మనస్సంటే ఓ ఆలోచనల మూట. నిరంతరం మన మనస్సులో ఏవో ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. ఈ ఆలోచనల గురించి, వాటితో ఎలా వ్యవహరించాలనే విషయం గురించి సద్గురు ఏమి చెప్పారో తెలుసుకోవాలంటే  ఈ వ్యాసం చదవండి.


ఆలోచన మిమ్మల్ని ఎక్కడికీ తీసుకువెళ్ళదు. ఆలోచన సలహాలను ఇస్తుంది, వాటిని తీసుకోవడం, తీసుకోకపోవడం మీ ఇష్టం. ఆలోచనలు మీవి కావు; అవి మీ మీద పడిన సామాజిక ప్రభావాల వల్ల మీలో చేరాయి. అవి ఇతరులు ఇచ్చే సలహాల వంటివి, వాటిని మీరు స్వీకరించాలనుకున్నా, పట్టించుకోవద్దనుకున్నా, ఆ నిర్ణయం మటుకు మీదే, అవునా, కాదా?

ఆలోచన మిమ్మల్ని ఎక్కడికీ తీసుకువెళ్ళదు. ఆలోచన సలహాలను ఇస్తుంది, వాటిని తీసుకోవడం, తీసుకోకపోవడం మీ ఇష్టం.

ఆలోచన ఎప్పుడూ ఏమీ చేయదు, అది వస్తూ పోతూ ఉంటుంది. మీరు ఏ ఆలోచనను ఎంచుకోవాలనుకుంటున్నారు?  ఏ ఆలోచనను ఎంచుకోవాలనే నిర్ణయాన్ని మీ చేతుల్లో ఉంచుకోవడం చాలా  అవసరం. మీకు ఏ ఆలోచన అవసరమో దాన్నే మీరు ఎంచుకోవాలి. కాని,  మీరు ఇప్పుడు అలా ఎంపిక చేసుకోవడం లేదు, మీరు మీకు వచ్చిన ఆలోచనలన్నిటినీ ఎంచుకుంటున్నారు. అందువల్లనే మీ మనస్సంతా గందరగోళంగా ఉంది.

 ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.

tinybudha.com