‘లేనిది ఏదో’ దాని రుచి చూపేది సమాధి!

మనం అన్ని లౌకిక పరిమితులకూ అతీతమై, ‘లేనిది ఏదో’ దాన్ని రుచి చూడటమే 'సమాధి' అంటున్నారు సద్గురు.
Sadhguru Wisdom Article | Samadhi – The Ultimate Transcendence
 

సద్గురు: అస్తిత్వం ఎలా చేయబడిందంటే, ‘ఏదైతే ఉన్నదో ’ ఇంకా ‘ఏదైతే లేదో ’ – ఆ రెండిటితోను. ‘ఏది ఉన్నదో దాని' కి రూపమూ ఆకారమూ, గుణాలూ, సౌందర్యం - ఇవన్నీ ఉంటాయి. ‘ఏది లేదో దాని' కి ఇవేవీ ఉండవు, కానీ అది స్వేచ్ఛ కలిగింది.

అప్పుడప్పుడూ ‘ఏది లేదో అది’, ‘ఏది ఉన్నదో దాని' లో నుంచి తోసుకొని ఉబికి వస్తుంది. దాంతో, ‘ఏది ఉన్నదో అది’ మరింత ఉన్నత స్థాయి చేతనత్వాన్ని (consciousness) పొంది, తను కూడా ‘ఏది లేదో దాని' లాగా అయిపోవాలి అని తపించటం ఆరంభిస్తుంది. ‘ఏది ఉన్నదో దాని’ కి ఉండే రూపమూ, గుణాలూ, లక్షణాలూ, సౌందర్యం - వీటన్నిటిని ఒకరు అశ్వాదిస్తున్నపటికీ, ఇలాంటి వేవీ స్పృశించని, సంపూర్ణ స్వేచ్ఛామయమైన స్థితి కోసం తపన కలగటం తప్పనిసరి. కలంతో ఈ తపన కలగక మానదు, అసలు ఈ ‘కాలమూ’, ‘దేశమూ’ అనే బంధాలకు బానిసగా ఉండటం, ‘ఏది ఉన్నదో దాని' కి మాత్రమే ఉండే ఒక భ్రాంతి. ‘ఏది లేదో దాని' కి, దేశ కాలాలతో నిమిత్తం లేదు, ఎందుకంటే అపరిమితమైనది, అనంతమైనది, అంతేకానీ దేశకాలాల పరిమితుల సంకెళ్ళకు బంధీ అయినది కాదు.

అస్తిత్వం యొక్క మూల ప్రక్రియ నుంచి విముక్తి చెందాలనే ఈ తపన కలిగినప్పుడు, మన బుద్ధి (mind) కీ, ఇంకా మనలో ఉన్న భయ స్వభావం అనే భావోద్వేగానికీ, అది కేవలం ఆత్మ వినాశనమే ( self-annihilation) - అనిపిస్తుంది. తర్కించే మనసుకు, ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, కోరి కోరి చేసుకుంటున్న ఆత్మహత్యతో సమానంగా కనిపిస్తుంది. నిజానికి ఇది ఆత్మహత్య కాదు, అంతకంటే ఎక్కువే! మనల్ని అంతం చేసుకునేందుకు ఉన్న అత్యధమమైన మార్గం ఆత్మహత్య. అత్యధమం అంటున్నది ఎందుకంటే, ఆ ప్రయత్నంలో అపజయం ఖాయం. అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వదు.

అనుకున్న ఆ ఫలితాన్ని సాధించగలిగిన పద్ధతులెరిగిన నిపుణులు, ఈ సంస్కృతిలో ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రక్రియలు ఆ పద్ధతులే!

‘సమాధి’ అంటే ఏమిటి?

భారత దేశంలో, సామాన్య లోక వ్యవహారంలో, ‘సమాధి’ అంటే, చనిపోయిన వారి స్మృత్యర్థం నిర్మించిన గోరీ. ఎవరిదయినా మృత శరీరాన్ని ఒక చోట పాతిపెట్టినప్పుడు, అలా ఖననం చేసిన ప్రదేశం మీద స్మారక చిహ్నం లాంటి కట్టడమేదయినా కడితే, దాన్ని ‘సమాధి’ అని చెప్పుకుంటారు.

కానీ ‘సమాధి’ అనే మాటకు మరో అర్థం కూడా ఉంది. మానవుడిలో ఉన్న చైతన్య శక్తి చేరగల అత్యున్నతమైన స్థితిని కూడా ‘సమాధి’ అంటారు. ఎవరయినా చనిపోతే వారిని ఖననం చేసిన ప్రదేశాన్ని, వారి పేరుతో పిలవటం ఆనవాయితీ. కానీ, ఎవరైనా ఒక ప్రదేశంలో పైన చెప్పిన అత్యున్నతమైన చైతన్య స్థితిని అందుకోగలిగితే, వాళ్ళనే ఆ ప్రదేశం పేరుతో పిలవటం జరుగుతుంది. అందుకే, మీరు గమనించి ఉంటారు, యోగులను కొన్ని ప్రదేశాల పేర్లతో ప్రస్తావిస్తూ ఉంటారు. ‘పళని స్వామి’ వారికి ఆ పేరు అలాగే వచ్చింది. ఆయన సమాధి స్థితి అనుభవాన్ని పొందింది పళని అనే ఊళ్ళో. ఆయనను అందరూ పళని స్వామి అనే అనేవారు. ఆయన తనను తాను ఎప్పుడూ, ఏ పేరుతోనూ ఎవరికీ పరిచయం చేసుకోలేదు ఎందుకంటే ఆయన పేరుతో గుర్తింపు పెట్టుకోలేదు . ఆయన పళనిలో ఆత్మజ్ఞానం పొందారు కనుక ప్రజలు ఆయనను ‘పళని స్వామి’ అన్నారు. ఎందరో యోగులుకు సాధువులకు ఇలాంటి పేర్లే ఉన్నాయి.

సమాధి అన్న మాట ‘సమ’, ‘ధీ’ అన్న రెండు పదాలు కలవగా ఏర్పడింది. ‘సమ’ అంటే సమ స్థితి, ‘ధీ’ అంటే బుద్ధి (intellect). సమ స్థితిలో మీ బుద్ధి ఉన్న స్థితికి మీరు చేరుకుంటే, అది ‘సమాధి’. మీ బుద్ధి పని చేస్తూన్నప్పుడు, మీరు ఒక విషయానికి మరో విషయానికీ మధ్య విచక్షణ కలిగి ఉంటారు. . ‘ఇది ఒక విధమైన విషయమూ, అది మరొక విధమైనదీ’ అన్న విచక్షణ బుద్ధి పని చేయడం వల్లనే సాధ్యం అవుతోంది. మీరు మీ బుద్ధిని అధిగమించినక్షణమే మీ విచక్షణ, ఉండదు. అంతా ఒక్కటిగా ఉంటుంది – నిజానకి అది ఉన్నది ఇలానే. ఈ స్థితిలో దేశ కాల లు ఉండవు.

ఎవరో ఓ మూడు రోజులపాటు సమాధిస్థితిలోనే ఉండిపోయారని మీకు అనిపించవచ్చు, కానీ వారికి అది కొద్ది క్షణాలే - సమయం ఇట్టే గడిచి పోతుంది.

‘ఏది ఉన్నదో అదీ’, ‘ఏది లేదో అదీ’ అనే ద్వైత్వానికి అతీతుడైయ్యాడు. ఆయన సరిహద్దుల్నిదాటి , ‘ఏది లేదో ‘ దేనికైతే రూపమూ, ఆకారమూ, గుణాలూ, లక్షణాలూ ఏవీ లేవో, - శూన్యం – దానిని అయన - చవి చూశాడు

ఈ అస్తిత్వం , సృష్టిలోని అనేక రూపాలు ఉండేది, ‘బుద్ధి’ (intellect) అనేది ఉన్నంత సేపే. మీరు మీ బుద్ధిని లయం చేసిన క్షణమే, అంతా ఒక్కటిగా లీనమైపోతుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు