కాన్ పూర్ లో విద్యార్థులతో కార్యక్రమం - నదుల రక్షణ ఉద్యమం 23వ రోజు
 
 

కాన్పూరులో మేమేదో చిన్న ప్రోగ్రామ్ అనుకున్నది కాస్తా 1500 విద్యార్థులతో ప్రన్వీర్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని కార్యక్రమం ఒక పెద్ద ప్రోగ్రాంలా జరిగింది. మా వాలంటీర్లు మామూలుగానే సద్గురు రాకకు కొన్ని గంటల ముందే అక్కడకు చేరుకున్నారు, కాని ఆ కాలేజీ వాలంటీర్లు అప్పటికే ‘గురూజీ’ రాకకోసం ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.

మేము  PSIT (ప్రన్వీర్ సింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) లో ‘ఎకో క్లబ్’ నడుపుతున్న, ర్యాలీ ఫర్రి రివర్స్ ఏక్టివిటీ కో ఆర్డినేటర్, ఈ ప్రోగ్రముకు కూడా కో ఆర్డినేటర్ అయిన డా. సురీందర్ కౌర్ ను కలిశాము. ఆమె మాతో ‘మా MD గారు ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడినప్పుడు మాకు సద్గురు గురించి అసలు ఏమీ తెలియదు, కాని రెండు నెలల శ్రమ తరువాత, ఇంత పెద్ద  ర్యాలీలో మా వంతు కృషి చేసే అవకాశం కలిపించినందుకు మేము ఆయనకు(సద్గురు) కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము’ అన్నారు. MD శైలజా రాజ్ గారు కూడా, వారి(సద్గురు) రాకతో మా భూమి పవిత్రమైందని, ఎంతో ఆనందంగా  అన్నారు.

కాలేజీ విద్యార్ధులు, అధ్యాపకులు మొత్తం ఐదు వేలమందీ మిస్ కాల్ ఇచ్చారు. అంతే కాక కాలేజీ లోని క్లబ్బులు గత నెల రోజులుగా అనేక మాల్స్, బహిరంగ ప్రదేశాలలో ర్యాలీలు నిర్వహించాయి.

మొదటి సంవత్సరం విద్యార్ధులు, అధ్యాపకులు, కొందరు ఆహ్వానితులతో సద్గురు ప్రసంగించారు. ఆడిటోరియంలో చోటు లేకపోవడం వల్ల మిగతా వారు పాల్గోలేకపోయారు. కాని కాలేజీ వెబ్ సైట్ లో లైవ్ వెబ్ కాస్ట్ జరగడం వల్ల కార్యక్రమం అందరికీ అందుబాటులో ఉంది. కొందరు విద్యార్ధులు, అధ్యాపకుల నుంచి వచ్చిన ప్రశ్నలకు సద్గురు సమాధానాలిచ్చారు. సద్గురు వేదిక దిగినప్పుడు, కొందరు విద్యార్ధులు, అధ్యాపకులు ఆయన వెనక పరిగెత్తారు, ఆయనతో కొంత సమయం గడిపినందుకు తమ సంతోషం వ్యక్త పరచారు. మెత్తానికి తుఫానులా జరుగుతున్న కార్యక్రమానికి తుఫాను లాగానే ప్రతిస్పందన వచ్చింది.

WhatsApp-Image-2017-09-25-at-2.07.04-PM-640x480WhatsApp-Image-2017-09-25-at-1.32.17-PM-640x381WhatsApp-Image-2017-09-25-at-1.31.37-PM-640x427WhatsApp-Image-2017-09-25-at-1.16.31-PM-640x480WhatsApp-Image-2017-09-25-at-1.31.37-PM-1-640x427WhatsApp-Image-2017-09-25-at-1.16.29-PM-640x480WhatsApp-Image-2017-09-25-at-1.16.25-PM-545x640Blog_BannerWhatsApp-Image-2017-09-25-at-1.16.23-PM-640x336WhatsApp-Image-2017-09-25-at-1.35.09-PM-640x480WhatsApp-Image-2017-09-25-at-1.31.36-PM-640x427WhatsApp-Image-2017-09-25-at-2.05.21-PM-640x480

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1