సద్గురు మనకు రాముడి జీవితంలో జరిగిన అందమైన సంఘటన గురించి చెబుతున్నారు, పది తలల రావణుడిని వధించిన తరువాత శ్రీరాముడు తపస్సు చేస్తానని చెబుతాడు, ఎందుకంటే రావణుడి పది తలలో ఒకటి మాత్రం భక్తి, జ్ఞానంతో నిండి ఉన్నాయి, అయినా సరే దానిని ఖండించవలసి వచ్చింది అని.
అలాగే మనందరికీ పది, అంతకంటే ఎక్కువే తలలను ఒక్కో సమయంలో చూపిస్తూ ఉంటామని, అయినా సరే ప్రతీ వ్యక్తిలో ప్రేమ, అందం ఇంకా కారుణ్యంతో నిండిన ఒక తల ఉంటుందని సద్గురు చెబుతున్నారు. ఆ ఒక్క తలను గుర్తించడం ముఖ్యమని, ఎలాగైతే ముళ్ళ మధ్యలోని రోజా పువ్వుని గుర్తిస్తామో అలానే ప్రతీ వ్యక్తిలో ఈ లక్షణాన్ని గుర్తించాలని సద్గురు చెబుతున్నారు. #SriRamaNavami