ఉత్తర భారతంలో నదుల ర్యాలీకి వచ్చిన అమోఘమైన మద్దత్తులో మరో విశేషమేమిటంటే 90 శాతం మంది వాలంటీర్లు, ఏ ఈశా యోగా ప్రోగ్రాం చేయలేదు. ఈ ఉద్యమ ప్రచారానికి వాళ్ళు టీ షర్టులు, ప్లెకార్డులు, కప్పులు, బాటిల్స్, బానర్స్ ముద్రణకు, ఇంకా అనేక రకాల సామగ్రి కొరకు తమ సొంత డబ్బు ఖర్చు చేశారు. వాళ్ళు ఈ కార్యక్రమానికి పూర్తి స్పందన తేవడానికి స్కూళ్ళు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు ఇలా అన్నిచోట్లా తిరిగారు.

ఇది గొప్ప ప్రజా ఉద్యమం, తమిళనాడులోనూ, మిగతా దక్షిణాది రాష్ట్రాలలోనూ అనేక సంవత్సరాలుగా చేస్తున్న కృషితో వచ్చిన ఫలితాలతో పోలిస్తే ఈ స్పందన భిన్న మైనది. ఇక్కడి వాంటీర్లకు సద్గురు గురించి మహాశివరాత్రి ఆస్థా ఛానల్ ప్రసారాల ద్వారానూ, ఈశా లెహర్ సంచిక ద్వారానూ, యూట్యూబ్, ఇతర సాంఘిక మాధ్యమాల ద్వారానే తెలుసు. వారు సద్గురు చేసే పనులకు ఎంతో ప్రభావితం అయ్యారు. మార్గమంతా గ్రామీణులు సద్గురును ఆహ్వానించడానికి రోడ్ల మీదకు వస్తున్నారు, దానికి కారణాలు అనేకం. కొందరు ఎవరో ఋషి, సాధువు, నదులను కాపాడడానికి దేశమంతా సంచారం చేస్తున్నారని, మరి కొందరు ఒక ప్రత్యక్ష గురువును చూడడానికి ఈ ర్యాలీకి వస్తున్నారు. ఈ ఉద్యమం ఎంతమందికి చేరిందోనన్నదానికి లక్నో కార్యక్రమం ఒక ఉదాహరణ, హాలంతా ప్రజలతో, పిల్లలతో నిండిపోయింది.

26 ఉదయం, లక్నో ఒక శ్రావ్య సంగీత ధ్వనితో నిద్రలేచింది, ఒక మహోద్యమానికీ తెరదీసింది. మొదటి సారిగా, ఇద్దరు యోగులు యోగీ ఆదిత్యనాథ్(Yogi A), సద్గురు(A Yogi), దేశం ఎదుర్కుంటున్న అతి జటిల సమస్య గురించి ప్రజలకు అవగాహన తీసుకురావడానికి వేదిక మీద కలిశారు.ఇద్దరి మధ్య సంభాషణ కొత్త తరహాలో సాగింది. సద్గురు సమాధానాలు చెప్పడమే కాదు, ఆయన గౌ. ముఖ్యమంత్రి గారికి ప్రశ్నలు కూడా వేశారు. ఇటువంటి మఖ్య సమస్య మీద ఇలా ర్యాలీ తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రి ఎన్నో సార్లు సద్గురుకు ధన్యవాదాలు తెలియ జేశారు.

లక్నో గుండా ప్రవహించే గోమతి నది, ఉత్తర ప్రదేశ్ కు గర్వకారణమైన గంగా నదీ ఈ రాష్ట్రానికి ప్రధానమైనవి. గౌ. ముఖ్యమంత్రి ఈ నదుల పునరుద్ధరణకు జరుగుతున్న కృషి గురించి వివరించారు. ముఖ్యంగా పవిత్ర గంగా నది ప్రరవహిస్తున్న ఐదు రాష్ట్రాల్లో ‘నమామి గంగే’ పధకంలో జరుగుతున్న పనులు వివరించారు. ర్యాలీ ఓట్ల కోసం ఈ రాష్ట్రం చేయగల మద్దత్తుని గుర్తిస్తూ సద్గురు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు.

మోహిత్ చౌహాన్, భావపూర్ణ ఆలాపనలతో, శివుని భజనతో, వేదిక మీద, ఇద్దరు యోగులు ఉండడానికి తగిన వాతావరణం కల్పించారు. ఇది ఎప్పుడూ జరగనటువంటి కనవర్జేషన్ కార్యక్రమం. ఇద్దరూ  రెండోవారి భాష మాట్లాడలేరు, అయినా సంభాషణ నిరాఘాటంగా సాగింది. ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఈ ఉద్యమానికి మొత్తం ఉత్తర ప్రదేశ్ ప్రజల తరుపున తమ సూర్తి మద్దత్తు తెలియజేశారు. ఆయన ఇదేమీ రాజకీయ లేక సామాజిక విషయం కాదు, ఇది అత్యవసరమైన విషయం, మరి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి పూర్తి మద్దత్తు ఇస్తుంది అన్నారు. సద్గురు ఎప్పటిలాగానే ఎంతో వినయంగా హిందీలో కొన్ని మాటలు పలికారు. యోగీ ఆదిత్యనాథ్ తో ఆయన భాషలోనే ఒక ప్రశ్న వేసే ప్రయత్నం చేశారు. ఆయన హిందీ మాట్లాడడం ఎంతో మధురంగా ఉన్నది.

చిన్న చిన్న పిల్లలు కూడా ఉత్సాహంగా ర్యాలీలో పాల్గోవడం అంటే ఈ అంశం గురించిన అవగాహన ఈ తరంవారికి కూడా వస్తోందని అర్థం అని సద్గురు అన్నారు, ఈ ఉద్యమ ఫలితం చవి చూడడానికి  ఎన్నో సంవత్సరాలు పడుతుంది కాబట్టి, యువకుల సహకారం ఎంతో ముఖ్యమైనదని ఆయన అన్నారు. వారిలో చాలామంది వేదిక మీదకు వచ్చి ర్యాలీ గురించిన ప్రశ్నలు కూడా వేశారు. మిల్లీనియం స్కూలు విద్యార్ధులు ఒక చిన్న కార్యక్రమం కూడా చేశారు. ఈ సమస్య వారి సంభాషణల్లో తరచూ చోటుచేసుకోవడం నదులను పునరజ్జీవింపచేయడానికి ఎంతో మఖ్యం అన్నారు. సౌండ్స్ ఆఫ్ ఈశా వారితో ‘మోహిత్ చౌహాన్’ తన గానంతో కలపి అందరినీ మైమరపించాడు. కార్యక్రమం నదీ స్తుతితో ముగిసింది.

ఉత్తర ప్రదేశ్ ను మన సొంతం చేసుకుని, ర్యాలీ రాజస్థాన్ కు పయనమయ్యింది.