పియంఎస్ వల్ల వచ్చే ఇబ్బందులకు యోగ పరిష్కారం

ఆడవారు తమ రుతుక్రమంలో వచ్చే భావోద్వేగాలలో (PMS - Premenstrual syndrome) మార్పులు చోటు చేసుకోవడానికి గల ప్రాథమిక కారణం ఏంటో సద్గురు వివరిస్తున్నారు
Yogic Relief for PMS Mood Swings
 

ప్రశ్న: నేను రుతుస్రావానికి ముందు చాలా భావోద్వేగాల కల్లోలానికి గురవుతున్నాను. దీనికి సహాయపడే ఏదైనా యోగ పరిష్కారం ఉందా? సద్గురు: రుతుక్రమం, ఏదైతే శరీరానికి సంభందించిందో, అది దురదృష్టవశాత్తు ఆడవారిలో మానసిక ఇబ్బందులకూ దారి తీస్తుంది, ఎందుకంటే, మీలో ఉన్న ఈ రెండు అంశాల మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే. దీనికి కొంత మూలకాలకు సంబంధించిన అంశం కూడా ఉంటుంది. శరీరం లోని అత్యంత ప్రాథమిక జ్యమితిని రూపొందించే పంచభూతాలు కూడా సమన్వయంలో ఉండాలి. భూత శుద్ధి అనే ప్రక్రియ ఈ సమస్యల నుండి ఉపసమనం కలిగించగలదు. ఎందుకంటే, ఈ ప్రక్రియ మీ వ్యవస్థ లోని పంచభూతాలను ఓ అమరికలో ఉంచుతుంది . అందులో అద్భుతమేమి లేదు.

విచిత్రమైన విషయం ఏంటంటే, చాలా మంది మహిళలు ఒక సాధారణమైన జీవ ప్రక్రియను ఏదో అసహ్యకరమైనదిగా భావిస్తున్నారు - వారి సొంత వ్యవస్థతో సమన్వయంలో ఎలా ఉండాలో వారికి ఎవరూ నేర్పలేదు. శారీరక ప్రక్రియల ఫలితంగా మానసిక ఇబ్బందులు కలుగుతున్నాయంటే, మీలో ఉన్న వివిధఅంశాలలో పొంతన లేదని అర్ధమే. ఋతుచక్రాలు శారీరకంగా కొంత నొప్పిని కలిగించవచ్చు, దానికి వైద్య సహాయం పొందచ్చు. కానీ అవి మానసిక ఇబ్బందులను కలిగించకూడదు. భూతశుద్ధి సాధన చేయడం వల్ల పూర్తి ఉపశమనం లభిస్తుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు

 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1