కావాల్సిన పదార్థాలు:

రాగి పిండి - వంద గ్రాములు 
నీరు     - 3 గ్లాసులు
కరపట్టి లేదా బెల్లం - 2 టీస్పూనులు


చేసే విధానం :

  • మందంగా ఉన్న గిన్నెలో 3/4 గ్లాసు నీరు మరిగించాలి. ఇంకో గిన్నెలో 1/4 గ్లాసు నీరు ఉండకట్టకుండా-రాగిపిండి కలుపుకోవాలి. ఇది పొయ్యి మీద ఉన్న గిన్నెలో వేసి మెల్లగా లుపుకోవాలి. పొయ్యిమీద 45 నిమిషాలు ఉంచాలి. నిదానంగా అడుగంటకుండా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయాక బెల్లం కలిపి చల్లారాక  తినాలి. 
  • ఇది ఓట్స్, రవ్వ అన్ని రకాల పిండిలతో చేసుకోవచ్చు. జొన్న, రాగి, చోళ్ళు (రాగుల గంజికి-మజ్జిగ కలిపి సేవిస్తే చాలా రుచిగా ఉంటుంది). ఇవి షాపులలో దొరుకుతాయి. తీపి ఇష్టమైనవారు బెల్లం లేక చక్కెర కలిపి తాగవచ్చు. 
  • మజ్జిగ ఉప్పు వేసి తాగవచ్చు. ఇందులో కొబ్బరి-పాలు కూడా కలిపి తాగవచ్చు. పిల్లలకు ఇది చాలా మంచిది. ఇది త్వరగా జీర్ణం అవుతుంది. వొంటికి చాలా అరోగ్యకరమైన ఆహారం. దీనితో 6 లేక 9 నానపెట్టిన వేరుశనగ పప్పులు తింటే మంచి పోషక ఆహారం తీసుకున్నట్లే.