1000 / 500  కరెన్సీ నోట్లను వాడుకలోలేకుండా చేయడం అన్నది ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేపట్టిన అడుగు.  దీనిగురించి ఒక పత్రిక వారు సద్గురు అభిప్రాయాన్ని అడిగినప్పుడు , సద్గురు ఏమంటున్నారో ఈ ఆర్టికల్ లో చదివి తెలుసుకోండి.

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల చేపట్టిన అడుగు - అత్యధిక విలువ ఉన్న కరెన్సీ నోట్లను వాడుకలోలేకుండా చేయడం, అన్నది ఎంతో విప్లవాత్మక, మేచుకోదగ్గ , అత్యంత గొప్ప చర్య . ఇది  ‘స్వఛ్ భారత్’ కు స్పష్టమైన అభివ్యక్తీకరణ. ఇది చట్టాన్ని గౌరవించే పౌరులును పారవశ్యంలో ముంచేసింది, కానీ  కొద్దిగా చట్ట ప్రకారంగా లేనకుండా వ్యాపారం నిర్వహించే  వారికి కొంచెం ఆందోళనగా ఉంది. ఏ హెచ్చరికా లేకుండా ఈ పని చేయలేదు. ఎన్నో సంకేతాలు ఇచ్చారు. కానీ  ప్రజలు ఆ సూచనలను పట్టించుకోలేదు.

ఈ చర్య జనజీవన స్రవంతిలో జరిగే అన్ని ఆర్థిక కార్యకలాపాల కోసం  తీసుకునటువంటిది ఇంకా  సరియైన చర్య. సంప్రదాయంగా జరుగుతున్న వ్యాపారాలు తాత్కాలికంగా గందరగోళంలో పడతాయి. చాలా మందికి ఏమి చెయ్యాలో పాలుపోదు, వాళ్ళు ఏదో నేరం చేసారని కాదు, మనదేశంలో 50 శాతానికి దిగువగా వ్యాపారాలన్ని పన్ను పరిధిలోకి రాకుండా నెరవేరుతుంటాయి. దానికి కారణాలు అనేకం.  ప్రజలు, వాళ్ళు చెల్లించే పన్నులు మౌలిక సదుపాయాలరూపంలో, సేవలూ తదితర మార్గాలా ద్వారా తిరిగి తమకి అందుబాటులోకి రావని అభిప్రాయం కలిగి ఉన్నారు. అందువల్ల ప్రజలు "నేను పన్ను చెల్లించను," అన్న ధోరణికి వచ్చేసారు.

దేశానికి ఒకింత శస్త్రచికిత్స అవసరమే, ఎందుకంటే దానివల్ల దేశ ఆర్థిక ప్రగతి వికసిస్తుంది.

కానీ దేశం యావత్తూ తమ చర్యలని పునశ్చరణచేసుకుని సరిదిద్దుకోవలసిన సమయం వచ్చింది. కొన్ని ఇబ్బందులూ, కొంతమందికి కష్టమూ కలుగుతుందన్నది నిజమే అయినా, కొంతమంది పడుతున్న పాట్లు - దానికి  వాళ్ళు  అర్హులుకాకపోయినా, ఈ ప్రక్రియ మనం ఎదుర్కోవలసిందే. దేశానికి ఒకింత శస్త్రచికిత్స అవసరమే, ఎందుకంటే దానివల్ల దేశ ఆర్థిక ప్రగతి వికసిస్తుంది. ప్రపంచమంతా భారతదేశం వైపు అవకాశాలకోసం చూస్తోంది. ప్రపంచం లోని పెట్టుబడుల అవకాశాలూ, ఆర్థిక ప్రణాళికలూ ఇక్కడ ఉండే అవినీతి, అవకతవకలు చేయడం,  అసమర్థత, మనం ప్రారంభించినది ఏదీ పూర్తిచెయ్యలేకపోవడం  మొదలైన లక్షణాలుచూసి, మనదేశం పేరుచెబితే భయపడి ఇన్నాళ్ళూ తప్పించుకుని వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఈ రకమైన అభిప్రాయం చాలా నాటకీయంగా మార్పుచెంది, ఆర్థికవనరులన్నీ మదుపుకోసం మనవైపు పరిగెత్తుతున్నాయి . దానివల్లే చాలా త్వరత్వరగా మార్పులు జరగడం మనం చూస్తున్నాం. ఈ వికాసం స్థిరంగా వేళ్ళూనుకుని ఉండాలంటే, ప్రతీదీ పారదర్శకంగా ఉండడం, లోగుట్టు గా పనులు చేయకుండా  ఉండడం అన్నది అత్యవసరం. తక్కిన ప్రపంచం మనతో కలిసి పనిచెయ్యాలంటే, మన చర్యల్ని ఎన్నో స్థాయుల్లో మనం సరి చేసుకోవలసిందే.

ఇంతకుముందు లాగా కాకుండా ,   ప్రపంచం అంతా  మనకి అందుబాటులో ఉన్న ఈ తరుణంలో, ఈ మార్పును తీసుకురావడానికి నడుం కట్టుకున్న నాయకత్వం మనకున్న ఈ తరుణంలో, మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఈ సమయం ఒక చక్కని అవకాశం. భవిష్యత్తులోనూ మనకి ఇలాంటి నాణ్యతగల నాయకులే వస్తారు. ఈ తరం యథాస్థితిని కొనసాగించాలని మాటాడే నాయకుల్ని ఎన్నుకునేందుకి మొగ్గుచూపదు.  ప్రజలకి పనులు జరగాలి.

రాబోయే రోజులు సరికొత్త భారతదేశాన్ని... ఇప్పటికంటే మెరుగైన భారతదేశాన్ని చూస్తాయన్న నమ్మకం నాకుంది.  ప్రతి వ్యక్తీ, తను ఏ రంగంలో ఉన్నప్పటికీ, ఏ బాధ్యతలు వహిస్తున్నప్పటికీ,  పనులు సక్రమంగా ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. కేవలం ప్రభుత్వం మాత్రమే ఈ పని చెయ్యలేదు. లేదా కేవలం ఒక నాయకుడెవరో చెయ్యలేరు.  ఇది ప్రతి పౌరుడూ చెయ్యాలి!

ప్రేమాశిస్సులతో,
సద్గురు 

Source: http://btvi.in/m/article/read/opinion/7841/demonetisation--a-remarkable-step-by-pm-modi