సమ్మర్ టైమ్‌ సలాడ్‌

 

కావాల్సిన పదార్థాలు


స్వీట్‌కార్న్‌    -    సగం కప్పు (ఉడికించినవి)
జీలకర్ర    -    సగం టీ స్పూను
ఊదారంగు క్యాబేజీ    -    పావు కప్పు
బీన్స్‌    -    5 (చిన్నగా తరగాలి)
ఆలివ్‌ఆయిల్‌    -    2 టీ-స్పూనులు
పాలకూర    -    సగం కప్పు (చిన్నగా తరిగినది)
ఉప్పు    -    తగినంత
ఆమ్‌చూర్‌    -    1 టీ స్పూను
తైమ్‌    -     పావు టీ స్పూను
మిరియాల పొడి    -    సగం టీ స్పూను


చేసే విధానం :
-  బాణలిలో నూనెవేసి జీలకర్ర వేగాక బీన్స్‌, క్యాబేజి మగ్గించుకోవాలి. ఆ తరువాత స్వీట్‌కార్న్‌, పాలకూర కలిపి మగ్గించుకోవాలి. ఇవి వేగాక, మిరియాల పొడి, ఉప్పు, ఆమ్‌చూర్‌, తైమ్‌కలిపి-అందరికీ-వడ్డించాలి. ఇది చిన్న, పెద్ద అందరూ తినవచ్చు.

 

 
 
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1