యక్ష- సంగీత, నాట్యాల దివ్యోత్సవం!
మన దేశపు వివిధ కళారూపాల ప్రత్యేకతను, స్వచ్ఛతను, వైవిధ్యాన్ని కాపాడి, ప్రోత్సహించే ప్రయత్నంలో ఈశా ఫౌండేషన్ ప్రతియేటా 7 రోజుల భారతీయ శాస్త్రీయ సంగీత, నృత్య ఉత్సవాన్ని 'యక్ష' అనే పేరుతో వెళ్ళంగిరి పర్వత పాదాల వద్ద ఉన్న లింగభైరని ఆలయం ముందు నిర్వహిస్తుంది.
 
 
యక్ష 2015
 సంగీత, నాట్యాల దివ్యోత్సవం  

ఫిబ్రవరి 10-16, 6:30pm – 8:30pm IST

 

 సుసంపన్నం, వైవిధ్యం అయిన సంస్కృతే భారత దేశపు సమైక్యతకు ఆధారభూతం. వేల సంవత్సరాలుగా వికసించిన భారత దేశపు వివిధ కళా రూపాలు ఈ దేశపు విభిన్న సంస్కృతిని ప్రతిబింబించటమే కాకుండా, ఆధ్యాత్మిక స్ఫూర్తికి మూలంగా కూడా ఉన్నాయి. వేల సంవత్సరాలుగా ఈ దేశాన్నిసుసంపన్నం చేసిన ఈ కళలు, మన జీవితాలలో నుండి అత్యంత వేగంగా కనుమరుగై పోతున్నాయి.

మన దేశపు వివిధ కళారూపాల ప్రత్యేకతను, స్వచ్ఛతను, వైవిధ్యాన్ని కాపాడి, ప్రోత్సహించే ప్రయత్నంలో ఈశా ఫౌండేషన్ ప్రతియేటా 7 రోజుల భారతీయ శాస్త్రీయ సంగీత, నృత్య ఉత్సవాన్ని 'యక్ష'  అనే పేరుతో వెళ్ళంగిరి పర్వత పాదాల వద్ద ఉన్న లింగభైరని ఆలయం ముందు నిర్వహిస్తుంది. ‘యక్ష’ అన్న పేరుకుభారత పురాణాలలోని దివ్య యక్షులే స్ఫూర్తి. ఉద్దండ పండితులు, యువ కళాకారులు ప్రదర్శించడానికి, కళా పిపాసులు చూసి ఆ ప్రదర్శనలును చూసి ప్రశంసించటానికి 'యక్ష' కార్యక్రమం ఒక ఉమ్మడి వేదికను అందిస్తుంది. ఈ కళాత్మక ప్రదర్శనలలోని సున్నితత్వం, వైభవం భారత దేశపు పురాతన సంస్కృతి యొక్క లోతుని, గాంభీరతనూ బయటకు తీసి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ కళారూపాల అందాన్ని అనుభవించే అవకాశాన్ని అందిస్తాయి.

 యక్ష దివ్యోత్సవం  

ఫిబ్రవరి 10వ తారీఖున ప్రారంభమై, 7 రోజులు కొనసాగి, ఫిబ్రవరి 16న ముగుస్తుంది. ప్రతీ రాత్రి  భారత దేశపు ప్రఖ్యాత కళాకారుల ప్రదర్శనలు ఉంటాయి. అందమైన, శక్తివంతమైన ధ్యానలింగ కాంప్లెక్స్ ఆవరణలో  నిర్వహించబడే ఈ ఉత్సవంలో, ఈ సంవత్సరం కర్ణాటక- హిందుస్తానీ సంగీతాలు, భరతనాట్యం, వీనులవిందైన సరోద్, సితార్, వయోలిన్ వాయిద్య సంగీతాలు ఉంటాయి.

యక్ష 2015 ప్రదర్శకులు 
గీతా చంద్రన్

గీతా చంద్రన్ తన గురువుల నుండి అందుకున్న జ్ఞానానికి, భరతనాట్యం పట్ల తనకున్న తన సొంత దృక్కోణాన్ని  జోడించి ప్రదర్శనలు ఇస్తారు. తన ప్రదర్శనలలో ఎంతో నేర్పుతో అందం, ఆనందం, అధ్యాత్మికతలను చేర్చిన ఆమె, నేటి శాస్త్రీయ నృత్యకారులలో ప్రముఖమైన వారిగా గుర్తించబడుతున్నారు.

 పండిత్ తేజేంద్రనారాయణ్ మజుందార్

ఈ తరానికి చెందిన ప్రఖ్యాత సరూద్ వాద్యకారులుగా పేరుగాంచిన పండిత్ తేజేంద్ర  మాటలలో చెప్పనలవికాని సాంకేతిక ప్రావీణ్యాన్ని తన అసాధారణ  స్వరం, శ్రావ్యతలతో మిళితం చేస్తారు.

T. V. శంకర నారాయణన్

ఎంతో అభిలాష, ఉత్సాహం గల T. V. శంకర నారాయణన్పద ప్రయోగాలు, స్వర ప్రస్తారాలతో తమదైన శైలిలో అలవోకగా పాడి వినిపిస్తారు. సంగీతపు అత్యుత్తమ లోతులను శోధించే సహజ ప్రవృత్తి, కళలో అత్యుత్త ప్రతిభను బయటకు తీసుకరావాలనే కాంక్ష గల వీరు ఒక అతిశయ సంగీతానికి ఉదాహరణ.

 పండితులు రాజన్ & సజన్ మిశ్రా

పండితులు రాజన్ & సజన్ మిశ్రా, నేడు శాస్త్రీయ సంగీతంఅందిస్తున్న అత్యుత్తమ జంట గాయకులు. పండితులు రాజన్ & సాజన్ మిశ్రా వారి నైపుణ్యం, సృజనాత్మకతలతో, జుగల్బందీ సంగీతాన్ని అలవోకగా సరికొత్త స్ధాయిలకు తీసువెళతారు.

ఉస్తాద్ సయీదుద్దీన్ డాగర్

ప్రసిద్ధి చెందినద్రుపద గాయకులుఉస్తాద్ సయీదుద్దీన్  ప్రఖ్యాతి గాంచిన డాగర్ వంశం నుండి వస్తున్నారు. అతి ప్రాచీన హిందుస్తానీ శాస్త్రీయ సంగీతానికి స్తంభాలుగా నిలిచినడాగర్ వంశం ద్రుపద సాంప్రదాయాన్ని సజీవంగా ఉంచడంలో పేరుగాంచింది.

శ్రీ గణేష్ & శ్రీ కుమరేశ్

ఆధునిక సమకాలీన కళాకారులలో “శాస్త్రీయ’’ సంగీతానికి ఏంతో సేవ చేసిన వారిగా ఈ సోదరులు పేరు పొందారు. నాలుగు దశాబ్దాలకు పైగా కచేరీలు చేసిన చరిత్ర గల వీరు అన్ని సంగీతాలను వాయించగల సామర్ధ్యాన్ని సాధించారు. అది వారి సంగీతానికి మనం అరుదుగా చూసే విశ్వ వ్యాప్త ఆదరణను అందించింది.

విదూషిమణి బాంబే జయశ్రీ

ధ్యానపరమైన సంగీతం, అరుదైన కవిత్వం మీద విదూషిమణి బాంబే జయశ్రీకి ఉన్న ప్రావీణ్యత అనేక ఆల్బంలకు, ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని ప్రత్యక్ష ప్రదర్శనలకు,తద్వారా లెక్కలేనంతమంది కర్ణాటక సంగీత ప్రేమికుల మన్ననలకు దారితీసింది. శాస్త్రీయ సంగీత రచనలను చేయడమే కాకుండా, బాంబే జయశ్రీ గారు  నృత్య నాటకాలు, డాక్యుమెంటరీల కోసం సంగీతాన్ని కూడా సమకూర్చారు.

భారత దేశంలోని అత్యంత ముఖ్యమైన పవిత్ర రాత్రులలో ఒకటి అయిన  మహాశివరాత్రి పండుగనాడు  (ఫిబ్రవరి 17న) నాటి జాగరణ వేడుకలతో ఈ 'యక్ష'దివ్యోత్సవం ముగుస్తుంది.

'యక్ష-2015'లోమాతో పాటు పాలుపంచుకోండి

ఈశా యోగా కేంద్రం , భారత దేశం

ప్రవేశం ఉచితం. అందరూ ఆహ్వానితులే.

6:50 pm – 8:30 pm (6:40 pm కల్లా సీట్లలో కూర్చోండి)

మరింత సమాచారం కొరకు సంప్రదించండి: ph: 083000 83000
లేదా Email:info@yaksha.info

లేదా 

ఆన్ లైన్‌లో చూడలంటే http://mahashivarathri.org/yaksha-2015-live-webstream/

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1