అలెగ్జాండర్ ద గ్రేట్ ఇడియట్!

అలెగ్జాండరుని 'అలెగ్జాండరు ద గ్రేట్(Alexander - The Great!)' అని పిలుస్తారు. కానీ సద్గురు మాత్రం అతని పేరుకు మూడో పదం కూడా జతచేసి 'అలెగ్జాండరు ద గ్రేట్ ఇడియట్ (Alexander - The Great Idiot!)' అని అంటున్నారు. అలా ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం తప్పక చదవండి!
 

అలెగ్జాండరుని 'అలెగ్జాండర్ ద గ్రేట్(Alexander - The Great!)' అని పిలుస్తారు. కానీ సద్గురు మాత్రం అతని పేరుకు  మూడో పదం కూడా  జతచేసి 'అలెగ్జాండర్ ద గ్రేట్ ఇడియట్ (Alexander - The Great Idiot!)' అని అంటున్నారు. అలా ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం తప్పక చదవండి!


డయోజిన్స్ ఒక అధ్బుతమైన  గ్రీకు యాచకుడు. అతను ఎప్పుడూ ఆనంద పారవశ్యంలో మునిగి ఉండేవాడు . అతను గ్రీకు దేశంలో ఒక నది ఒడ్డున జీవించేవాడు. యాచించటానికి ఒక అందమైన  గిన్నెను ఎవరో అతనికి ఇచ్చారు. అతను ఉట్టి గోచి మాత్రమే కట్టుకుని ఉండేవాడు. అతను గుడి ముందర యాచించి దొరికినదేదో తినేవాడు. ఒక రోజు అతను తన భోజనాన్ని పూర్తి చేసి నది వైపుగా నడుస్తుండగా ఒక కుక్క అతనిని దాటుకుని వెళ్ళి నదిలో దూకి, కొంచం అటు ఇటు ఈత కొట్టి మళ్ళీ ఇసుక మీదకు వచ్చి ఆనందంగా దొర్లింది. అతను దీనిని చూసి “ దేవుడా! నా జీవితం ఈ కుక్క కంటే అధ్వాన్నంగా ఉంది.” అనుకున్నాడు. అతను ఆనంద పరవశంలో మునిగే ఉన్నాడు కానీ తన జీవితం ఆ కుక్క జీవితం కంటే హీనంగా ఉంది అన్నాడు, ఎందుకంటే చాలా సార్లు తను కూడా నదిలో దూకాలనుకున్నాడు, కానీ అతని గోచి తడిచిపోతుందని, అక్కడే వదిలిపెడితే తన అందమైన గిన్నె ఏమవుతుందోనని అతను ఆలోచించేవాడు. ఆ రోజున అతను తన గిన్నెను, గోచిని కూడా పడేసి అప్పటి నుంచి పూర్తి నగ్నంగా బ్రతికాడు.

ఒక రోజున అతను ఆనంద పారవశ్యంలో నది ఒడ్డున పడుకుని ఉండగా అలెగ్జాండరు అటు వైపుగా వచ్చాడు. అలెగ్జాండరుని 'అలెగ్జాండర్ ద గ్రేట్(Alexander - The Great!)' అని పిలిచేవారు. అతని పేరుకు నేను మూడో పదం కూడా పెడదాము అనుకుంటున్నాను – 'అలెగ్జాండర్ ద గ్రేట్ ఇడియట్ (Alexander - The Great Idiot!)' అని. ఎందుకంటే అతను జీవితాన్ని వృధా చేసిన మనిషి. అతను తన జీవితాన్నే కాక వేరే వారి జీవితాలను కూడా వృధా చేసాడు.

అతను తన పదహారవ ఏట నుంచే యుద్ధం మొదలు పెట్టాడు. మరో పదహారు ఏళ్ళు ఆపకుండా యుద్ధం చేస్తూ కొన్ని వేల మందిని చంపాడు. అతను తన ముప్పై రెండవ ఏట అత్యంత బాధాకర స్థితిలో మరణించాడు. ఎందుకంటే అతను సగం ప్రపంచాన్ని మాత్రమే జయించగలిగాడు. మిగతా సగం ఇంకా అలానే మిగిలిపోయింది అన్న బాధతో మరణించాడు. అత్యంత మూర్ఖుడు మాత్రమే ఇలా పదహారు ఏళ్ళు యుద్ధం చేయగలడు.

చక్రవర్తి దుస్తులలో అలెగ్జాండర్ తన పెద్ద గుర్రంపై స్వారి చేస్తూ వచ్చి డయోజిన్స్ కళ్ళు మూసుకుని పరమానందంతో ఇసుకలో దొర్లటం చూశాడు.

చక్రవర్తి దుస్తులలో అలెగ్జాండర్ తన పెద్ద గుర్రంపై స్వారి చేస్తూ వచ్చి - డయోజిన్స్ కళ్ళు మూసుకుని పరమానందంతో ఇసుకలో దొర్లటం చూశాడు. అలెగ్జాండర్ పెద్ద గొంతుతో “దిక్కుమాలిన జంతువా! నీ వంటి మీద ఒక ముక్క గుడ్డ కూడా లేదు, నువ్వొక జంతువు లాగ ఉన్నావు. దేని గురించి నువ్వంత పరమానందంగా ఉన్నావు?” అని గట్టిగా అరిచాడు. డయోజిన్స్ అతని వైపుకి చూసి ఎవరూ ఒక చక్రవర్తిని అడగటానికి దైర్యం కూడా చేయని ఒక ప్రశ్న అడిగాడు. అతను “ నువ్వు కూడా నాలాగా ఉందామని అనుకుంటున్నావా?” అని అడిగాడు.

ఇది అలెగ్జాండరుని ఎంతో లోతుగా తాకింది, అతను “అవును. దానికి నేను ఏమి చేయాలి?” అని అన్నాడు. డయోజిన్స్ ఆ పనికిరాని గుర్రాన్ని దిగు, ఆ చక్రవర్తి దుస్తులను తీసేసి నదిలోకి విసిరేయి. ఈ నది ఒడ్డు మన ఇద్దరికీ సరిపోకపోదు. నేను ఎలాగూ దీన్నంతటిని ఆక్రమించడం లేదు. నువ్వు కూడా ఇక్కడ పడుకొని పరమానంద భరితుడవు కావచ్చు. నిన్ను ఎవరు ఆపుతున్నారు?” అని అన్నాడు. అలెగ్జాండర్ “అవును నేను నీలాగా ఉండాలి అని కోరుకుంటున్నాను, కానీ నువ్వేమి చేస్తున్నావో అది చేసేంత ధైర్యం నాకు లేదు” అన్నాడు.

చరిత్ర పుస్తకాలు ఎప్పుడూ అలెగ్జాండర్ అంటే ధైర్యం అని మీకు చెప్పాయి. కానీ అలెగ్జాండర్ తనకు డయోజిన్స్ చేసిన పని చేయటానికి ధైర్యం లేదు అని ఒప్పుకున్నాడు. అప్పుడు అలెగ్జాండర్ “నేను నిన్ను వచ్చే జన్మలో కలుస్తాను’’ అని అన్నాడు. దాన్ని అతను వచ్చే జన్మ వరకూ వాయిదా వేశాడు, ఎవరికి తెలుసు అతను వచ్చే జన్మలో ఒక బొద్దింకై పుట్టొచ్చు. మీరు మానవ జన్మతో  పుట్టినప్పుడు కొంత నిర్దిష్ట అవకాశంతో పుట్టారు. అది మీరు వృద్దా చేసి వచ్చే జన్మలో చూద్దాము అంటే, ఎవరికి తెలుసు వచ్చే జన్మలో ఏమి జరుగుతుందో?

ఒక్క క్షణం అలెగ్జాండర్ ఆ అవకాశానికి చాలా దగ్గరగా వచ్చాడు. కాని దాన్నిఅతను వాయిదా వేశాడు. ఈ సంఘటన తరువాత ఆయనలో కొంత వైరాగ్యం కలిగింది. తన జీవితం చివరలో అతనికి యుద్ధం మీద ఆసక్తి పోయింది, కాని అలవాటుగా యుద్ధం చేశాడు. ఒకసారి కోరిక తగ్గాక అతనిలో శక్తి క్షీణించి అతను మరణించాడు. 

ఒక వివేకమైన పని చేయటానికి మీ జీవితంలోని చివరి క్షణాల దాకా ఆగకండి. అది చాలా ఆలస్యం అయిపోవచ్చు.

అతను మరణించే ముందు తన మనుషులకు వింత సూచనలు ఇచ్చాడు. అతను “ నా శవ పేటిక తయారు చేసినప్పుడు దానికి రెండు వైపులా రంధ్రాలు ఉండి - ఈ గొప్ప అలెగ్జాండరు కూడా ఉట్టి చేతులతోనే వెళ్తున్నాడు అని చూపించటానికి నా చేతులు రెండూ బయటకు ఉండాలి” అన్నాడు. ఇది ఒక్కటే తన జీవితంలో అతను చేసిన వివేకమైన పని.

ఒక వివేకమైన పని చేయటానికి మీ జీవితంలోని చివరి క్షణాల దాకా ఆగకండి. అది చాలా ఆలస్యం అయిపోవచ్చు. ఇప్పుడే, అన్నీ మీ చేతులలోనే ఉన్నప్పుడు, మీకు శక్తి ఉన్నప్పుడు, జీవితం బాగున్నప్పుడు, జీవితాన్ని కావలసినంత లోతుగా తరచి చూడటానికి ఇదే మంచి సమయం, జీవితం బాగా లేనప్పుడు కాదు. చాలా మంది జీవితం బాగా లేనప్పుడు లేదా ఏదైనా విషాదం జరిగినప్పుడు తమ జీవితాన్ని కొంచం లోతుగా చూస్తారు. జీవితం బాగా లేనప్పుడు మీరు కొంచం ఎక్కువ సుముఖతతో ఉండచ్చు, కానీ మీకు అప్పటికి కావలసిన శక్తి, తీవ్రత ఉండకపోవచ్చు. జీవితంలో అంతా బాగునప్పుడే మీరు జీవితాన్ని వీలైనంత  లోతుగా చూడాలి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు