• మీరు పొందాలనుకుంటే, మీరు ఇవ్వవలసిందే. ఇదేదో అంగట్లో సిద్ధాంతం కాదు, ఇదే జీవన విధానం.

1  

  • మీ ఆలోచన, భావోద్వేగాల పరంగా మిమ్మల్ని మీరు ఈ ప్రపంచం నుండి ఎంత ప్రత్యేకం చేసుకుంటారో, మీరు జీవితం నుండి అంతగా దూరమైపోతారు.

2  

  • అవగాహన లేకుండానే మాట్లాడే కాలం ఇది. జీవితాన్నితెలుసుకోవాలంటే మీకు అవగాహన అవసరం.

3  

  • ఈ అస్థిత్వం ఉద్దేశ్యం జీవించడమే. అది మరే ఇతర ఉద్దేశ్యాలూ అవసరం లేనంత బ్రహ్మాండమైనది, జటిలమైనది, అద్భుతమైనది.

4  

  • మీ ప్రస్తుత నిర్భంధతల ఆధారంగా జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. కొన్ని సంవత్సరాల తరువాత వెనక్కి తిరిగి చూసినా కూడా, అది సరైన నిర్ణయమే అనిపించాలి.

5

ప్రతిరోజూ మీ మొబైల్ ద్వారా సద్గురు సూక్తులను తెలుగులో పొందవచ్చు, ఇక్కడ సబ్ స్క్రైబ్ చేసుకోండి: Subscribe to Daily Mystic Quote.