యోగ శాస్త్రంలో, స్థిరమైన చిత్తాన్ని ఒక ‘కల్పవృక్షం’గా ప్రస్తావిస్తుంటారు. అంటే కోరికలన్నీ తీర్చగల చెట్టు (wishing tree). మీరు మీ శరీరాన్ని , మనసునూ, భావోద్రేకాలనూ, జీవ శక్తినీ ఒక క్రమమైన మార్గంలో వ్యవస్థీకరించుకోగలిగితే, మీ సృజనాత్మక శక్తీ, మీ కోరికలను మీరే సిద్ధింపజేసుకోగల శక్తీ అసాధారణ స్థాయిని చేరుకొంటాయి, అంటున్నారు సద్గురు.