మనం సాధారణంగా ఆనందాన్ని ఒక లక్ష్యంగా భావిస్తూ, దానిని వివిధ మార్గాల్లో పొందాలని ప్రయత్నిస్తాం. దీని గురించి సద్గురు ఏమంటున్నారో తెలుసుకోవాలంటే  ఈ వ్యాసం చదవండి.


ఆనందం ప్రపంచానికి ఆఖరి మెట్టు కాదు. నేను ఆనందాన్ని మీ జీవితపు మొదటి మెట్టుగా, చిగురించే మీ జీవితానికి గట్టి పునాదిగా మాట్లాడుతున్నాను.

నేను ఆనందాన్ని మీ జీవితం యొక్క అంతిమ లక్ష్యంగా మాట్లాడటం లేదు. నేను ఆ ఆనందాన్ని మీ జీవితం యొక్క ‘అ’ గా మాట్లాడుతున్నాను, ’ఱ’ గా కాదు.

నేను ఆనందాన్ని మీ జీవితం యొక్క అంతిమ లక్ష్యంగా మాట్లాడటం లేదు. నేను ఆ ఆనందాన్ని మీ జీవితం యొక్క ‘అ’ గా మాట్లాడుతున్నాను, ’ఱ’ గా కాదు. అసలు ఆ ‘అ’ నే సంభవించనప్పుడు, మీరు ఇక దేని గురించి మాట్లాడుతున్నారు? మీరు పునాదులు లేకుండా ఒక ఇంటిని నిర్మించాలనుకుంటున్నారు. పునాదులు లేకుండా ఒక ఇంటిని నిలబెట్టి ఉంచడం ఎంత కష్టమో మీకు తెలుసా? మీరు ఒక్క క్షణం ఒదిలేస్తే అది మీ తల మీదే పడుతుంది. మీ జీవితం అలానే ఉంది, అవునా, కాదా? మీరు ఒక్క నిమిషం పరాకుగా ఉంటే, అంతా మీ తల మీద విరిగి పడుతుంది.

కానీ మీకు ఆనందం అనే ఒక గట్టి పునాది ఉంటే, మీరు దాని మీద మీకు కావలసినది ఏమైనా చేసుకోగలరు. మీరొక పెద్ద భవంతిని కట్టినా అది చక్కగా ఉంటుంది. ఎందుకంటే దానికి గట్టి పునాదులు ఉంటాయి. ఇప్పుడు మీకు పునాదులు లేవు. ఒకవేళ ఉన్నా, అవి చాలా బలహీనంగా ఉన్నాయి. వాటి మీదే మీరు ఒక భవనాన్ని నిలబెట్టాలనుకుంటున్నారు. ఇలాగైతే, మీ జీవితంలో మీరు చేసే ప్రతి చిన్న చర్య కూడా  చిత్రహింసే అవుతుంది!

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.