ఆనందం అంతరంగానికి సంబంధించినది...!!!

 
 

మనం ఎన్నో పనులు చెయ్యాలనుకుంటూ ఉంటాము, కాని వాటన్నిటికి సమయాన్ని ఎలా కల్పించుకోవాలో అర్ధంకాక సతమతమవుతూ ఉంటాము. మన సమయాన్ని మరింత సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం గురించి  సద్గురు ఏమంటున్నారో  ఈ వ్యాసంలో మీ కోసం అందిస్తున్నాము. 


నా జీవితంలో నేను చేసిన కార్యకలాపాల పరంగా మాట్లాడితే, సాధారణ మనుషులు మూడు జీవితకాలాలలో చేసే దాని కన్నా నేను ఎక్కువే చేసి ఉంటాను. నేను నా జీవితంలో ఎన్ని పనులు చేసానన్న దాని గురించి మాట్లాడటం లేదు, నేను మాట్లాడుతోంది క్రియాశీలత్వం గురించి.

అందరూ ‘ ఇదంతా చేయటానికి నాకు సమయం ఎక్కడ దొరికింది?’ అని అనుకుంటారు. మీతో మీకు ఎటువంటి సమస్యా లేనట్లైతే, మీరెంతో పని చేయగలుగుతారు. కాని మీతో మీకే ఎల్లప్పుడూ సమస్యలు ఉంటే, మిమ్మల్ని మీరు శాంత పరచుకోవడానికే చాలా సమయం, శక్తి అవసరమవుతుంది. అలాంటప్పుడు, బయటదాని గురించి మీరేమి చేయగలుగుతారు? చాలా కొంచమే. చర్యలు చేయవలిసింది బయట, లోపల కాదు. లోపలి ఎటువంటి చర్యలు అవసరం లేదు. అంతర్గతంగా ఉన్నది పరిపూర్ణమైంది.  అంతర్గతంగా ఉన్నదానితో మీరు అనుసంధానమై  ఉన్నట్లైతేనే, ఈ విషయం మీకు అర్థమవుతుంది.

ఇప్పుడు మీరు అంతా బయటనే ఉన్నారు. మీకు లోపలి దాని గురించి ఏమీ తెలియదు. మీకు ప్రాధమికంగా ఆనందం అంటే ఏమిటో తెలియదు. ఎందుకంటే మీకు లోపల ఏముందో తెలియదు. లోపల ఉన్న విషయాల గురించి మీకు తెలియదని అనడం లేదు. నేను మీకు ‘లోపలి దాని’ గురించి అసలేమీ తెలియదని అంటున్నాను.

మీకు తెలిసినదంతా బయటిదే. ప్రస్తుతం మీ ఆలోచనలు, భావోద్వేగాలు లోపల ఉన్నాయని మీరు అనుకుంటారు, కానీ అవి లోపల లేవు. మీ భౌతిక శరీరం కూడా లోపలది కాదు; మీరు దానిని ఆహారం రూపంలో సేకరించారు. మీరు భౌతిక శరీరం అని పిలిచేది కేవలం మీరు సేకరించిన ఈ భూమిలోని కొంత మట్టే.

మీరు చనిపోయినప్పుడు, మళ్ళీ అదంతా మట్టి అయిపోతుంది. ఒకసారి ఆలోచించండి, మన కంటే ముందు ఈ గ్రహం మీద ఉన్న కోట్ల మంది మనుషులు ఏమయ్యారు? వారందరూ ఈ భూమి పై పొరలో కలిసి మట్టి అయ్యారు, మీరు కూడా అదే అవుతారు. మీ శరీరం కూడా ఒక రోజున అదే అవుతుంది, ఎవరైనా  మీ శరీరాన్ని మరీ లోతుగా పాతిపెట్టకపోతే తప్ప(నవ్వు). ఆశ్రమంలో మేము అదే చేస్తాం. మేము మిమ్మల్ని చాలా లోతుగా పాతిపెడతాం. ఎందుకంటే మీరు తిరిగి పైకి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టటం మాకు ఇష్టం లేదు(నవ్వు). మీరు మరణించిన తరువాత మీరు నిజంగా మరణించాలని, తిరిగి రావద్దని మా కోరిక(నవ్వు).

మీకు లోపలిది ఏమీ తెలియదు; మీకు లోపలిది ఇంకా తెలియాల్సి ఉంది. అందుకనే మీకు ఆనందం ఇంకా కలగటం లేదు. ఎందుకంటే ఆనందం అంతర్గతానికి సంబంధించినది. ఆనందం బయటది కాదు.

గతంలో మరణించిన అసంఖ్యాక వ్యక్తులు మట్టి పై పొర అయ్యారు. మీరు ‘నా శరీరం’ అని అనుకునేది మీరు సేకరించిన కుప్పే. మీరు ‘నా మనసు’ అని అనుకునేది మీరు సేకరించిన అభిప్రాయాల మూటే. ఇదంతా కూడా బయటి నుంచి మీరు సేకరించినదే. అసలు మీకు లోపలిది అంటే  ఏమిటో తెలుసా? మీకు లోపలిది ఏమీ తెలియదు; మీకు లోపలిది ఇంకా తెలియాల్సి ఉంది. అందుకనే మీకు ఆనందం ఇంకా కలగటం లేదు. ఎందుకంటే ఆనందం అంతరంగానికి సంబంధించినది. ఆనందం బయటది కాదు.

ఒక్కోసారి కొన్ని కొన్ని పరిస్ధితులు మీకు కావలసినట్లు జరిగితే, మీ లోపల ఉన్నది కొంత వ్యక్తీకరించబడుతుంది. అదీ ఒక ఆనంద సువాసన తమ్మెర మాత్రమే. మీకు అంతర్గతం గురించి తెలిస్తే, అది అంతులేని ఆనందం; ఒక చిన్న తమ్మెర కాదు. అది సువాసన కాదు, నిజమైనది. మీరు దానిలో మునిగిపోతారు.

మీరు అందులో మునిగిపోయిన తరువాత, బయటిదంతా మీకు ఒక ఆటే,  ఎలా కావాలంటే అలా ఆడతారు. అప్పుడు మీరు జీవితంతో ఎలా కావాలంటే అలా ఆడుకోవచ్చు, కానీ అది మీ మీద  ఎలాంటి  చిన్న గాయాన్ని కూడా వదలదు. ప్రస్తుతం మీ జీవితం మిమ్మల్ని పూర్తిగా గాయపరుస్తోంది. చాలా మంది,  20 ఏళ్ళు వచ్చేసరికి,  వారి జీవితంలో ఇక తిరిగి కోలుకోలేనంతగా గాయపడతున్నారు.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1