వచ్చిపోయే ఆనందం!
మనమందరం మన జీవితాలలో ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటాం. కానీ, మన జీవితంలో ఆనందం కేవలం ఒక సందర్శకుడిలా వస్తూ, పోతూ ఉంటుంది. ఇలా ఆనందం ఎందుకు వస్తూ పోతూ ఉంటుందో, శాశ్వతానందాన్ని పొందటానికి మనం ఏమి చేయాలో ఈ వ్యాసం చదివి తెలుసుకోండి!
 
 

ఆనందం మన జీవితాలలో ఒక సందర్శకుడిలా వస్తూ, పోతూ ఉంటుంది.  ఆనందం ఎందుకు ఇలా వస్తూ పోతూ ఉంటుందో, శాశ్వతానందాన్ని పొందటానికి మనం ఏమి చేయాలో  తెలుసుకోవాలంటే  ఈ వ్యాసం చదవండి!  


 మద్యం తాగి ఆనందాన్ని అనుభవించేవాళ్ళు చాలా మంది  ఉన్నారు. అది నిజం, అందుకే చాలా మంది మద్యం తాగుతున్నారు. మీరు ఆ విషయాన్ని అంగీకరించాలి. చాలామంది వారాంతంలో మద్యం తాగినప్పుడే, కాస్త ఆనందం పొందుతారు. లేకపోతే వారికి వారమంతా భారమే. ఒకవేళ వారు సాయంత్రం తాగుతన్నారంటే,  వారికి ఆ రోజంతా భారంగా ఉండిందని అర్థం. సాయంత్రం ఒక్క గుటక వేస్తే, వారికి బాగా అనిపిస్తుంది. చాలా మంది విషయంలో ఇదొక వాస్తవం. మీరు దాన్ని కాదనలేరు, అవునా, కాదా?

ఇప్పుడు మనం ఆనందం మనని సందర్శించటం నుండి మనమే ఆనంద మూలం అయ్యే విధంగా మన జీవితాలను మార్చకోవడం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎవరూ కూడా 24 గంటలూ తాగుతూ, పెయింటింగ్ చేస్తూ, డాన్స్ చేస్తూ గడపలేరు. ఏ ఒక్క పనీ కూడా 24 గంటలూ చేయడం సాధ్యం కాదు. ఆనందం ఒక అంతర్గత స్ధితి. ఒక అంతర్గత  స్ధితిని సృష్టించడానికి బాహ్య చర్యలను వినియోగిస్తే, మీరు ఆ బాహ్య చర్యలకి బానిసలౌతారు. అప్పుడు మీ ఆనందానికి ఆ బాహ్య చర్యలు తప్పనిసరి అవుతాయి.

మీరు ఒక పెయింటర్ అయితే, మీ నుండి మీ పెయింటు, బ్రష్‌లను తీసేసుకుంటే, మీరు ఇక పెయంట్ చేయలేరు. ఒకవేళ మీ జీవిత పరిస్ధితుల వల్ల అలాంటి పరిస్థితి వస్తే, మీరు తీవ్రమైన బాధలో ఉంటారు. ఇక ’నేను పెయింట్ చేయలేను, అందుకే నేను బాధలో ఉన్నాను!' అని మీరు అంటారు.  మీ బాధకంతటికీ గల ఏకైక కారణం అదే అవుతుంది.

ప్రతి రోజూ ప్రకృతి వేరు వేరు రంగులని పెయింట్ చేస్తుంది, మీరు దానికి అదనంగా పెయింట్ జోడించవలసిన అవసరం ఎక్కడుంది? మీరు పెయింట్ చేయాలనుకుంటే, పర్వాలేదు, చేయండి. కానీ ప్రతి రోజూ ఎంతో పెయింటింగ్ వేయబడుతూనే ఉంది, కాని  అది చూసే కళ్ళు మీకు లేవు, అవునా, కాదా? పొద్దున్నుండీ సాయంత్రం వరకు ఎంత పెయింటింగ్ వేయబడుతుందో మీరు చూస్తున్నారా? పగలూ రాత్రీ నిరంతరం ఎవరో ఒకరు పెయింటింగ్ వేస్తూనే ఉన్నారు. మీరు కేవలం దాన్ని చూసి ఆనందించాలి, అంతే. మీరు ఇక్కడ నుంచుంటే, అది మిమ్మల్ని కూడా మీకు ఎలా కావాలంటే అలా  పెయింట్ వేస్తుంది.

మీలో ఒక అంతర్గత స్ధితిని సృష్టించడానికి మీరు ఒక నిర్దిష్ట చర్యపై ఆధారపడితే, మీరు క్రమంగా ఆ చర్యకి గాఢంగా బానిసలౌతారు

మీలో ఒక అంతర్గత స్ధితిని సృష్టించడానికి మీరు ఒక నిర్దిష్ట చర్యపై ఆధారపడితే, మీరు క్రమంగా ఆ చర్యకి గాఢంగా బానిసలౌతారు. మీ బానిసత్వానికీ, బంధానికీ ఆధారం అదే; మీరు దానిని మార్చే దాకా, ఆనందం ఒక జీవన విధానమనీ, అంటే జీవించి ఉండటంలోనే ఆనందం ఉన్నదనీ మీకు తెలియదు. అప్పడు మీ జీవితంలో ఆనందం ఒక సందర్శకుడిలా మాత్రమే వస్తూ, పోతూ ఉంటుంది. కేవలం అదైనా ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూ ఉందని ఆశిస్తున్నాను. ఎవరికి కూడా ఆనందం ఇలా వస్తూ పోతూ ఉండటం ఇష్టం ఉండదు. అందరు తమ జీవితాలలో ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటారు. ఈ శాశ్వతానందాన్ని పొందటానికి కావలిసిన ప్రక్రియలను, పద్ధతులను అందించడం యోగా యొక్క ప్రాధమిక ఉద్దేశం.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1