కావాల్సిన పదార్థాలు:

బియ్యం పిండి      -          అరకేజి

పుట్నాలు            -          అరకేజి

మెంతులు           -          50 గ్రా.

శొంఠి    -          50 గ్రా.

చేసే విధానం:

పుట్నాలు, మెంతులు, శొంఠి, విడివిడిగా వేయించుకోవాలి (మాడకుండా).

- బియ్యం పిండి కలిపి మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. పిండి డబ్బాలో ఉంచుకోవాలి.

కావాల్సిన పదార్థాలు:

పైన చెప్పినట్లు తయారుచేసిన పిండి -          1 కప్పు

నల్లబెల్లం            -          1 కప్పు

నీరు      -          3 కప్పులు

మంచినూనె         -          సగం కప్పు

చేసే విధానం :

- పొయ్యిమీద నీరు పెట్టి నల్ల బెల్లం వేసి రెండు ఉడుకులు వచ్చాక వడకట్టాలి.

వడకట్టిన నీరు మళ్ళీ మరిగించాలి.

వేరే గిన్నెలో 4 టీస్పూనులు నూనె వేసి ఆడించిన పిండి 1 కప్పు కలుపుకోవాలి. తరువాత మరిగించిన బెల్లం నీటిలో కొంచెంగా కలుపుకోవాలి. ఇది కలిపేటప్పుడు పొయ్యి సిమ్లో ఉంచు కోవాలి. తరువాత 20 నిమిషాలు మూత పెట్టి ఉడికించి, తరువాత పొయ్యి ఆపుకోవాలి.

ఆఖరున బెల్లం నీరు తేరు కుంటుంది.

అది వడకట్టి పెట్టు కోవాలి. ముట్టుకుంటే చేతికి-అంటకుండా నూనె చేతికి పూసుకుని ఉండలు కట్టి, తినాలి.

ఇది ఆడపిల్లలకి మంచిదినరాలకి బలం.