అసలు విధి అనేదేమైనా ఉందా?

విధి అంటే ఏమిటి? విధికీ, మన జీవితంలో జరిగే సంఘటనలు, అనుభవించే పరిస్థితులకు సంబంధం ఏమిటి ?ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి.
 

విధి అంటే ఏమిటి? విధికీ, మన జీవితంలో జరిగే సంఘటనలు, అనుభవించే పరిస్థితులకు సంబంధం ఏమిటి ?ఈ ప్రశ్నలకు సమాధానాలు  తెలుసుకోవాలంటే వ్యాసం చదవండి.


మీ జీవితంలో జరిగే సంఘటనలకు, మీరు అనుభవించే పరిస్థితులకు మూలం మీరే. ఇది నిజం! మనకు తెలియకుండా మనం సృష్టించుకున్న వాటన్నిటికీ మనం పెట్టుకున్న పేరు విధి. విధి మన మీద ఎక్కడి నుండో ఊడి పడటం లేదు, అది వేరెవరి చేతనో రాయబడలేదు. మీ గత చర్యలు, మీ మీద పడిన ముద్రలు - వీటన్నిటి ఫలితమే విధి!

మీ మీద ఎన్నో ముద్రలు పడివుండవచ్చు. మీ పంచేంద్రియాల ద్వారా  మీరు స్వీకరించిన ఈ ముద్రల సంక్లిష్ట సమ్మేళనం కాలక్రమంలో ఒక వైఖరిగా మార్పు చెందుతుంది. ఈ వైఖరి మిమ్మల్ని ఒక నిర్దేశిత మార్గంలోకి నెడుతుంది.

మార్గం మధ్యలో మీరు మరో మార్గంలో వెళ్ళాలనుకుంటే, అది మిమ్మల్ని వెళ్ళనివ్వదు, అది మిమ్మల్ని వేరే దారిలో తీసుకువెళ్తూనే ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే మీరు బస్సు ఎక్కిన తరువాత దారిలో మీకేదో ఆసక్తికరమైనది కనిపిస్తుంది. మీకు మీ మెడని బయటకి పెట్టి చూడాలనిపిస్తుంది. కానీ బస్సు వెళుతూనే ఉంటుంది. మీకు జరుగుతున్నది చూడాలని ఉంటుంది. కానీ మీరు అసహాయులు ఎందుకంటే బస్సు అక్కడి నుండి మిమ్మల్ని దూరంగా తీసుకెళ్ళిపోతోంది. బస్సు ఎక్కింది మీరే అన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా, మీరు అరచి  పెడబొబ్బలు  పెడతారు.

మీ గత చర్యలు, మీ మీద పడిన ముద్రలు - వీటన్నిటి ఫలితమే విధి!

మీరు దీన్ని నది మీద తేలుతూ వెళ్లడంతో పోల్చుకుంటే బహుశా బాగా అర్ధం చేసుకోవచ్చు.  నది మిమ్మల్ని అలా తీసుకువెళుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి తన దారిని వెతుక్కోవడానికి ఒక పద్ధతి లేదా వైఖరి ఉంటుంది. ఆ వైఖరి ప్రకారం అది వెళుతూ ఉంటుంది, ఈ వైఖరి ప్రత్యక్షంగా అప్పటికప్పుడు మీ ద్వారా సృష్టించబడలేదు. కానీ, ఈ వైఖరికి కారణమైన సమ్మేళనాలను సృష్టించిన వారు మీరే!

ఇదంతా  మీరు  మీకే  తెలియకుండా, అంటే ఏ మాత్రం స్పృహ లేకుండా సేకరించారు కాబట్టి, అది ఎక్కడి నుంచో వచ్చి మీ మీద పడుతున్నట్టనిపిస్తుంది. మీ ఉనికి ఎలాంటిదంటే మీ స్పృహలో లేదా ఎరుకలో లేనిదాన్ని మీరు అనుభూతి చెందలేరు. అంటే ప్రస్తుతం మీ స్పృహలో లేదా మీ ఎరుకలో లేనివన్నీమీ ప్రకారం ఈ ఉనికిలో లేనట్లే. అది ఎంత పెద్ద శక్తి అన్న దానితో సంబంధం ఉండదు. ఉదాహరణకి మీరు ఇక్కడ కూర్చున్నారు.  మీ వెనుక ఉన్న పెద్ద కొండ ఉందన్న విషయం మీకు తెలియదని అనుకుందాం. అంటే ఆ కొండ ఉందన్న విషయం మీకు తెలియనంత వరకు, ఆ కొండ మీ ప్రకారం ఈ ఉనికిలో లేనట్లే. మీ విధి కూడా అంతే! దానిని ఎప్పుడో ఒకప్పుడు మీరే సృష్టించుకున్నారు. కానీ, దానిని గ్రహించగలిగే ఎరుక(అవేర్‌నెస్) ప్రస్తుతానికి మీకు లేదు.

 ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1