2019 మహాశివరాత్రికి పూర్తయిన సాధనపాద కార్యక్రమం

దాదాపు ఏడు నెలల తీవ్రసాధన అనంతరం మొదటి సాధనపాద కార్యక్రమమం మహాశివరాత్రినాటికి ముగిసింది. ఒకరి అంతర్గత ఎదుగుదలకు కాలాన్ని వెచ్చించే ప్రాధాన్యతను గురించి సద్గురు మాట్లాడారు, పాల్గొన్నవారు తమ అనుభవాలను పంచుకున్నారు.
 

ఈశా యోగా సెంటర్ లో 2018 గురుపూర్ణిమ రోజు మొదటి సాధనపాద కార్యక్రమంలో 200 మంది పాల్గొనగా 2019 మహాశివరాత్రి నాటికి పూర్తి అయ్యింది. పాల్గొన్నవారు యోగకేంద్రంలో పరివర్తనాత్మకమైన 7 నెలలు ఉంటూ తీవ్రసాధన షెడ్యూల్లో యోగసాధనలు, సేవ చేశారు.

పాల్గొన్నవారంతా చాలా రోజులుగా ఆశ్చర్యపడుతూ ఎదురుచూసి సద్గురుతో సెషన్లో నవ్వులు, ఆనందబాష్పాలు నింపుకుని గడిపారు.

సద్గురు: మీరంతా చాలా అద్భుతంగా ఈ సాధనపాద చేశారు. నేను ఎంతగానో అభినందిస్తున్నాను. యువకులు తాము ఉండకూడని ఎన్నో చోట్లలో చేరి చేయకూడని పనులని చేసే ఈ సమయంలో, అదే వయసులో ఉన్న మీలాంటి వాళ్ళని ఎంతో మందిని ఇక్కడ చూడటం అద్భుతంగా ఉంది. నేను ఎదిగే వయసులో నా చుట్టూఉన్న ప్రతిఒక్కరు విభిన్నమైన విషయాలలో ఉండేవారు. నేనొక్కడినే అసహజంగా నాలోనేనుగా ఏదయినా చేయాలనుకునేవాడిని. ప్రతివారు ఇతరులతో మాత్ర్హమే ఎదో చేయాలనుకుంటారు. అందువలన మీ అందరినీ ఇక్కడ ఈ విధంగా చూడటం అద్భుతంగాఉంది.

మీరు కేవలం మానవత్వంతో ఉంటే, నేను మీ జీవితంలో ప్రతిక్షణం ఉంటాను - కానీ మీరు దానిని తప్పక ఉంచుకోవాలి. ఇతర జీవులన్నీ వాటి ప్రవృత్తులతో బతకటానికి వస్తాయి. వాటిలో ప్రతి ఒకటికి, వాటి సొంత దారి ఉంటుంది , ఎప్పుడూ వాటి ప్రవృత్తులనుబట్టి వాటి హద్దులను ఏర్పాటు చేసుకుంటాయి. మానవుడు అంటే, అతను లేదా ఆమె ఉద్దేశపూర్వకంగా వాళ్ళ సరిహద్దులను చెరుపుకోగలరు - వాళ్ళు హద్దులు లేకుండా జీవించగలరు. భౌతిక కారణాల వల్ల, ప్రాపంచిక స్వభావంవల్ల మనం జీవిస్తున్నా, మనం ఒక కంచె వేసుకోవచ్చు . కానీ మన హృదయాలలో హద్దులు లేవు.

అందువల్ల, దయచేసి ఇది మీకోసం ఎలా చేసుకోవాలో చూడండి. సాధనపాద కాలం అయిపోయిందంటే, కేవలం ఇది అయిపోయిందని అర్ధం కాదు. జీవితం ఒక సాధన ... సాధన అంటే ఒక సాధనం. ఈ శరీరం, మనస్సు ఇంకా శక్తీ ఇవే మన సాధనాలు, ఇవే మనకున్న నిజమైన సాధనాలు. ఇవి సమర్ధవంతంగా , పదునుగా లేకపోతే, అప్పుడు జీవితం మామూలుగా ఉంటుంది. మీకు డబ్బు, సంపద, ఇంకా చాలా విషయాలుండవచ్చు, కానీ ఈ జీవితం ఒక ఉత్తమ విధానంలో లేకపోతే, అప్పుడు ఆ విషయాలన్నీ కేవలం ఒక విసుగు మాత్రమే! సాధన అంటే ఇదే-మీరు మీ శరీరం, మనస్సు, ఇంకా బలాన్ని శక్తివంతమైన ఉపకరణాలుగా చేసుకోవాలి. అందువలన సాధనాలను వాడటం మనం నేర్చుకోవాలి. ఈ సాధనాలను వాడటం నేర్చుకుంటే, సహజంగానే మీరు మీ హద్దులను చెరిపేస్తారు. శక్తివంతమైన సాధనాలతో హద్దులు లేకుండా ఉంటే, ఈ భూమి మీద మీరు అద్భుతమైన శక్తిగా మారుతారు. అదే మనం చూడాలనుకుంటున్నది. మనం అది జరిగేలా చూద్దాం.

మొట్టమొదటి సాధనపాద ముగిసిన తరుణంలో, అందులో పాల్గొన్నవారి ప్రయాణాన్ని పరిశీలిద్దాం, గత కొద్ది నెలల గురించి విశ్లేషిద్దాం ఎందుకంటే వారు మహాశివరాత్రి, సంయమ కోసం సిద్ధం అయ్యారు కాబట్టి.

కైవల్యపాదలోకి అడుగు పెట్టె తరుణంలో, ఇందులో పాల్గొన్నవారు గడిచిన ఏడు నెలలు ఆనందప్రదమైన జీవితానికి బలమైన పునాది ఎలా రూపొందిందో అనే అంశం గురించి ప్రతిస్పందిస్తారు. ఈశాలో 25వ మహాశివరాత్రి ఉత్సవాల కోసం ప్రతిఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, చాలామంది ఈ కార్యక్రమం వీలైనంత ఉత్తమరీతిలో జరపటానికి చురుకుగా నిమగ్నమై ఉన్నారు.

సంకేత్ - మహాశివరాత్రి సమన్వయ బృందం

బలమైన కార్యాచరణ, సంపూర్ణ నిశ్చలత్వం! సాధనపాదలో ఉన్నప్పుడు ఈ రెండు అంశాలను అనుభవించటం నా కల. నన్ను నేను ఆ దిశలో ప్రయాణించటం గురించి చాల సంతోషిస్తున్నాను. ప్రత్యేకించి మహాశివత్రి సేవలో, గత కొన్ని వారాలుగా సంప్రదాయయోగ వర్కుషాప్ లో పాల్గొన్నవారిని తెలుసుకుని, అర్ధంచేసుకుని, సహకరించటం నాకు ఒక అద్భుతమైన అనుభవం.

స్టీవెన్, జెర్మనీ - నేను సాధనపాదలో ఎందుకు చేరానంటే..

ఇతరులు ప్రతి ఒక్కరు చేస్తున్నారు కాబట్టి నేను కేవలం ఏదో ఒకటి చేయాలనుకోలేదు. అందుకని నేను నిజమైన మార్పునిచ్చే ఒకదానిని చేయాలనుకుకున్నాను ... ఇంకా సాధనపాద ద్వారా , ఇక్కడ ఉండటానికి వాళ్ళు స్థలం ఇస్తున్నారు ... ఇంకా తిండి గురించి, కిరాణా వస్తువుల గురించి , దేనిగురించి కూడా బాధపడవలసిన పనిలేదు. మీరు కేవలం ఇక్కడ ఉండండి, వాలంటీర్ చేయండి, ఆనందించండి.

అనిరుద్, రష్యా : కృతజ్ఞతకి అర్ధం నేర్చుకోవటం

రష్యా నుండి దక్షిణ యాత్ర పర్యటనకు వస్తున్న పెద్ద బృందానికి తోడుగా ఉండటం నా సేవలో భాగం. ఈ ప్రయాణంలో వాళ్ళతో ఉండటం నాకెంతో ఆనందాన్నిచ్చింది, ఎందుకంటే నేను నిజంగా తిండి లేదా నిద్ర గురించి బాధపడను ..ఎప్పుడూ వాళ్ళ అనుభవాలను మెరుగు పరచటానికి నేను ఏమి చేయగలననేదే నా ఆలోచన. ఇందులో భాగస్వామినవటానికి అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా కృతజ్ఞుడిని. నేను నాతో వెనక్కి తీసుకువెళ్లేది ఏదయినా ఉందంటే, అది కృతజ్ఞత అనే పదానికి అర్ధం

పాలీనా, మెక్సికో : వేడుక ఇంకా పాత మార్గాలు వదలటం

నేను భారతీయ సంస్కృతికి చాలా అభిమానిని .. ఎంతంటే నా గతజన్మలో నేను భారతీయుడినని నా నమ్మకం ! భారతదేశంలో ఒక దేశంగా, ఒక జాతిగా ప్రజలు చాలా విధాలుగా జీవితాన్ని ఉత్సవంగా జరుపుకుంటారు – పనిముట్లకు, ప్రతి ఒక ఋతువుకు , ప్రతిఒక్క దేవునికి, ప్రతి ఒక్క జంతువుకు, చెట్లకు, ప్రతి ఒక్కదానికి!

సాధనపాద అంటే నా దృష్టిలో విముక్తి- పాత మార్గాలనుండి విముక్తి. ఇంతకుముందు ఎప్పుడూ నాకు ఒత్తిడి లేదా కోపం లేదా చింత ఉండేవి- నిరంతరం ప్రతిదానిని గురించి నాకు చింతగా ఉండేది. ఎప్పుడు చింతిస్తూ ఉండే ఆ పరిస్థితి నుండి సాధనపాద నన్ను విముక్తం చేసింది.

నోరా, జర్మనీ /ఐర్లాండ్ : నిరాశ నుండి ఆనందందాకా

నేను వివిధ ఉద్యోగాలు చేసేవాడిని, వివిధ దేశాలలో ఉండేవాడిని. అందువలన ఎప్పుడు అవిశ్రాన్తంగా ఉండేవాడిని. ఇంతకుముందు నేను కనీసం తెలుసుకోలేకపోయిన చాలా పెద్ద విషయాలలో నేను ఎంత ఒత్తిడితో ఉన్నానో అనేది కూడా ఉంది. అందువలన ఈ ఏడూ నెలల సాధనపాద నిజంగా నాకు ఒక విస్ఫోటనం ... ఇంకా ఇక్కడ నేను పొందిన ఆనందం, స్పష్టత , సమతుల్యత నిజంగా నమ్మశక్యంకానివి.

2018 సాధనపాదలో పాల్గొన్నవారికి తర్వాత ఏమిటి

ఇక్కడ ఉన్నతమ సమయంలో స్ప్హూర్తి పొందినవారు సాధనపాదకాలంలోని అనుభవాలను బలపరచుకొని కొనసాగించటానికి సద్గురు కలని నెరవేర్చటంలో సహాయం చేయటానికి ఆశ్రమంలో పూర్తిస్థాయి స్వచ్చంద సేవకులుగా ఉండిపోతారు. ఇతరులు ఆశ్రమ కార్యక్రమాలకు దూరంలో ఉన్నా తమ వంతు సహకారం అందిస్తారు లేదా 2019 సాధనపాద కార్యక్రమానికి మద్దతు నివ్వటానికి మళ్ళీ వస్తామని సూచించారు.

2019 సాధనపాదకు రెజిస్ట్రేషన్స్ మొదలైనాయి!

ఈ సంవత్సరం ఇంకా ఎక్కువమంది ప్రజలకు ఈ అవకాశం కలగాలని సద్గురు ఇంకా పెద్ద ఎత్తున సాధనపాదని అందిస్తున్నారు. ఈ కార్యక్రమం జులై 2019 గురుపూర్ణిమ రోజు మొదలై ఫిబ్రవరి 2020 మహాశివరాత్రి నాడు ముగుస్తుంది.

మరింత సమాచారం కోసం: +91-83000 98777

ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి