ప్రశ్న: మీరు ఒకసారి ఏమి చెప్పారంటే, “మనం కొన్ని సరళమైన విషయాలను అర్థం చేసుకోకపోవడం వల్లే ప్రపంచంలో ఎంతో శాతం మంది అనారోగ్యంతో ఉన్నారు” అని. ఇవి ప్రపంచంలో చాలా తేలికగా చేయవచ్చునని చెప్పారు. దాని గురించి మరికొంచెం చెప్పగలరా సద్గురు...?  ఈ సరళమైన విషయాలు, మనం ఆరోగ్యంగా ఎలా ఉండగాలమో తెలియజేయండి...?

సద్గురు: ఒకసారి ఒక కుర్ర డాక్టర్ ఉన్నాడు. అతను కొంచెం సీనియర్ డాక్టరు దగ్గరికి వెళ్ళాడు. అతనికి ఒక రోగిని చూడడంలో ఏదో సమస్య వచ్చింది, అందుకని. అప్పుడు ఆ సీనియర్ డాక్టరు – “ఓహో... నరాలు ...ఆ.. వాంతులు.. అంతేనా ?” అన్నాడు. “అవును, నాకు ఎలాంటి వైద్య విధానమూ తెలియట్లేదు.. నరాలకి – వాంతులకి ఏమిటి సంబంధమో...” అన్నాడు అ జూనియర్ డాక్టర్. “మీరు అతన్ని గోల్ఫ్ ఆడుతున్నాడా అని అడగండి. అతను ఆడడంలేదు అని చెబితే, మీరు ఆడమని చెప్పండి. ఆడుతున్నాను అంటే,  మానేయమని చెప్పండి. అంతా సరైపోతుంది “ అని చెప్పాడు ఆ సీనియర్ డాక్టరు. లోకం ఇలాంటిదే...నిజంగానే. కొంతమంది ఎక్కువ పని చేయడంవల్ల, వారికి అనారోగ్యం.  కొంతమంది సరిగ్గా పని చేయకపోవడం వల్ల, వారికి అనారోగ్యం.

మీరు ఈ భూమ్మీద రెండు వందల సంవత్సరాల క్రితం జీవించినట్లైతే మీరు భౌతికంగా ఇప్పుడు చేసేదానికంటే శారీరికంగా 20% ఎక్కువ పనిచేస్తూ వుండివుండాల్సి వచ్చేది,...ఔనా ? శారీరిక శ్రమ పడవలసి వచ్చేది. మీరు అక్కడికి – ఇక్కడికి నడుస్తూ వుండేవారు, ప్రతీదీ మీ చేతులతో చేసుకోవలసి వచ్చేది. ఇప్పటికంటే కనీసం ఇరవై రెట్లు ఎక్కువ పని చేసేవారు... బహుశా, నేను తప్పు చెబుతున్నానేమో ..!!! వంద రెట్లు ఎక్కువ పని చేసేవారు. మీలో కొంతమంది రెండువందల ఏభై రెట్లు ఎక్కువ పని చేసేవాళ్ళు. మీరు గనక అంత పని చేస్తూవున్నట్లైతే, నేను “కొద్దిగా విశ్రాంతి తీసుకోండి” అని చెప్పి ఉండేవాడిని. ఇప్పుడు, మీరసలు శరీరాన్ని వాడడమే లేదు. ఈ శరీరాన్ని ఉపయోగించడం ద్వారానే, దానిని మీరు చక్కగా ఉంచగలరు.

మనం గనక శారీరికంగా ఎంతగా మన శరీరాన్ని ఉపయోగించాలో, అంతగా ఉపయోగించినట్లైతే ఈ భూమ్మీద 80% ఆరోగ్య సమస్యలనేవి ఉండవు.

మీరు “ఆరోగ్యం” అన్నప్పుడు – మీరు శారీరిక ఆరోగ్యం గురించే మాట్లాడుతున్నారు. ఈ శరీరాన్ని మీరు ఎంత బాగా ఉపయోగిస్తే, అది అంత మెరుగ్గా పని చేస్తుంది. ఆరోగ్యం గురించి ఒక సరళమైన విషయం ఏమిటంటే, మీరు శరీరాన్ని ఉపయోగించాలి. మీరు శరీరాన్ని తగినట్టుగా వాడితే గనక, ఆరోగ్యాన్ని కలుగజేసుకోడానికి అవసరమైనవన్నీ దాని దగ్గర ఉంటాయి. అంటే, నాకికేమీ జరగదా..?  నేను బాగానే ఉంటానా..? అని అడిగితే ...మనం గనక శారీరికంగా ఎంతగా మన శరీరాన్ని ఉపయోగించాలో, అంతగా ఉపయోగించినట్లైతే ఈ భూమ్మీద 80% ఆరోగ్య సమస్యలనేవి ఉండవు.  మిగతా 20%. వాటిలో ఒక 10% మీరు తింటున్న ఆహారం, మీ ఆహారపు అలవాట్లు మారిస్తే మరో 10% తగ్గిపోతాయి. అంటే, ఒక 10% ఆరోగ్య సమస్యలు మాత్రమే మిగులుతాయి. ఇవి, ఎన్నో విభిన్నమైన కారణాలవల్ల జరుగుతాయి. ఒకటి, కర్మ సంబంధ కారణాలవ్వచ్చు, పర్యావరణం అవ్వచ్చు, వ్యవస్థలో ఎన్నో జరగడం వల్ల అవచ్చు. దీనినిని మనం సరిచేయవచ్చు. అనారోగ్యంగా ఉన్నవారందర్లో 90% మంది కేవలం శరీరాన్ని బాగా ఉపయోగిస్తూ, సరైన ఆహారం తింటూ, మెరుగుపడితే; మిగతా 10% మందిని చూసుకోవడం పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ, ఇప్పుడు ఈ ఆరోగ్య సమస్యలన్నవి ఇంత ఎక్కువగా ఎందుకు ఉన్నాయంటే – మనం సరిగ్గా ఆహారం తీసుకోము  లేదా ఈ శరీరాన్ని సరిగ్గా ఉపయోగించం.

ఇదే కాకుండా, జీవితానికి మరెన్నో అంశాలున్నాయి. దీన్ని ఎంతో సరళంగా చెప్పాలంటే - మీరుగనక వ్యాయామం చేస్తున్నట్లైతే, ఉదాహరణకి మీరు రోజుకు 1000 సార్లు పిడికిలిని బిగించి వదులు చేస్తే ; ఒక నెల రోజుల తరువాత మీ చేయి ఎలా పని చేస్తుందో చూడండి. మీరు, ఏమీ చేయక్కరలేదు. మీరిక్కడ వూరికే కూచోని ఇలా చేతిని మడిచి, పిడికిలి బిగించి వదిలి పెట్టండి ...30 రోజుల తరువాత మీ చేయి ఎంతో అద్భుతంగా పని చేస్తుందని మీరు చూడగలరు. అదే మీ మెదడుతో గనక మీరు చేయగలిగితే; అది కూడా ఒక నెల రోజుల సమయంలో ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. అది మీ మనస్సుకి చేస్తే – అదీ ఎంతో అద్భుతంగా చేస్తుంది. అది మీ ప్రాణశక్తి తో చేస్తే, అది ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. ఇవన్నీ ఎంతో అద్భుతంగా పని చేస్తే – అదే ఆరోగ్యం.

ఆరోగ్యం అనేది,  మీరు కనిపెట్టే విషయమేమీ కాదు. ఆరోగ్యం అనేది – మీ ఆలోచన కాదు. ఆరోగ్యం అంటే ... జీవితం ఎంతో బాగా సాగడమే..!!  జీవన ప్రక్రియ సులువుగా జరిగిపోతుంది. హాయిగా జరిగిపోతుంది. ఇది మీ ఆలోచనో, మరొకరి ఆలోచనో కాదు. మనం ఇప్పుడు, ఆరోగ్యం అన్నది ఒక ఆలోచన అన్నట్లు ప్రవర్తిస్తున్నాం. ఆరోగ్యాన్ని మనం సృష్టించినట్టుగా ఆలోచిస్తున్నాం. ఒకవేళ మనం ఏదైనా సృష్టించాం అంటే అది  -  అనారోగ్యాన్నే,  ఆరోగ్యాన్ని కాదు.

ఆరోగ్యం జీవన విధానం

మీరు, జీవన విధానాన్ని సరిగ్గా, సజావుగా జరగనిస్తే –  అది ఆరోగ్యమే. అందుకని, మీరు మీ శరీరాన్ని కొంచెం వాడాలి. మీ మెదడుని కొద్దిగా ఉపయోగించాలి. మీ శక్తిని కొద్దిగా ఉపయోగించాలి. ఈ మూడిటినీ గనక మీరు వ్యాయామంలో పెట్టి; సమతుల్యంలో ఉంచగలిగితే మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మనం ఎన్నో యంత్రాలని వాడుతున్నాం. కానీ మీరు మీ జీవితంలో క్రియాశీలతని పెంచుకుంటే -  శారీరికంగా, మానసికంగా, శక్తిపరంగా – ఆరోగ్యం అన్నది దానంతట అదే వస్తుంది. మీ శరీరం బాగా పని చేస్తోంది, మీ మనసు బాగా పని చేస్తోంది,  మీ శక్తి  ఈ రెండిటికి సహకరిస్తూ అన్నీ సజావుగా జరిగేలాగా చూస్తూవుంటే – అదే ఆరోగ్యం.

మనం ఎక్కువ చురుకుదనం లేకుండా వుంటున్నాం కాబట్టి, ఎక్కువ అనారోగ్యం పాలౌతున్నాము.

జీవితం ఎంతో గొప్పగా సాగిపోతూ ఉంటుంది. అదే ఆరోగ్యం. ఇది, ఒక వైద్యపరమైన ఆలోచన కాదు. వైద్యులు, వైద్య విజ్ఞానం ఈ రోజున ఎంతో అత్యవసరం అయిపోయింది. ఎందుకంటే, మన జీవన విధానాలు అనారోగ్యంగా తయారు చేసుకున్నాము. ఇంతకు మునుపెప్పుడూ, ప్రపంచంలో ఈ రోజున వైద్యానికి, వైద్యవిజ్ఞానికి ఉన్నంత ప్రాముఖ్యత లేదు. మనం ఎక్కువ చురుకుదనం లేకుండా వుంటున్నాం కాబట్టి, ఎక్కువ అనారోగ్యం పాలౌతున్నాము. మనం ఎక్కువకాలం జీవిస్తూ ఉండి ఉండవచ్చు. అది ఎందుకంటే, ఎంతో ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల - ఆ ట్యూబులు పెట్టుకుని ఇరవై సంవత్సరాలు జీవించవచ్చు. లేదంటే ప్రకృతికి దాని విధానాలు దానికి వున్నాయి. ఏదైతే, ఇక్కడ జీవించడానికి సామర్ధ్యం కలిగి వుందో ఆ జీవితమే ఇక్కడ వుంటుంది. లేదంటే, ఆ జీవితం వెళ్లిపోతుంది.

కానీ, ఈ రోజున మనం జీవితాన్ని మరో విధంగా చేశాము. మనం ఇప్పుడు ఆ పాత పద్ధతులకు వెళ్ళలేం. కానీ దానర్థం, మనం ఇరవై ఏళ్ళు ఉండగానే అరవై ఏళ్ళు వచ్చేసినట్లుగా అయిపోనక్కరలేదు. వంద సంవత్సరాల క్రితం అరవై ఏళ్ల వాళ్ళు ఎంత పని చేసేవాళ్ళో;  ఈ రోజున ఇరవై ఏళ్ల వాళ్ళు అంత పని  చేయలేరు. అంటే, మనం మానవాళిని బలహీనంగా తయారు చేసేశాం. కాలంతో పాటు మానవాళి తిరోగమిస్తోంది. అందుకని, మీరు అన్నిటిని ఉపయోగించాలి.

ప్రేమాశిస్సులతో,
సద్గురు