కావాల్సిన పదార్థాలు:

తులసి రెమ్మలు    -    4

పుదీనా   -    4

నీరు      -    200 మి.లీ.

తేనె లేక బెల్లం కోరు లేక కరపట్టి (నల్లబెల్లం) - రుచికి తగినంత

చేసే విధానం:

తులసి, పుదీనా తాజాగా దొరికితే మంచిది. అది నీటిలో వేసి బాగాసారం దిగేదాకా మరిగించాలి. వడకట్టి తేనె లేక బెల్లంకోరు, కరపట్టి కలుపుకుని తాగాలి. (ఎండలో తులసి, పుదీనా సమంగా తూకం వేసి తీసుకుని ఎండపెట్టి పొడి చేసుకోవాలి. తాజాది దొరకని టైములో ఇది అరస్పూను వేసుకోవాలి). -  తులసిలో ఐరన్‌, క్యాల్షియం రెండూ ఉంటాయి. చలి, ఆస్తమా ఉన్నవారికి మంచిది.

చదవండి: మానసిక అస్వస్థతకు కారణాలేంటి??