ఆదియోగి వెనుక ఉన్న ఆంతర్యం ఏవిటి?

మానవ పరిణామంలో ఈ రోజు వరకు ఎంతోమంది మానవులు వారికై వారు ఆలోచించలేకపోయారు.
 

మానవ పరిణామంలో ఈ రోజు వరకు ఎంతోమంది మానవులు వారికై వారు ఆలోచించలేకపోయారు. ఈ రోజున ఎంతోమంది మానవులు వారికై వారు ఆలోచించుకుంటున్నారు. వీరు సరిగ్గా ఆలోచిస్తున్నారా…లేదా? అన్నది ఎప్పుడూ ఒక ప్రశ్నే. కాని ఒకసారి మానవుడు ఆలోచించడం మొదలుపెట్టిన తరువాత వారు వారి ఆలోచనలో కొంచెం అటు ఇటు అయినప్పటికి వారు ఆలోచిస్తున్నారు అంటే వారు తర్కాన్ని ఉపయోగిస్తున్నారన్న మాట. ఈ తరంలో ఏదైన సరే అది తార్కికంగా సరైనదైతే మాత్రమే వారు అంగీకరిస్తారు. ఈ తరంలో మీరు కొద్దిగా మీ తర్కాన్ని పక్కన పెడదాం అనుకున్నా గాని, మీ పిల్లలు అందుకు సిద్ధంగా ఉండరు. అది తార్కికంగా సరైనదై  ఉండాలి. అది శాస్త్రపరంగా పరిశోధించగలిగిందై  ఉండాలి కూడాను. ఈ రకమైన పరిస్థితి మానవసమూహాల్లో వచ్చిన తరువాత “ఆదియోగి” మనకు అవసరం.

ఆదియోగి పదిహేను వేల సంవత్సరాలకు పూర్వం వారు అయినప్పటికి, ఆయన భవిష్యత్తుకి చెందినవారు.

ఎందుకంటే ఆయనకు మీకు ఓ నమ్మకవ్యవస్థో, ఒక తత్వమో, మీరు ఆచరించవలసిందో నేర్పించలేదు. ఆయన కేవలం మీకు మానవులకు సంబంధించిన అంతర్ముఖ శాస్త్రాన్ని నేర్పించారు. ఈయన మీరు మీ శ్రేయస్సుకి, మీ ముక్తికి నూటపన్నెండు (112) విధానాలను అందించారు. మానవచరిత్రలో మొట్టమొదటి సారిగా ఆదియోగి మానవుల్లో ఎంతోమందికి సంబంధించినవారయ్యారు. లేకపోతే ఈయన చాల కొద్దిమందికి సంబంధించినవారే అయ్యుండేవారు. ఎందుకంటే అప్పట్లో సమాజం వారికై వారు ఆలోచించలేకపోయేది. కాని ఇప్పుడూ.. రాబోయే తరాల్లోనూ,  మానవులు వారికై వారు ఆలోచించుకుంటున్నారు. ఆదియోగి పదిహేను వేల సంవత్సరాలకు పూర్వం వారు అయినప్పటికి, ఆయన భవిష్యత్తుకి చెందినవారు. ఎందుకంటే మానవ శ్రేయస్సుని ఆయన శాస్త్రీయంగా ఎలా సాధించాలో మనకి నేర్పించారు.

ఆదియోగి శివుడిని పోలి ఎందుకు ఉంటాడు?

మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటంటే భారతదేశంలో ఒక్కే భగవంతుడు అన్న ఆలోచన ఎప్పుడూ లేదు. మనకి  భగవంతుడిని ఎలా సృష్టించాలి అన్న సాంకేతికత  తెలుసు. మనం వారిని దేవతలు అన్నాం, మూర్తులు అన్నాం. మూర్తి అంటే ఒక రూపం. మూర్తి అంటే భగవంతుడు కాదు, ఇది మన జీవితాన్ని పెంపొందించడానికి ఒక సాధనంగా ఉపయోగించాం. మీరు ఇప్పుడు కెమెరా తో వచ్చారు..అది ఒక సాధనం.... మీరు ఏం చేయలేరో అది కెమెరా చేయగలుగుతోంది. నేనేం చేయలేకపోతున్నానో అది మైక్రోఫోన్ చేయగలుగుతోంది. అలాగే మనం ఎన్నో సాధనాలను కనిపెట్టాం. మనం చేయగలిగిన పనులనే, మనం మరింత మెరుగుగా చేయగలిగేందుకు, మనం ఎన్నో సాధనాలను కనిపెట్టాం. అదేవిధంగా అంతర్ముఖంగా కూడా మనం కొన్ని సాధనాలను కనుక్కున్నాం. వాటిని మనం మూర్తులు  అన్నాం. ఇవి అంతర్ముఖ సాధనాలు. వీటిని ఒకవిధంగా మనం శక్తిమంతం చేసి, వాటిని  చేరుకునే మార్గాన్ని అందించాం. దీనిని మనం మంత్రమో, మరొకటో అని అంటున్నాం. అప్పుడు మిగతా వారు చేయలేని పనులు మీరు చేయగలుగుతున్నారు.

అందరూ ఏమనుకుంటారంటే శాస్త్రం అంటే అది పాశ్చాత్య దేశాల నుంచి  రావాలి అని. మన దేశంలోనిదైతే శాస్త్రం కాదేమో అని అనుకుంటున్నారు.

నేను ఇక్కడ ఉన్న కుర్చీలో ఒక స్క్రూ ని తీయమన్నాననుకోండి, మీ గోళ్లు పాడైపోతాయి కానీ ఆ స్క్రూ బయటకి రాదు.కాని ఒక స్క్రూ డ్రైవర్ ఉపయోగిస్తే అది ఎంతో తేలిక అవుతుంది. మనం మానవులుగా ఈ ప్రపంచం మీద ప్రగతి  సాధించడానికి కారణం మనం ఈ సాధనాలు ఎంతో బాగా ఉపయోగించగలాగడమే. ఈ సంస్కృతిలో మనం అంతర్ముఖ సాధనాలు కూడా కనుక్కున్నాం. అందరూ ఏమనుకుంటారంటే శాస్త్రం అంటే అది పాశ్చాత్య దేశాల నుంచి  రావాలి అని. మన దేశంలోనిదైతే శాస్త్రం కాదేమో అని అనుకుంటున్నారు. నేను మన దేశంలో జరిగిన ఉదాహరణే ఇస్తాను. రామానుజం గణిత శాస్త్రాన్ని ప్రభోదించారు. ఆయన వంద సంవత్సరాల క్రితం ఏం రాసారో దాన్ని ఇప్పుడు ఇంకా విశ్లేషిస్తున్నారు. “ఆయన 1910 లో ఏమి రాసారో, ఈ రోజున బ్లాక్ హోల్స్ గురించి చెబుతుంది అని చెబుతున్నారు”. కానీ అప్పట్లో బ్లాక్ హోల్స్ అన్న విషయమే తెలీదు. కానీ  ఆ రోజునే ఆయన గణిత శాస్త్రంలో దీన్ని స్పష్టంగా చెప్పారు. ఆయన్ని ఇది మీకు ఎలా తెలుస్తుంది అని అడిగినప్పుడు, నాకు దేవి చెబుతుంది అన్నారు, ఆయనకి దేవి  గణిత శాస్త్రాన్ని ప్రబోధిస్తుంది. ఆయనకి  దేవి ఒక ద్వారం లాంటిది.

ఇలానే మనం ఎన్నో సాధనాలు తయారుచేశాం. మనం ఇక్కడ భైరవి దేవిని సృష్టించాం. ఈవిడ మీరు చూడలేని ఎన్నో పార్శ్వాలకు మీకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. ఇలా మనం ఎన్నో మూర్తుల్ని సృష్టించాం. “ఆదియోగి మీకు ఒక స్ఫూర్తిని కలిగించేందుకు, మన శ్రేయస్సుకు ఉన్న సాంకేతికతను మీరు ఉపయోగించుకోవాలి అన్న విషయానికి మీకు స్ఫూర్తిని కలిగించడం కోసం ఆదియోగి”. మీరు ఈ రూపాన్ని మీ స్ఫూర్తి కోసం ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఉన్న యోగేశ్వర లింగం అందుకు సాధనం అవుతుంది. మీ శ్రేయస్సు అనేది మీ జీవితంలో ఏం పరిస్థితులు జరుగుతాయి అన్న దాని మీద ఆధారపడి ఉండదు. మీ పరిస్థితులను మీరు నిర్ణయించలేరు. కానీ మీ అంతర్ముఖం లో ఏం జరుగుతుందో మీరు నిర్ణయించుకోవాలి. ప్రపంచం మనకు ఏం అందిస్తుందో అది మన ఎంపిక కాదు, కానీ దానితో మనం ఏం సృష్టించుకుంటాం? అన్నది మన ఎంపికే. 112  అడుగుల విగ్రహం ఎందుకు? ఆయన 112 మార్గాలను మనకు అందించారు. దీని ద్వారా మీరు శ్రేయస్సుని, ముక్తిని పొందగలరు. అందుకని అందుకు గుర్తుగా 112 అడుగులు. ఈ రోజున ప్రపంచంలో ఉన్న అతి పెద్ద ముఖం ఇదే.

ప్రేమాశీస్సులతో,
సద్గురు