కారణం ఎవరు?
మనకు ఒక సమయంలో ఎంతో అనందం కలిగించిన వారే మరో సమయంలో ఎంతో బాధ కలిగిస్తూ ఉంటారు. మరి మన ఆప్తుల పట్ల, మన చుట్టు ఉన్న వారి పట్ల మనకు అంచనాలు ఉండడం సబబేనా? మనకు ఒకప్పుడు ప్రేమ కలిగిన వారి పట్లే మరో సందర్భంలో కోపం, ద్వేషం ఎందుకు కలుగుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానలు ఈ వ్యాసంలో చదవండి.
 
 

మనకు ఒక సమయంలో ఎంతో అనందం కలిగించిన వారే మరో సమయంలో ఎంతో బాధ కలిగిస్తూ ఉంటారు. మరి మన ఆప్తుల పట్ల, మన చుట్టు ఉన్న వారి పట్ల మనకు అంచనాలు ఉండడం సబబేనా? మనకు ఒకప్పుడు ప్రేమ కలిగిన వారి పట్లే మరో సందర్భంలో  కోపం, ద్వేషం  ఎందుకు కలుగుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానలు ఈ వ్యాసంలో  చదవండి.


ఒకసారి, మీరెవరు లేదా మీరేమిటి అన్నదానికి మీరు ఇతరులని ఎవరినైనా కారణంగా భావిస్తే, ఆ వ్యక్తి మీకు తప్పకుండా పలు విధాలుగా ఆశాభంగం కలిగిస్తాడు.

మనం దీనిని ఇంతక ముందే చూశాం – ఏ వ్యక్తీ కూడా 100% మీకు కావలసిన విధంగా ఉండరు. మీ చుట్టూ ఉన్నవారి పట్ల మీ అంచనా ఎంత పెద్దదయితే, అంత ఎక్కువ ఆశాభంగం కలుగుతుంది. వాళ్ళు మీకు ఆశాభంగం కలిగించినప్పుడు లేదా మీరు అనుకున్న విధంగా పనులు కాకపోయినప్పుడు, దాని వల్ల కలిగే మీ బాధకి వారే కారణమని మీరు నిజంగా నమ్మితే, సహజంగానే కోపం వస్తుంది. ఒకసారి కోపం మొదలై క్రమంగా పెరిగిందంటే, అది ద్వేషం అవుతుంది. ద్వేషంతో పనిచేస్తే, అది హత్య అవుతుంది. మీరెవరు అన్నదానికి లేదా మీ జీవితంలో మీరు పొందే అనుభూతులకు ఇతరులు కారణమని మీరు అనుకున్న క్షణం నుండి ఈ ఆట మొదలవుతుంది. .

 

మీరెవరు అన్నదానికి లేదా మీ జీవితంలో మీరు పొందే అనుభూతులకు ఇతరులు కారణమని మీరు అనుకున్న క్షణం నుండి ఈ ఆట మొదలవుతుంది.

మొదట్లో ఈ ఆట బాగానే మొదలయ్యుంటుంది. 'ఓఁ..నేను మీవల్ల చాలా ఆనందంగా ఉన్నాను!’ అని మీరని ఉంటారు. కానీ, ఈ ఆట చెడిపోయి మీకు బాధ కలిగించడానికి ఎక్కువ సమయం పట్టదు. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే ఇవాళ కొన్ని పనులు చేసి మిమ్మల్ని సంతోషపెట్టాడో, ఆ వ్యక్తే రేపు అతనికి కావాల్సిన కొన్ని పనులు చేసి, మిమ్మల్ని బాధపెడతాడు. ఎందుకంటే మీ అంచనాలను ఏ వ్యక్తీ అందుకోలేరు. ఎవరూ కూడా అందుకోలేరు.

ఈ భూమ్మీద ఉన్న ఒక్క వ్యక్తి కూడా ఖచ్చితంగా మీరు ఎలా కావాలనుకుంటున్నారో అలా ప్రవర్తించరు. అయినప్పటికీ ఎవరైనా మీరనుకున్నట్లు ప్రవర్తించకపోతే, వారే మీ బాధకు కారణమని అనుకుంటారు. ఎప్పుడైతే మీ బాధకూ, వేదనకూ ఇంకొకరు కారణమని మీరు నమ్ముతారో, అప్పుడు సహజంగానే మీలో కోపం, ద్వేషం కలుగుతాయి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

"మీరు ప్రపంచానికి చేయగల మహోత్తర ఉపకారం మీరు ఆనందంగా ఉండటమే!" - సద్గురు.

 Photo Courtesy:  Friendship @flickr
 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1