ఆనందంగా ఉండటం అవసరమా?
మనం సంపూర్ణంగా జీవించటానికి, పూర్తి సామర్ధ్యంతో పని చెయ్యటానికి ఆనందంగా ఉండటం ఎంత అవసరమో తెలుసుకోవాలంటే 'ఆనందం 24x7' సీరీస్‌లోని ఈ ముప్పై ఆరవ వ్యాసం తప్పక చదవండి.
 
 

మనం సంపూర్ణంగా జీవించటానికి, పూర్తి సామర్ధ్యంతో పని చెయ్యటానికి ఆనందంగా ఉండటం ఎంత అవసరమో తెలుసుకోవాలంటే   వ్యాసం తప్పక చదవండి.


మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీరు ఏమి చేసినా కూడా మీరు సంపూర్ణంగా చేస్తారు. ఎందుకంటే మీరు వెనుకాడటానికి గానీ, భయపడటానికి గానీ ఏమీ ఉండదు. అవునా, కాదా?

మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీ పూర్తి సామర్ధ్యం మేరకు తప్పకుండా చేస్తారు. మీరు ఆనందంగా లేనప్పుడు, మీకు మీ స్వంత సమస్యలే ఉంటాయి. అప్పుడు మీరు మీ జీవితంలో దేనిని 100%, అంటే సంపూర్ణంగా చేయలేరు.

దీని అర్ధం ఆనందంగా ఉన్నప్పుడు మీరు ఏమైనా చేయగల ఒక సూపర్ హ్యూమన్ అవుతారని కాదు. ఆనందంగా ఉన్నప్పుడు, మీరు మీ పూర్తి సామర్ధ్యం మేరకు పని చేస్తారు; కనీసం ప్రపంచంలో మీ వల్ల అయ్యేది అవుతుంది. మీరు చేయలేనిది ఎలాగూ అవ్వదు. మీరు ఆనందంగా ఉన్నా, బాధగా ఉన్నా మీకు సామర్ధ్యం లేని దానిని మీరు ఎలాగూ చేయలేరు.

మీరు ఆనందంగా ఉన్నప్పుడు మీరు ఏమి చేసినా కూడా మీరు సంపూర్ణంగా చేస్తారు. ఎందుకంటే మీరు వెనుకాడటానికి గానీ, భయపడటానికి గానీ ఏమీ ఉండదు. అవునా, కాదా?

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1