లింగ భైరవి దేవి ఆలయంలో ప్రతి సంవత్సరం మహాలయ అమావాస్య నాడు మన పూర్వీకులకు కర్మ కాండ చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ వ్యాసం చదవండి..

ప్రతి సంవత్సరం మహాలయ అమవాస్య నాడు జరిగే కాలభైరవ శాంతి ప్రక్రియ ఈ సంవత్సరం సెప్టెంబరు 19న, లింగభైరవిలో జరగనుంది. పవిత్ర అమవాస్య రాత్రి జరిగే ఈ ప్రక్రియ పూర్వీకులకు, గతించిన బంధువులకు, ఇంకా కుటుంబ సంక్షేమానికి చేసేది. ఈ కర్మకాండ ప్రతి సంవత్సరం మహాలయ అమవాస్య నాడు గతించిన కుటుంబ సభ్యుల జ్ఞాపకార్ధం జరపవచ్చు.

భారతీయ సంస్కృతిలో, చనిపోయిన వారి శ్రేయస్సు కోసం జరిపే కర్మకాండలు అతి విశిష్టమైనవి. చనిపోయినవారి వయస్సు, వారి జీవన విధానం, మరణానికి కారణం, ఇలాటి విషయాల ఆధారంగా, నిర్దేశించబడిన ఈ కర్మ కాండలు - జీవి ఒక దశనుండి మరో దశకు మారడం తేలికగా జరగడానికే గాక, వారి ఆధ్యాత్మిక పరిణితికికి కూడా దోహదం చేస్తాయి.

దురదృష్టవశాత్తూ గత రెండు శతాబ్దాల కాలంగా, ఈ ప్రక్రియలు సమాజంలో చాలా వరకు వక్రీకరణకు లోనైనాయి లేక కనుమరుగైనాయి. కాలభైరవ శాంతి, ఒక వ్యక్తి శరీరం వదలినప్పుడు, అటువంటి దుర్బల స్థితిలో కావలసిన సహాయం అందించడానికి సద్గురుచే ప్రారంభించబడిన ప్రక్రియ.

కాలభైరవ శాంతి ప్రక్రియ:

గతించిన వారి ఫొటోతోపాటు వారి పేరు, పుట్టిన రోజు, లేక ఖచ్చితమైన పుట్టిన సంవత్సరం. మరణించిన తేదీ లేక సంవత్సరం, లేక మరణించిన వారి తల్లిదండ్రుల పేర్లు.

మరణించినవారి ఫొటో అప్ లోడ్ చేయాలి((గ్రూఫ్ పొటో పనికిరాదు, వారు బ్రతికి ఉన్నప్పుడు తీసిన ఫొటో అయి ఉండాలి)

48 రోజుల తరువాత గర్భస్రావం గాని, నిర్జీవంగా పుట్టిన బిడ్డ అయితే, తల్లి ఫొటో (గర్భంతో ఉన్నప్పుడు తీసిన ఫొటో ఐతే ఉత్తమం) అప్ లోడ్ చేయాలి.

కాలభైరవ శాంతి ప్రక్రియ కుటుంబ సంక్షేమం కోసం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం మహాలయ అమవాస్యనాడు, లేక ప్రతి సంవత్సరం ఏదో ఒక అమవాస్యనాడు కూడా చేయవచ్చు.

కాలభైరవ శాంతి వచ్చే పది సంవత్సరాలకు ఒకేసారి రిజిస్టర్ చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు:

రిజిస్ట్రేషన్ ఫారం దాఖలు చేయడానికి: lingabhairavi.org/register

ఈ మైల్:  info@lingabhairavi.org

మొబైల్: (+91) 83000 83111

 

శ్రీ యోగినీ ట్రస్ట్

లింగభైరవి, ఈశానా విహార్ (పోస్ట్)

కోయంబత్తూర్ - 641114

www.lingabhairavi.org