాటీ కబుర్లే తప్ప ఎవ్వరి మధ్యా ప్రేమాభిమానాలు లేవు.   ?☹️
  2. మీరు positive/negative/neutral pranic foods మీద రుద్రాక్ష మాల వేరు వేరు గా తిరగడం చూపారు. మీరు దీనిని శాస్త్రీయంగా ప్రపంచానికి చూపగలిగితే అందరూ positive pranic foods తింటారు, మీరు అలా చేయవచ్చు గదా? 
  3. నమస్కారం సద్గురూ! మీ ఫొటో ఒక దానిలోకి చూస్తూ ఒకామె మాట్లాడడం చూశాను. ఆమె పిచ్చి నమ్మకాలలో కూరుకుపోతోందా? లేక ఆమె భక్తి అనుభూతి చెందుతున్నదా? ( అదే నిజమైతే మీరు ఆమె చెప్పేది విన్నారా?)  
  4. ఒక్కోసారి ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు ఉండాలని అనిపించినా, బయటి పరిస్థితులు అలా జరగనివ్వవు. మరో రకమైన పరిస్థితుల్లో ఏళ్ళ తరబడి కలసి ఉన్నా ఒకరిపై ఒకరికి ప్రేమ అనేది ఉండదు, అలా ఎందుకుంటుంది, బోర్ కొట్టా?
  5. సద్గురూ, వ్యక్తిగా మీ జీవితంలో ఆఖరి ఛాప్టరు ఎలా ఉంటుంది? ఒక గురువుగా అది భిన్నంగా ఎలా ఉంటుంది?

సమాజం

  1. నగరాల్లో ఆడవారి జీవితం ఘోరంగా తయారయ్యింది. అంటడం, ముట్టడం, పోకిరీ మాటలు  మామూలై పోయింది. ఆడపిల్లలు  వీటన్నింటినీ తట్టుకోవాల్సివస్తోంది, దురదృష్టవశాత్తూ వాళ్ళు దీనికి వ్యతిరేకంగా తమ గళం విప్పలేక పోతున్నారు. అటువంటి, బాధాకరమైన సామాజిక దురవస్తలకు మనమేమి చేయాలి?  
  2. సద్గురూ, ఫలానా రోజుల్లో జుట్టూ, గోళ్ళూ కత్తిరించగూడదని ఎందుకంటారు? శనివారాల్లో బంధువులను కలసుకోగూడదు అంటారు. రావి చెట్టు క్రింద మూత్ర విసర్జనం చేస్తే దెయ్యాలు పట్టుకుంటాయి అంటారు. కొన్ని ముహూర్తాలలోనే పెళ్ళిచేసుకోవాలి, జాతకాలు కలవాలి. అటువంటి ఎన్నో ఉన్నాయి, ఇదంతా ఏమిటి?
  3. భారత దేశంలో తల్లి తండ్రులు తమ పిల్లల careers ఎందుకు కంట్రోల్ చేయాలనుకుంటారు, వారు తమకు అన్నీ తెలుసు అని ఎందుకు అనుకుంటారు? 
  4. ప్రపంచం మొత్తాన్ని ప్రతిష్టీకరించడం ఎలా? దానికి మేమెలా సాయం చేయగలము?
  5. ప్రణామ్ గురుదేవ్, కర్వచౌత్ నాడు ఉపవాసం చేస్తున్న ఆడవారు తమ భర్తల ఆయుష్షును ఎలా పెంచగలరు? చంద్రుడు కేవలం ఖగోళ వస్తువే కదా? దీనిమీద ఒక పారడీ కూడా చేశారు - GIRLIYAPA KarvaChauth Special అనేది ఉంది, మీరు చూస్తే బాగుంటుంది. మమ్మల్ని గైడ్  చేయండి.  

జీవన్మరణాలు

  1.  (సమయం వచ్చినప్పుడు) శరీరాన్ని ఎలా వదిలేయాలో తెలుసుకోవడం కోసం నేనేమి చేయాలి?
  2. అత్యవసర పరిస్థితుల్లో సద్గురుతో ఎలా మాట్లాడగలుగుతాము? నొప్పి బాగా ఉన్నప్పుడు బరహ్మానంద స్వరూపా ఛాంటింగ్ చేశాను, కాని నొప్పి ఎక్కువగా ఉండడం వల్ల అది పని చేయలేదు. నేను నిజంగా  నిరుత్సాహ పడ్డాను. నాకు నిజంగా ఆయనతో మాట్లాడాలని పించింది, కాని మాట్లాడలేక పోయాను.
  3. నా చిన్నప్పటినుంచీ ధ్యానం చేస్తున్నాను. ఏకత్వాన్ని /శూన్యాన్ని experience చేసాను. ఇప్పుడు శాంభవి, సూర్యక్రియ చేస్తున్నాను. మోక్షం వస్తుందని నమ్మక మిచ్చారు. అన్నింటినీ అనుభూతి చెందాలని ఉంది, ముఖ్యంగా గత జన్మను, కొన్ని సందర్భాలైనా ఫరవాలేదు, ఎలా?
  4. సద్గురూ శివుడు నిజానికి ఒక వ్యక్తా లేక శూన్యమా? ఆయన మనం అనుకుంటున్నట్లు శూన్యమే అయితే, నేను గాఢ నిద్రలో ఆయనను ఎలా చూడగలిగాను, ఎంత గాఢంగా అంటే ఆ తరువాత కొన్ని నెలల పర్యంతం నాకు అసలు నిద్రే పట్టలేదు.
  5. మీరు ప్రతి జన్మకూ కొంత నిర్ణీత కర్మ ఉంటుందని చెప్పారు, అది కరిగిపోయాక తర్వాతి కోటా వచ్చేముందు కొంత వ్యవధి ఉంటుందని చెప్పారు. ఈ కర్మను ఎవరు నిర్దేశిస్తారు? తరువాతి జన్మకు ఇంత కోటా అని? 

కలగలిపి

  1. మీరు వ్యక్తికి కావలసిన రీతిలో వారి కర్మను బట్టి, ఆధ్యత్మిక అవసరాలను బట్టి సరైన cocktail కలుపుతామని అన్నారు. మాకు కావలసిన సరైన కాక్టైల్ అందుకోవడానికి మేము మిమ్మల్ని ఎలా ఆశ్రయించగలము?   
  2. శివుడు లేక ఆదియోగికి గడ్డం ఎందుకు లేదు?
  3. నేను మీ ఉపన్యాసాలు వింటున్నప్పుడు ఎన్నో ప్రశ్నలు వస్తాయి, కాని మీరు సమక్షంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో మిమ్మల్ని ఏమీ ప్రశ్నించలేకపోయాను, కేవలం మీవంక అలా చూస్తుండి పోయాను.
  4. నమస్కారం సద్గురు, నా మనస్సు ఎప్పుడూ మారుతుంటుంది, నేను దేనిమీదా ఎక్కు  ఫోకస్ చేయలేకపోతున్నాను, నేను ఈ ఫోకస్  ను ఎలా పెంచుకోగలను, నేనేమి చేయాలి?
  5. ఈ శంకరన్ పిళ్ళై ఎవరు?

సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.

Youth and Truth Banner Image