కావాల్సిన పదార్థాలు


మొక్కజొన్న అటుకులు    -    100 గ్రా.
క్యారెట్, బీన్స్, క్యాబేజి    -    రుచికి తగినంత (చిన్నముక్కలు)
తాలింపు    -    ఆవాలు, నూనె, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, కరివేపాకు
ఉప్పు             -    తగినంత


చేసే విధానం :

ముందు బాణలిలో తాలింపు వేసి కూరగాయలు మగ్గించుకోవాలి. ఇందులో నానపెట్టి బట్టలో ఆరపెట్టిన మొక్కజొన్న అటుకులు వేసుకోవాలి. ఉప్పు వేయాలి. 2 నిమిషాలు మగ్గించి కలియపెట్టి, దింపుకోవాలి. ఇక తినటానికి రెడీ అవుతుంది.