మీ బాధలకు కారణం గతమా?
మనలో చాలా మందిమి గతాన్ని పదే పదే తవ్వుకొని బాధపడుతుంటాం. 'అయ్యో, ఇలా జరిగిందే, అలా జరిగిందే' అనుకుంటూ మధనపడుతుంటాం. అయితే నిజానికి మనం ఇలా మధనపడడం సమంజసమేనా? గతంలో ఎటువంటి విషయాలు జరిగినా సరే వాటిని మనకి అనుకూలంగా మార్చుకోగలమా? ఈ ప్రశ్నలకు సద్గురు సమాధానాలను 'ఆనందం 24x7' సీరీస్‌లోని ఈ ముప్పై ఒకటవ వ్యాసంలో మీ కోసం అందిస్తున్నాము.
 
 

మనలో చాలా మందిమి గతాన్ని పదే పదే తవ్వుకొని బాధపడుతుంటాం. 'అయ్యో, ఇలా జరిగిందే, అలా జరిగిందే' అనుకుంటూ మధనపడుతుంటాం. అయితే నిజానికి మనం ఇలా మధనపడడం సమంజసమేనా? గతంలో ఎటువంటి విషయాలు జరిగినా సరే వాటిని మనకి అనుకూలంగా మార్చుకోగలమా?  ఈ ప్రశ్నలకు సద్గురు సమాధానాలను ఈ వ్యాసంలో మీ కోసం అందిస్తున్నాము. 


మీ బాధలకు కారణం గతమా?

మీ గతం గురించి మిమ్మల్ని ఇప్పుడు ఎవరు దండిస్తున్నారు? ఎవరైనా మీ జీవితం గురించి లెక్కలు వ్రాస్తున్నారా? లేదు, మీరు మాత్రమే ఆ లెక్కలు వ్రాస్తున్నారు. దానికి బయటి నుండి ఆడిట్ (సమీక్ష) అంటూ ఏమిలేనప్పుడు, మీరు మీ లెక్కలను మీకు కావలిసిన విధంగా కొంత సరిచేసుకోవచ్చు కదా! అవునా, కాదా?

మీ జీవితంలో ఎలాంటి అర్థం పర్థం లేని విషయాలు జరిగినా, మీరు కావాలనుకుంటే దానిని లాభంలోకి మార్చుకోవచ్చు, ఎందుకంటే ఆ బాలన్స్ షీట్‌ని హ్యాండిల్ చేస్తోంది మీరే. దానికి బయటి నుండి ఏ సమీక్షా లేదు. కాబట్టి, జరిగిన దానిని బట్టి, మీ ఏడుపు కధలను మీ బాలన్స్ షీట్‌లో నష్టాలుగా చూపించుకోవచ్చు. లేకపోతే ఏమి జరుగుతున్నా, దాన్నొక  లాభంగా మార్చుకోవచ్చు.

మీ బాధకి మూలం మీ గత చర్యలు కావు. మీ గతంతో మీరు ఇప్పుడు ఎలా  వ్యవహరిస్తున్నారన్నదే మీ బాధకి మూలం.

అంటే, మీ బాధకి మూలం మీ గత చర్యలు కావు. గతంతో మీరు ఇప్పుడు ఎలా  వ్యవహరిస్తున్నారన్నదే మీ బాధకి మూలం. ఉదాహరణికి  మీ వధ్ద ఓ చేపల మూట ఉందనుకోండి. ఆ మూటలో చాలా కంపుకొడుతున్న చేపలు ఉంటే, మీరు దానిని మంచి ఎరువుగా ఉపయోగించుకోవచ్చు లేదా ఆ మూట ప్రక్కనే కూర్చొని బాధ పడవచ్చు.

ప్రత్యేకించి మీ గతం చాలా చెత్తగా ఉంటే, దాని నుండి మీరు ఒక అద్భుతమైన తోటని పెంచవచ్చు, ఎందుకంటే అది మంచి ఎరువులా పని చేస్తుంది. చెత్త మంచి ఎరువులా పనిచేస్తుంది. లేదా మీరు దాన్ని మీకే పూసుకుని బాధపడుతూ ఉండవచ్చు. అంటే, మీరు పోగుచేసుకున్న మూటలోని చెత్త మిమ్మల్ని బాధ పెట్టడం లేదు, ఇప్పుడు మీరు దానితో వ్యవహరిస్తున్న పద్ధతే  మిమ్మల్ని బాధ పెడుతోంది.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1