గర్వపడకుండా జీవించడమెలా?

మనం చేసే పని గురించి మనం గర్వపడాలని అందరూ చెబుతారు. అలా ఎందుకు చెబుతారు? ఎలాంటి గర్వ భావన లేకుండా కేవలం అవసరాన్ని బట్టి పని చేయడం సాధ్యమేనా? గర్వం, దురాభిప్రాయాలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే 'ఆనందం 24x7' సీరీస్‌లోని ఇరవై ఎనిమిదవ వ్యాసం ఈ వారం చదవండి.
 
 

మనం చేసే పని గురించి మనం గర్వపడాలని అందరూ చెబుతారు. అలా ఎందుకు చెబుతారు? ఎలాంటి గర్వ భావన లేకుండా కేవలం అవసరాన్ని బట్టి పని చేయడం, జీవించడం సాధ్యమేనా? గర్వం, దురాభిప్రాయాలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి?  ఈ ప్రశ్నలకు సమాధానాలు  తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి.


మీ గురించి, మీ ఆలోచనల గురించి మీరే గొప్పగా ఊహించుకోవటాన్ని గర్వం అంటారు. మీరు వాస్తవంతో సంబంధం లేకుండా జీవిస్తుంటే, దానిని గర్వం అంటారు.

మీరు చేసే పని గురించి మీరు గర్వపడాలని అందరూ చెబుతారు. ఇవి సార్జంట్లు సైనికులకి చెప్పే మాటల లాంటివి. మీకు సైనికుల మాటలంటే ఏమిటో తెలుసా? సైనికులు యుద్ధానికి వెళ్ళే మందు సార్జంట్లు వారికి ఏమి చెబుతారో మీకు తెలుసా? ‘రండి, మనం వెళ్లి ఎందుకూ పనికిరాని ఆ పిరికి పందల పని పడదాం. మనం వెళ్లి వాళ్ళను నరికేద్దాం, వారిని షూట్ చేసి చంపేద్దాం’ ఇవి సార్జంట్లు సైనికులకి చెప్పే మాటలు. సార్జంట్లకు తెలుసు అవి నిజం కాదని, కానీ సైనికులు వాటిని నిజమని నమ్ముతారు. ఆ నమ్మకమే ఒక సైనికుడికి  ప్రమాదకర పరిస్ధితులను ఎదుర్కొనే  ధైర్యాన్నిస్తుంది.

ఒక వేళ ఆ సార్జంటు అక్కడ కూర్చుని, ‘మీరు అక్కడికి వెళ్తున్నారంటే, మీరు బులెట్లు, మందుగుండ్లలోకి నడుస్తున్నట్లే, సరేనా? మీరు మీ ట్రిగ్గర్ మీద వేలు పెట్టేలోపే, మీరందరూ తునాతునకలయిపోవచ్చు’ అనే వాస్తవాన్ని చెప్పాడంటే, వాళ్ళు వెళ్లరు. అతను ఎదుటివారిని ఎందుకూ పనికిరాని వారిగా చిత్రీకరించవలసిందే. అందుకే ‘వాళ్ళు ఎందుకూ పనికిరాని వెధవలు, మనం వాళ్ళను బూట్లతో  తోక్కేస్తాం, వాళ్ళను చంపటానికి తుపాకులు కూడా అక్కర్లేదు’ అని వారితో అంటాడు. అది వారిలో ఒక విధమైన గర్వాన్ని నింపుతుంది.

‘మనం ఎవరం? మనం భారతీయులం. మనం ఏమిటి? మనం ప్రపంచంలో అందరికన్నా బలవంతులం. మనం ఎవరం? మనం అమెరికన్లం, మనది అతి పెద్ద దేశం, మనది బలమైన దేశం, మనం అలా ప్రపంచమంతా బూట్లు కూడా లేకుండా నడచి వెళ్ళిపోవచ్చు. మనకు ఏమీ అవసరం లేదు’ - ఇటువంటి మాటలు సైనికులకి తమ గుర్తింపు పట్ల గర్వాన్ని కలిగించి, యుద్ధంలోకి వెళ్లి ఏమైనా చేయగల ధైర్యాన్నిస్తాయి. ఇది పనులను ప్రారంభించటానికి ఒక మార్గం.

మీరు అంతర్గతంగా వికసించినప్పుడు, పనులు చేయడానికి మీకు ఎటువంటి గర్వమూ అవసరం లేదు; మీరు కేవలం వివేకంతో, పూర్తి వివేకంతో వాటిని చేయవచ్చు.

మీ చుట్టూ చాలా మంది మూర్ఖులు ఉన్నప్పుడు, మీరు వారిలో ఒక విధమైన గర్వాన్ని నింపవలసి ఉంటుంది, లేకపోతే మీరు వారితో ఏమీ చేయించలేరు. మీరు అంతర్గతంగా వికసించినప్పుడు, పనులు చేయడానికి మీకు ఎటువంటి గర్వమూ అవసరం లేదు; మీరు కేవలం వివేకంతో, పూర్తి వివేకంతో వాటిని చేయవచ్చు.

గర్వం లేనప్పుడు దురభిప్రాయం ఉండదు. ఎందుకంటే గర్వం, దురాభిప్రాయం రెండూ వేరు వేరు కాదు. మీకు ఒకదాని పట్ల గర్వభావన ఉంటే వేరొక దాని పట్ల దురభిప్రాయం, అంటే తక్కువ చూపు ఉన్నట్లే, అవునా? ‘నేను భారతీయుడిని అయినందుకు గర్విస్తున్నాను’ అని అన్నప్పుడు సహజంగానే మీరు భారతీయులు కాని వారి పట్ల దురభిప్రాయంతో ఉంటారు. అంటే వారిని తక్కువ చూపు చూస్తారు.

కాబట్టి గర్వం ఒక విధమైన దురభిప్రాయంలో నాటుకుపోయి ఉంటుంది. కానీ, మూర్ఖులను పనికి పురమాయించటానికి ఈ దురభిప్రాయం అవసరం. అది లేకుండా మీరు వారితో పని చేయించలేరు.

మీ చుట్టూ ఉన్నవారు చాలామంది మూర్ఖులు కాబట్టి, వారితో ఏదైనా చేయించటానికి వారు జ్ఞానోదయం పొందేదాకా ఎదురు చూడాలా? లేదు, ఎందుకంటే అది కూడా మూర్ఖత్వమే అవుతుంది. మీ దగ్గర గాడిదలు ఉంటే, మీరు వాటితో కూడా పని చేయించాలి. గాడిదలకు తెలివిలేదు, అవునా, కాదా? కానీ అవి ఎందుకు పనికిరానివా? కాదు. అలాగే, మీరు మూర్ఖులు అని నేనన్నప్పుడు, మీరు పనికిరానివారని నేననట్లేదు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.

 

 
 
 
 
 
 
Login / to join the conversation1
 
 
3 సంవత్సరాలు 6 నెలలు క్రితం

pranam sathguru