మీ ఆరోగ్యంపై టీ,కాఫీ ల ప్రభావం ఉంటుందా ?

 

మనం టీ, కాఫీ ల గురించి మాట్లాడుకుందాం. అలాగే వాటికి చేర్చదగ్గ ఆరోగ్యవంతమైన ప్రత్యామ్నయాలను కూడా తెలుసుకుందాం.

టీ మరియు కాఫీలు నరాల ఉత్ప్రేరకాలు. ఇవి మనం తాగిన వెంటనే మనకి ఓ శక్తివంతమైన భావనను కలిగిస్తాయి, కానీ ఆ తరువాత మనలోని శక్తి స్థాయి కాస్తా పడిపోతుంది. నరాల ఉత్ప్రేరకాలను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మనకి స్టామినా తగ్గి, శరీరం శక్తిని నిలువ చేసుకునే సామర్థ్యాన్ని దెబ్బతింటుంది. ఇది మనకు వెంటనే తెలియక పొవచు. కానీ దీర్ఘకాలంలో ఇలానే జరుగుతుంది. మరి వీటికి ప్రత్యామ్నాయాలు ఏమిటో తెలుసుకుందాం..

ప్రత్యామ్నాయాలు

మీరు గనుక ఉదయాన్నే ఒక గ్లాసుడు బూడిద గుమ్మడికాయ రసం తీసుకున్నట్లయితే, అది మిమ్మల్ని శక్తివంతం చేయడమే కాక మీ నరాలను చాలా శాంతపరుస్తుంది. బూడిద గుమ్మడికాయను రోజువారీ తీసుకుంటే, అది మీ మెదడు సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. కానీ అస్తమా ఉన్నవారు, సులువుగా దగ్గు జలుబుల బారిన పడేవారు, ఈ రసానికి కొద్దిగా తేనె లేదా మిరియాల పొడిని కలుపుకోవాలి. ఇలా చేయడం బూడిద గుమ్మడికి ఉన్న చేసే చాలవ స్వభావాన్ని కొద్ది మేర తగ్గిస్తుంది

నిమ్మ-అల్లం టీ మిమ్మల్ని తాజాగా, పుష్టిగా ఉండేలా చేస్తుంది. పైపెచ్చు, కెఫీన్ కు ఉన్నదుష్ప్రభావాలను ఇది కలుగజేయదు. దీన్ని మీరు ఇలా తయ్యారు చేసుకోవచ్చు

నాలుగున్నర కప్పుల నీటిని పాత్రలో మరిగించండి. నీళ్ళు మరుగుతుండగా, ఒక రెండు అంగుళాల తాజా అల్లపు ముక్కని 25 నుండీ 30 తులసి ఆకులతో దంచి, ఈ పేస్ట్ ను రెండు టీ స్పూన్ల ధనియాలతో కలిపి మరిగే నీటికి వేయండి. మరో రెండు మూడు నిమిషాలు మరగనివ్వండి. కప్పులలోకి టీని వడగట్టి, ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని, తేనె/బెల్లాన్ని రుచికి తగినట్టు కలుపుకోండి. వేడిగా అందివ్వండి !

మీ రోజువారీ ఆహారంలో సమతుల్యమైన పోషకాలను తీసుకోవడం ఎంత ముఖ్యమో, మీరు తినే ఆహారం గురించి విపరీతంగా చింతించకపోవడం కూడా అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి.

‘నేను ఇది తింటాను, ఇది తినను. నేను ఇలానే తినాలి, నేను అలానే తినాలి’ అంటూ సరిగ్గా తినడం కంటే కూడా ఆనందంగా తినడం చాలా ముఖ్యం. ఆహరం మీపై ప్రభావాలను చూపిస్తుంది, కానీ అది అంత ముఖ్యమైన అంశం కాదు. తినడంలో నిజమైన ఆనందం అంటే, మరో జీవం మీలో భాగమవ్వడానికి, లీనమవ్వడానికి, కలగలసిపోవడానికి, మీరుగా మారడానికి సిద్ధంగా ఉందన్న విషయం పట్ల ఎరుకతో ఉండడమే. మనిషికి తెలిసిన అతిగొప్ప సంతోషం ఇదే - ఎదో ఒక రీతిలో, తనది కానిది తనలో భాగమవ్వడానికి సిద్ధంగా ఉందన్న విషయం” ~ సద్గురు                                                                                               

 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1