అజ్ఞానం ఆనందాన్ని కలిగిస్తుందా? ఒక వేళ అది నిజమే అయితే, ఆ ఆనందం ఎప్పటివరకు నిలుస్తుంది?  ఈ ప్రశ్నలకు సమాధానాలు  తెలుసుకోవాలంటేఈ వ్యాసం  చదవండి.


అజ్ఞానం పరమానందమని మీకు ఎప్పుడూ చెబుతున్నారు కదా! అవును, జీవితం మిమ్మల్ని ఇబ్బంది పెట్టనంత వరకు, అజ్ఞానం ఆనందకరమే. ఇప్పుడు మీరు ఒక పెద్ద భవంతి మీద నుండి కిందకి దూకితే ఎంత ఆనందంగా ఉంటుందో మీకు తెలుసా? ఆ ఆనందం కింద పడే వరకు మాత్రమే, అది మీరు నేలని తాకే వరకు మాత్రమే. ఒకసారి నేలను తాకితే మీరు పచ్చడైపోతారు, ఇంక ఆనందం లేదు, ఏమీలేదు.

మూర్ఖులు ఆనందంగా ఉండగలరు. కానీ, అది జీవితం వారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టనంత వరకే, సాధారణంగా జీవితం వారిని ఇబ్బంది పెడుతుంది. ఒక వేళ జీవితం వారిని ఇబ్బంది పెట్టకపోతే, మరణం తప్పకుండా ఇబ్బంది పెడుతుంది

ఒకవేళ నేలను తాకే అవకాశం లేదనుకోండి, ప్రతి మనిషీ ఎత్తైన భవంతి నుండి మళ్ళీ మళ్ళీ కిందకి దూకుతూనే ఉంటాడు. ఎందుకంటే అది చాలా ఆనందంగా ఉంటుంది. మనుషులు రోలర్ కోస్టర్ రైడ్లు ఎందుకు ఎక్కుతారని అనుకుంటున్నారు? వాళ్ళు బంగీ జంపింగ్ ఎందుకు చేస్తారని అనుకుంటున్నారు? వారు స్కై డైవింగ్ ఎందుకు చేస్తారనుకుంటున్నారు? నేలని తాకే అవకాశం లేకుండా కేవలం దూకటం ఆనందంగా ఉంటుందనే.

మీరు ఒక ఎత్తైన భవంతి మీద నుండి కిందికి పడితే అది చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అజ్ఞానం పరమానందం. కానీ అది మీరు నేలని తాకేంత వరకే, ఆ కొన్ని క్షణాలే. కాబట్టి మూర్ఖులు ఆనందంగా ఉండగలరు. కానీ, అది జీవితం వారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పట్టనంత వరకే, సాధారణంగా జీవితం వారిని ఇబ్బంది పెడుతుంది. ఒక వేళ జీవితం వారిని ఇబ్బంది పెట్టకపోతే, మరణం తప్పకుండా ఇబ్బంది పెడుతుంది.

నేను ఇప్పుడు జీవన్మరణ ప్రక్రియలకు సంబంధించిన ఆనందం గురించి మాట్లాడటం లేదు. జీవన్మరణ ప్రక్రియలతో సంబంధం లేని ఆనందం గురించి నేను మాట్లాడుతున్నాను.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.

Photo Courtesy:  anna langova@http://all-free-download.com