హైదరాబాద్ కోటి దీపోత్సవం వేడుకల్లో సద్గురు!

నవంబర్ 4-2014 న, సద్గురు హైదరాబాద్‌లో ‘భక్తి’ టీ.వి, 'ఎన్ ' టీ.వి వారు కలిసి నిర్వహిస్తున్న 'కోటి దీపోత్సవం' కార్యక్రమంలో సద్గురు పాల్గొనబోతున్నారు.మీ అందర్నీ నవంబర్ నాలుగున కలుసుకునేందుకు ఎదురు చూస్తుంటాము! ఈ కార్యక్రమ పూర్తి వివరాలకు ఈ వ్యాసం చదవండి.
 
 

నవంబర్ 4, 2014న, సద్గురు హైదరాబాద్ వస్తున్నారని ప్రకటించడానికి మేమెంతగానో సంతోషిస్తున్నాము.

‘భక్తి’ టీ.వి, 'ఎన్' టీ.వి వారు కలిసి నిర్వహిస్తున్న 'కోటి దీపోత్సవం' కార్యక్రమంలో సద్గురు పాల్గొనబోతున్నారు. ప్రతీ సంవత్సరం 'కార్తీక'మాసంలో  నిర్వహించబడే ఈ కార్యక్రమంలో ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని, ఆ మాసపు ప్రతీ సాయంత్రం లక్షల దీపాలను వెలిగిస్తారు.  నవంబర్ 4 సాయంత్రం జరగనున్న ఈ ఉత్సవాన్ని సద్గురు పర్యవేక్షిస్తారు.

కార్యక్రమం ఈ క్రింది విధంగా ఉంటుంది:

తేది:   నవంబర్ 4, 2014
సాయంత్రం గం.5.30 ని :  'ఈశా ' సంగీత విభావరి.
సాయంత్రం గం.6.30 ని :  సద్గురు ప్రవచనం
సాయంత్రం గం.7.30 ని :  సద్గురుచే మొదటి దీప జ్వలనం.  పిమ్మట కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు లక్షల సంఖ్యలో దీపాలను వెలిగిస్తారు.

వేదిక:     

ఎన్.టి.ఆర్ గ్రౌండ్స్,
ఇందిరా పార్క్ ఎదురుగా, లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర,
హైదరాబాద్, ఇండియా.

ఒకవేళ మీరు ఈ ఉత్సవంలో పాల్గొనదలిస్తే, కార్యక్రమానికి ముందుగా విచ్చేసి, వేదికకు సాధ్యమైనంత సమీపాన ఉండండి. దీప జ్వలన కార్యక్రమం జరిగే స్థలం వెనుక, కూర్చునేందుకు అదనంగా సౌకర్యం కల్పించబడుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. మీతో పాటుగా మీ కుటుంబాన్నీ, స్నేహితులనూ, సహొద్యోగులనూ తీసుకు రావచ్చు.

కార్యక్రమంలో సద్గురు మాటలు ఆంగ్లం నుండి తెలుగులోకి అప్పటికప్పుడే తర్జుమా చేయబడతాయి.

అదనపు సమాచారం కోసం 99488 75588 నంబరును  సంప్రదించండి. కార్యక్రమంలో పాల్గొనేందుకు లేదా ఉత్సవ నిర్వహణలో సహకరించడానికీ ఇక్కడున్న పత్రాన్ని పూరించండి. form here.  మీ అందర్నీ నవంబర్ నాలుగున కలుసుకునేందుకు ఎదురు చూస్తుంటాము!

ప్రణామాలు,
'ఈశా' వాలంటీర్లు.

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1