నదుల రక్షణ ఉద్యమం - జైపూర్ (రాజస్థాన్)
 
 

తమిళనాడుకు బయట జరిగిన కార్యక్రమాలలో జైపూర్ కార్యక్రమం అతి పెద్దదిగా, ఎక్కువ మంది హాజరైనదిగా నిలచింది. రంగు రంగు దుస్తలతో దాదాపు 12000 రాజస్థానీయులు, రివర్ ర్యాలీ ప్లెకార్డులు ఉత్సాహంగా ఊపుతూ JECC  స్టేడియాన్ని నింపివేశారు. ఎడారితో నిండిన రాష్ట్రానికి నీటి విలువ నిజంగానే తెలుసు.

సంస్కృతి, సంప్రదాయం, పరాక్రమం నిండుగా ఉన్న ఈ ఎడారి భూమి, అన్నింటికంటే పెద్దదైన దివ్య సరస్వతీ నది ఎండిపోవడం చూసిన రాష్ట్రం ఎంతో ఉత్సాహంగా ఈ ర్యాలీని స్వాగతించింది. రాజస్థాన్ రూట్స్ గాయకుడు మమేఖాన్ మొదట్లోనే ఆలాపించిన ‘వెల్కం టు రాజస్థాన్’ గీతం ర్యాలీలో పాల్గొన్నవారి హృదయాన్ని హత్తుకున్నది, రాజస్థానీయుల అతిథి మర్యాదలకు తార్కాణంగా నిలచింది. ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా వారు ఆలాపించిన రాజస్థాన్, సింద్ సుఫీ కవుల జానపద గీతాలు హాలు మొత్తాన్ని ముంచెత్తింది. మహాశివరాత్రి  సమయంలో రాజస్థాన్ రూట్స్, సౌండ్స్ ఆఫ్ ఈశా కలిసి ఎంత అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారో మనకు తెలుసు. మళ్ళీ ఆ ఆనందం ఇప్పుడు మరోసారి మనకు అందింది.

గౌ. ముఖ్యమంత్రి శ్రీమతి వసుంధరా రాజే మొదటే, ‘నేను, వ్యక్తిగతంగానూ, రాజస్థాన్ ప్రజల తరపునా, రాజస్థాన్ మీదుగా వెళుతున్న ఈ ర్యాలీకి స్వాగతం పలుకుతున్నాను, ఈ ర్యాలీ మన నీటి పరిస్థితిని మెరుగుపరచుకోవాలన్న మన దృఢ నిశ్చయాన్ని మనకు గుర్తు చేస్తున్నది. మనం సద్గురు, ఈశా ఆశ్రమం నుంచి వారితో ప్రయాణిస్తున్న కార్యకర్తలకు చెప్పేదేమిటంటే మీరిక్కడున్నది ఒక్క రోజే అయినా మీరు మా ఆతిధ్యాన్ని చిరకాలం గుర్తుంచుకుంటారు’’ అని అన్నారు.

రాజస్థాన్లో నీటి ఎద్దడి సమస్యా పరిష్కారానికి అక్కడి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్గురు కొనియాడారు, వారిని వచ్చే మూడు సంవత్సరాలలో మరింత వేగంగా మరిన్ని కార్యక్రమాలను నిర్వహించమని కోరారు. సద్గురు రాజస్థాన్ పురుషులను ప్రభుత్వానికి ఈ విషయంలో మరింత తోడుగా ఉండమని చెప్పారు. అప్పుడు, ప్రపంచ మహిళా దినం నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వసుంధరా రాజే, మహిళలను కూడా పాల్గొనేలా ప్రోత్సహించమని అడిగారు. నవ్వుతూ సద్గురు ఆమె కోరికను కూడా తెలియపరచారు.

ఆటోమొబైల్స్ పై కళాకృతులు సృష్టించే, రాజస్థానీ కళాకృతులను సద్గురు వాహనం మీద, మిగతా వాహనాల మీదా రచించారు.

అమరుడు భగత్ సింగ్ జయంతి నాడు పంజాబ్ లోకి ప్రవేశించడం ఎంతో గౌరవప్రదం అని సద్గురు ట్వీట్ చేశారు.అనంతరం చండీఘడ్ కార్యక్రమానికి సద్గురు పయనమయ్యారు.

jaipur-25-640x366jaipur-24-640x358jaipur-21-1jaipur-23-1-1-640x370jaipur-5-640x336jaipur-13-640x292Rally-for-Rivers-Event-at-Jaipur-37-640x319jaipur-10-640x424Rally-for-Rivers-Event-at-Jaipur-6-640x332Rally-for-Rivers-Event-at-Jaipur-7-640x374Rally-for-Rivers-Event-at-Jaipur-28-640x364Rally-for-Rivers-Event-at-Jaipur-30-640x383WhatsApp-Image-2017-09-28-at-12.38.04-1-640x427Rally-for-Rivers-Event-at-Jaipur-36-1-640x312Rally-for-Rivers-Event-at-Jaipur-42-640x397Rally-for-Rivers-Event-at-Jaipur-35-640x384

 

 
 
  0 Comments
 
 
Login / to join the conversation1