నమస్కారం,
ఈశా ఒక సరికొత్త ఉత్సాహభరితమైన అధ్యాయాన్ని మొదలుపెట్టనుంది.
అంతర్జాతీయ యోగాదినోత్సవమునకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన అద్భుతమైన ప్రతిస్పందన వల్ల సద్గురు ఇప్పుడు సరికొత్తగా తెలుగులో మొట్టమొదటి సారిగా ఒక మూడు రోజుల కార్యక్రమాన్ని రూపొందించారు.ఈ కార్యక్రమo తమిళనాడులో ‘ఉయిర్ నొక్కం’గా ఎంతో ఆధరణ పొందింది. ఇప్పుడు ఇది తెలుగులో ‘జీవం –జ్ఞానం, ధ్యానం, ఆనందం’గా మన ముందుకు రానుంది.
మెడిటేటర్లను జీవం టీచర్లుగా రూపుదిద్దుకోవటానికి ఈశా పిలుపునిస్తుంది.చాలా మందికి నిజంగా తమ స్థాయికి తగిన పని చేసే అవకాశం ఎంతో అరుదుగా వస్తుంది. అతి కొద్ది మందికి వారికంటే ఎంతో ఉన్నతమైన దానిని చేసే అవకాశం వస్తుంది. ఈశా యోగా టీచర్లకు ఈ ప్రత్యేక అవకాశం ఉంది.ఇది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో ఉన్న మన తెలుగువారికి యోగాను అందించే మహోన్నత అవకాశం!
ఈ కార్యక్రమానికి నమోదు చేసుకున్న వాలంటీర్లును ఎంపిక చేసుకున్న తరువాత వారికి ఈశా యోగా సెంటర్, కోయంబత్తోరు లో ౩ వారముల శిక్షణ ఇవ్వబడుతుంది.

ఎంపిక కొరకు:
మిమల్నిమీ లోకల్ సెంటర్లో ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. ఎంపిక అయిన తరువాత మీకు ఒక అప్లికేషను పంపించబడుతుంది.
ఆశ్రమంలో జరిగే ఈ మూడు వారముల శిక్షణ అక్టోబర్ రెండవ వారంలో మోదలవుతుంది. (Dates: Nov 2015 and
Jan 2016).

ట్రైనింగ్ షెడ్యూల్
అక్టోబర్ రెండొవ వారంలో మీ స్థానిక సెంటర్లో మొదలు అవుతుంది.

అనంతరం
నవంబర్ 19 - డిసెంబర్ 2, 2015 & జనవరి 4 - 10, 2016 ఈశా యోగ సెంటర్,కోయంబత్తూరు

శిక్షణకు అవసరమైన అర్హతలు.
• ఇన్నర్ ఇంజనీరింగ్ మరియు భావ స్పందన కార్యక్రమాలు పూర్తి చేసి ఉండాలి.
• ఆశ్రమంలో మూడు వారముల శిక్షణ పొందాలి.
మరిన్ని వివరాలకు సంప్రదించండి, 9948875588
ఈ ఫార్మ్ ను పూర్తి చేసి ముందుగా నమోదు చేసుకోండి. :
http://tinyurl.com/Jeevam-pre-reg

మీరు నమోదు చేసుకున్న తరువాత మేము మిమల్ని త్వరలో సంప్రదిస్తాము.
ప్రణామములు,
ఈశా  వాలంటీర్లు.