కావాల్సిన పదార్థాలు :

టమేటాలు          -          100 గ్రా.

పసుపు రంగు క్యాప్సికమ్‌    -          100 గ్రా.

కీరా దోసకాయ    -          100 గ్రా.

బ్లాక్‌ ఆలీవ్‌          -          15

బ్రాక్కోలి -          కొద్దిగా

పన్నీరు   -          కొద్దిగా - తీసుకోవాలి

పాస్తా (స్ప్రింగ్‌)   -          100 గ్రా. (ఉడకపెట్టాలి)

పుదీనా   -          10 ఆకులు

నిమ్మరసం          -          సగం చెక్క

ఉప్పు     -          1 టేబుల్‌ స్పూను

మిరియాల పొడి   -          1 టేబుల్‌ స్పూన

ఆలివ్‌ ఆయిల్‌     -          3 టేబుల్‌ స్పూనలు

చేసే విధానం :

టమేటా, పసుపురంగు క్యాప్సికమ్‌, కీరా, బ్లాక్‌ ఆలివ్‌, బ్రాకోలి, పన్నీరు అన్నీ పొడవుగా ముక్కలు చేసుకోవాలి. ఉడకపెట్టి చల్లార్చిన పాస్తా ఆరబెట్టాలి. పుదీనా, ఆలివ్‌ ఆయిల్‌, నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు అన్నీ కలిపి కొత్తిమీర చల్లి అందరికీ - వడ్డించాలి.