ఈ వారం సద్గురు, దేశంలో ఇపుడు అందరినోటా వినిపించే 500, 1000 నోట్ల పెద్దనోట్ల ఉపసంహరణ సమస్య గురించి విశదీకరిస్తారు. మనం ఇంకా స్వాతంత్రం రాకపూర్వం ఉన్న మానసిక స్థితిలోనే ఉన్నాం, ఆ మానసిక స్థితినుండి బయటపడి, ఈ దేశపౌరులుగా దేశాన్ని ముందుకి నడిపించడానికి తమవంతు సహకారం అందిస్తూ, అందరూ చైతన్యవంతమైన పాత్ర పోషించాలని సద్గురు పిలుపునిస్తున్నారు. "మన దేశ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పుష్పించాలంటే మానం తాత్కాలికమైన ఈ ఇబ్బందిని సహించాలి," అంటారు. ఇక్కడ జతచేసిన స్లైడ్ షోలో, ఈ నెల 24 నుండి 27 వరకు ఈశా యోగా కేంద్రంలో జరిగిన "ఇన్సైట్" అన్నకార్యక్రమం వివరాలు చూడగలరు.