కేవలం శుద్ధ మూర్ఖత్వమే!

మనం ఆనందంగా లేకపోవడానికి మన జీవితంల్లో ఎవరో ఒకరు - అత్తగారో, బాసో లేక మరెవరో కారణమని మనం అనుకుంటూ ఉంటాము. కాని నిజంగా ఆనందానికైనా దుఃఖానికైనా అసలైన కారణమేమిటో తెలుసుకోవాలంటే 'ఆనందం 24x7' సీరీస్‌లోని తొమ్మిదవ వ్యాసం ఈ వారం చదవండి.
 

మీరు మీ జీవ శక్తులని స్తబ్ధంగా చేస్తే, అది ప్రపంచానికి ఏంతో మేలు అవుతుంది. ఎందుకంటే మీరు అప్పుడు చనిపోయి ఉంటారు. కానీ మీ జీవ శక్తులను చాలా ప్రతికూలంగా చేసుకున్నారు. అవి తప్పుడు దిశలో వెళ్ళి, తప్పుడు రూపాన్ని తీసుకుంటున్నాయి.; తప్పుడు రూపం అనడం సరి కాదేమో, ఆనందరహిత, బాధామయ రూపం అనవచ్చు. దుఃఖం అంటే ఆహ్లాదం లేకపోవడం, అవునా, కాదా?

కాబట్టి శరీరాన్ని, మనసుని, శక్తిని ఆహ్లాదంగా ఉంచుకోవడానికి బదులు ఆహ్లాదరహితంగా ఉంచుతున్నారు. నేను మిమ్మల్ని అందుకు కారణం అడిగితే మీరు మీ అత్తగారినో, మీ బాస్‌నో, మీ భార్యనో, మీ భర్తనో, మీ పిల్లలనో, మీ బ్యాంక్ బాలన్సునో లేదా మీ ఖర్చులనో నిందిస్తున్నారు. అయితే, ఇవేవీ కారణాలు కావు. కారణం కేవలం మీ తెలివి తక్కువ తనమే. ఇక వేరే ఇతర కారణమేమీ లేదు.

ప్రత్యేకించి మీ అత్తగారు మంచివారు కాకపోతే, మీ బాసు ఒక నిరంకుశుడు అయితే, మీ భార్య లేదా భర్త ఒక తిరుగుబోతు అయితే, మీ బ్యాంకు బ్యాలన్సు ఖాళీ అయితే, అప్పుడు మీ చేతులలో ఉన్నఈ ‘ఒక్కదాన్ని’ మీరు ఆహ్లాదంగా ఉంచుకోవటం ఇంకా ముఖ్యం, అవునా, కాదా? కానీ ప్రతివాళ్ళూ, ప్రతి ఒక్కటీ మీకు బాధ కలిగిస్తున్నాయి.

మీరు ఎంతసేపూ ఇతరులని నిందిస్తున్నారు. మన చుట్టూ ఉన్న మనుషులు, పరిస్ధితులు ఆహ్లాదంగా లేకుండా ఉంటే, అది చాలు. మీరు మిమ్మల్ని, మీ శరీరాన్ని, మీ శక్తులని కూడా ఆహ్లాదరహితం చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా చేసుకోవడంలో ఏ మాత్రం తెలివి లేదు. కాబట్టి బాధ పడటానికి ఉన్న ఒకే ఒక్క కారణం తెలివితక్కువ తనమే అని ప్రతి ఒక్కరికీ తెలియాలి. కేవలం శుద్ధ మూర్ఖత్వమే. ఇంకా వేరే కారణమేమీ లేదు.

ఇది నేను ప్రస్తావించడం మీకు అహంకారం అనిపించవచ్చు, కానీ మనుషులు వారి బాధల గురించి ఫిర్యాదు చేస్తున్నప్పుడు, ‘మీకు తెలుసా నా జీవితంలో ఏమవుతోందో? నిన్న నేను ఫలానా వస్తువుని పోగొట్టుకున్నాను. రేపు నేను ఇంకొకటి పోగొట్టుకోబోతున్నాను’ అంటుంటారు. మనుషులు పోగొట్టుకునేవి, పొందేవి, అన్నీ నాకు తెలుసు. నేను కూడా నా జీవితంలో పోగొట్టుకున్నాను, పొందాను.

అంతా చక్కగా ఉన్నందువల్ల ఆనందం రాదు. మీరు మీ తెలివిని మీ చుట్టూ జరుగుతున్న వాటికి లోబరచకుండా ఉండడంవల్ల, మీరు ఆనందాన్ని పొందుతారు.

అంతా చక్కగా ఉన్నందువల్ల ఆనందం రాదు. మీరు మీ తెలివిని మీ చుట్టూ జరుగుతున్న వాటికి లోబరచకుండా ఉండడంవల్ల, మీరు ఆనందాన్ని పొందుతారు. ఒకసారి మీ తెలివి మీ చుట్టూ ఉన్న పరిస్ధితులలో, మీకు మీరు ఆపాదించుకున్న గుర్తింపులలో చిక్కుకుపోతే,  అది ఇక పని చేయదు. అప్పుడు ఇక బాధ తప్పదు.

అప్పటికీ మీరు ఆనందంగా ఉన్నారంటే, దానిలో మీ పాత్ర ఏమీ లేదు. మీరు ఎప్పుడో ఎక్కడో తీసుకున్న ఆహారం దానికి కారణం అయ్యుంటుంది. ఎక్కడో పూర్వపు కర్మలు పని చేస్తూ ఉండి ఉంటాయి; పాత ఉరవడి పని చేస్తూ ఉండి ఉంటుంది. మీరు ఎప్పుడో చేసిన వివేకమైన పని ఇంకా పని చేస్తూ ఉండి ఉంటుంది, కానీ అది ఏంతో కాలం పని చేయదు. ఉదాహరణకు భోజనం విషయం తీసుకుందాం. పాత భోజనం కొంతసమయానికి కుళ్ళిపోతుంది. మీరు ఎల్లప్పుడూ అదే అనుభూతిని పొందాలంటే, ప్రతి రోజూ తాజా భోజనం తయారు చేసుకోవాలి. మీరు ప్రతి రోజూ తాజా భోజనం వండటం నేర్చుకోవాలి.

మీరు ఒక రోజు వంట చేసి దానినే జీవితాంతం తినాలనుకుంటే, కొంత కాలం తరువాత మీరు ఎరువు తినవలిసి వస్తుంది, అన్నం కాదు. ఆ పరిస్థితి తప్పకుండా వస్తుంది.

 
ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1