ఆదియోగి విగ్రహ ప్రతిష్టాపనకు సద్గురు ఆహ్వానం..
 
Pinocchio - The Truth About Lying
 

ఫిబ్రవరి 24, 2017 మహా శివరాత్రి పర్వదినాన ఈశా యోగా కేంద్రంలో 112 అడుగుల ఎత్తైన ఆది యోగి శివుని విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాము.  ఇది  భూమ్మీదనున్న   పెద్ద కట్టడాల్లో  ఒకటవ్వడం మాత్రమే కాదు,  మనిషి తన పరమోన్నతన్నత స్థితికి చేరుకునేందుకు ఉన్న 112 మార్గాలను సూచించే చిహ్నం కూడా.

Sadhguru

ఈ ఆదియోగి ముఖం సజీవంగా, చొచ్చుకుపోతూ, మన తరువాతి కాలంలో కూడా ఎంతో మందికి ప్రెరణనిస్తుంది. ప్రజలు “ ఈ దేశంలో ఆకలితో అలమటిస్తున్న పిల్లలున్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులున్నారు, ఈ స్మారక చిహ్నం అవసరమా” అని ప్రశ్నిస్తారు. ఏదో పెద్ద ఘనకార్యం చేశాం అన్న భావన పొందటం కొసం ఈ ముఖచిత్రాన్ని ప్రతిష్టించడంలేదు. యోగ శాస్త్రానికి మునుపెన్నడూ లేని విధంగా పునరుద్దరణ కల్పించటానికి, మేము దీనిని సజీవశక్తిగా వినియోగించదలచుకున్నాం. ఇప్పుడు ప్రజల్ని చేరుకోటానికి ఉన్న వివిధ మార్గాలు మునుపెన్నడూ లేవు. మీరు గమనించినట్లైతే ఈ భూమ్మీద జీవించిన గొప్పవారందరికీ ఎంతో శక్తి సామర్ధ్యాలు ఉన్నప్పటికీ, ఇప్పటి పరిస్థితులలో ప్రజల్ని చేరుకోటానికి ఉన్న పలు సదుపాయాలతో పోల్చి చూస్తే వారికున్న అవకాశం చాలా తక్కువ. అప్పటివారికి లేని సాంకేతికత మనకి అందుబాటులో ఉంది కాబట్టి మనం ప్రతి ఒక్కరమూ కూడా, అప్పట్లో మహానుభావులు చేసినదానికంటే లక్ష రెట్లు ఎక్కువ చేసి చూపించాలి.

అంతఃశ్రేయస్సు పొందటానికై ఉన్న విజ్ఞాన ప్రక్రియను తిరిగి వెలుగులోకి తీసుకువచ్చే క్రమంలో విశ్వాసంతో పనిలేని, ఏ పిడివాదంతో సంబంధంలేని, తత్వ రహితమైన ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ కావాలి. అది కేవలం ఒక విధానం, ఒక ప్రక్రియ అంతే. అది సాధించటానికే ఈ కీర్తివంతమైన ముఖం. ఇది ఒక్కసారే జరుగుతుంది. చెప్పాలంటే, ఎన్నో జన్మల్లో ఒకసారి వచ్చేది. ఈ ముఖం చాలా కాలం పాటు ఈ భూమ్మీద సజీవమై ఉండి, దీని సారూప సాన్నిధ్యం ప్రపంచంలోని లక్షల మందికి ప్రేరణ కలిగిస్తుంది. మీరు దీనిలొ పాలుపంచుకోవాలి...!

ఈ గ్రహంపై వెలుగొందబోయే అతిపెద్ద ముఖం

ఆదియోగి రూపం – ఈ గ్రహం మీదే అతి పెద్ద ముఖం, ఒక అద్భుతమైన ముఖం, 112 అడుగుల ఎత్తైన ఈ ముఖం విముక్తిని సూచిస్తుంది.  ప్రపంచాన్ని విముక్తి మార్గం వైపుకు మళ్ళించడానికి, ఈ ముఖాన్ని మేము ఒక సరూప సాన్నిధ్యంగా ఉపయోగించాలనుకుంటున్నాము. అన్నిటి నుంచి విముక్తి, మిమల్ని బంధించి వుంచే దేనినుంచైనా సరే. ఈ గ్రహం మీద తదుపరి తరం ప్రజలు, కేవలం నమ్మకాల మీదే ఆధారపడే వారుగా కాక సత్యాన్వేషకులుగా మారగలగడం, నేడు చాలా ముఖ్యమైన విషయం. రాబోయే దశాబ్దాలలో, మనం పట్టుకు వేళ్ళాడుతున్న ఎన్నో పాత నిర్మాణాలు కూలిపోయినప్పుడు, మీలో విముక్తి పొందాలనే ఆకాంక్ష  పెరుగుతుంది. ఆటువంటి కోరిక పెరిగినప్పుడు, ఆదియోగి ఇంకా యోగేశ్వర లింగము ఎంతో ముఖ్యమైనవి అవుతాయి.

మేము ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం ఆదియోగిని ఏర్పాటు చేస్తున్నాము. ఓ పరిపూర్ణ యోగిగా  ప్రాణప్రతిష్ఠ చేస్తున్నాము. ఆదియోగి, మీ  అసౌకర్యం, బాధలు, వ్యాధులు , పేదరికం అన్నింటికీ మించి జీవన్మరణ ప్రక్రియ నుంచీ మీకు విముక్తి కలిగిస్తాడు. కాబట్టి ఈ ముఖం ఈ గ్రహం మీద చాలా కాలం ఉంటుంది. ఖచ్చితంగా దాని సరూప సాన్నిధ్యం, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలకు స్ఫూర్తినిస్తుంది. ఇది జీవితకాలంలో ఒకసరే వస్తుంది. నిజానికి ఎన్నో జీవితకాలాల్లో ఒకసారి. మీరందరూ తప్పకుండా రావాలి!

ప్రేమాశిస్సులతో,
సద్గురు
 
 
  0 Comments
 
 
Login / to join the conversation1