సృష్టి మూలం మీలోనే ఉంది!

సృష్టికి మూలం మనలోనే ఉందని, మనం ఎప్పుడూ ఆనందంగా ఎలా ఉండగలం అనే దానిగురించి సద్గురు ఏమంటున్నారో ఈ వ్యాసంలో మీ కోసం అందిస్తున్నాము.
 

సృష్టికి మూలం మనలోనే ఉందని, మనం ఎప్పుడూ  ఆనందంగా ఎలా ఉండగలం అనే దానిగురించి  సద్గురు ఏమంటున్నారో  ఈ  వ్యాసంలో మీ కోసం అందిస్తున్నాము. 


మీరు సాంప్రదాయ పరంగా మన చరిత్రను చూస్తే , యోగా ఎల్లప్పుడూ వివిధ రకాల ఆనందం గురించే మాట్లాడుతోంది. 'బ్రహ్మానందం' అంటే అసలు సృష్టే ఆనందం అని.

మీరు శారీరకమైనవిగా, మానసికమైనవిగా లేదా భౌతిక శక్తులుగా వేటినైతే చూస్తున్నారో, అవి పైపై తొడుగులు మాత్రమే. లోపల ఉన్నది, అంటే సృష్టి మూలం ఆనందమే. మనం బ్రహ్మానందమన్నప్పుడు, సృష్టికర్తే ఆనందం లేదా ఆనందమయం అని అంటున్నాము. నేను సృష్టికర్తే ఆనందమయం అన్నప్పుడు, ఆ సృష్టికర్త ఆనందంగా ఉండి ఎక్కడో స్వర్గంలో కూర్చుంటే ఏమి లాభం?

ఇతర స్ధితులు మీలో ఎందుకు భాగమయ్యాయి అంటే మీరు మీలోని అంతర్భాగంతో అనుసంధానమై లేరు 

సృష్టికర్త లేదా సృష్టి మూలం ఎక్కడో కూర్చుని లేదు. మీరు మీ శరీరాన్ని గమనిస్తే,పుట్టిన క్షణం నుండీ ఇప్పటివరకూ, అది ఎంతగా పెరిగిందో చూడండి. ఈ పెరుగుదల బయటి నుండి సాగాదీయటం వలన జరగలేదు. ఇది సృష్టికర్త లోపలనుండి నిరంతరం పని చేయటం వలన జరిగింది.

అంటే, సృష్టి మూలం ఇప్పుడు మీలోనే ఉంది. అదే ఆనందం. ఈ సృష్టిలోని ప్రాధమిక శక్తి మీ జీవితంలో వ్యక్తీకరించబడితే, మీరు దాన్ని బయటకి రానిస్తే, మీరు కేవలం ఆనందంగా మాత్రమే ఉండగలరు. మీరు వేరే విధంగా ఉండే మార్గమే లేదు. అసలు నిజానికి మీరు వేరే విధంగా ఉండవలిసిన అవసరమే లేదు. ఇతర స్ధితులు మీలో ఎందుకు భాగమయ్యాయి అంటే మీరు మీలోని అంతర్భాగంతో అనుసంధానమై లేరు. మీరు అనుభవిస్తున్న ఇతర స్ధితులకు అన్నిటికీ కారణం మీ మనసు మీద మీకు నియంత్రణ లేకపోవటమే.

ఎవరైనా వారి జీవితంలో ఎదో పొరపాటు జరిగినందు వల్ల లేదా ఒక బాహ్య పరిస్ధితి బాధని సృష్టించడం వల్ల బాధను అనుభవించరు. బాహ్య పరిస్దితులు శారీరకంగా నొప్పిని కలిగించగలవు, కానీ మీకు బాధ ఎల్లప్పుడూ మీ మనసు మీకు కావాలసింది చేయనందువల్లే కలుగుతుంది.మీ మనసు మీ నుండి సూచనలు తీసుకుంటుంటే, బాధకి బదులు ఆనందాన్ని ఎంచుకోమని మీకు ఎవరూ వేదాంతం భోధించనవసరం లేదు. ఆనందాన్ని ఎంచుకోవడానికి కావాల్సిన తెలివితేటలు మీలో ఉన్నాయి. ఎందుకంటే ‘ నేను ఆనందంగా ఉండాలి!’ అనేది మానవులలో ఉండే ప్రధానమైన కోరిక.

ఎవరో నేర్పడం వలనో,  వేదాంతం వలనో, పురాణాల వలనో లేదా మతం వలనో, ‘నేను ఆనందంగా ఉండాలి’ అన్న ఆలోచన మీలో రాలేదు. అసలు, ‘నేను ఆనందంగా ఉండాలి’ అన్నదే జీవితం యొక్క మౌలికమైన కోరిక మీలో ఉన్నజీవమే ఆనందంగా ఉండాలనుకుంటోంది, ఎందుకంటే మీలోని సృష్టి  మూలం యొక్క స్వభావమే ఆనందం.

 

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.

 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1